TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం

జూలై, ఆగస్టులో శ్రీవారి దర్శన టిక్కెట్లను శనివారం ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. రూ. మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు అందుబాటులోకి తెస్తారు.

FOLLOW US: 

జూలై, ఆగస్టు నెలల్లో తిరుమల ( Tirumala ) శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ( Darshan ) అత్యంత కీలకమైన సమాచారం ఇది. రెండు  నెలలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను (  Special Darshan Tickets ) శనివారం అంటే మే 21వ తేదీన అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించంది.  జూన్‌ నెల కు సంబంధించిన టిక్కెట్లకు ఇంతకు ముందే జారీ చేశారు. ఈ కారణంగా జూలై, ఆగస్టు టిక్కెట్లను మాత్రమే ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్నారు. ఒక్కో టిక్కెట్ ధర రూ. మూడు వందలు.  నెలకు 7లక్షల 60వేల టిక్కెట్ల చొప్పున ..  ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్‌ లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచుతారు. 

వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ

సర్వదర్శనం టికెట్లను ( Sarva Darshan Tickets ) రోజుకు 30 వేల చొప్పున ఆఫ్‌లైన్‌లో .. తిరుమలలోని భూదేవి కంప్లెక్స్‌, శ్రీనివాస కంప్లెక్స్‌, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో.. భక్తులకు అందించనున్నారు టీటీడీ అధికారులు. శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ టైం స్లాట్ విధానంపై ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా కలియుగ దైవాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగా కంపార్ట్ మెంట్లలో ( compartments )  వేచియుండే పనిలేకుండా సర్వదర్శనం టిక్కెట్లు పొంది వచ్చిన టైం ప్రకారం క్యూలైన్ లోకి వెళితే గంట నుంచి ఒకటిన్నర్ర గంటలో స్వామి వారి దర్శన భాగ్యం కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

వాలంటీర్ ని కొట్టి చంపిన మైనర్, రూ. 2 వేలు తిరిగి ఇవ్వమన్నందుకు దారుణం

 గతంలో వచ్చిన అంశాలు దృష్టిలో ఉంచుకొని... అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ టైం స్లాట్ అమలు చేయనుంది టీటీడీ. ఇందుకు సామాన్య భక్తుల సహకారం ఉంటే శ్రీవారిని మతింత త్వరగా దర్శించాకోవచ్చని టీటీడీ అంచనా.  వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఏప్రిల్‌ 24 నుంచి ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించారు. మెట్ల మార్గాన్ని కూడా తెరిచారు.  టిక్కెట్లు బుక్ ( Tickets )చేసుకున్న వారికి త్వరితంగా దర్శన భాగ్యం కలగనుంది.  

అక్షరాలతో ఆటలు, మ్యాథ్స్ తో గేమ్స్ - ఈ నెల్లూరు బాలిక సూపర్ అంతే

Published at : 20 May 2022 12:16 PM (IST) Tags: thirumala Srivari Darshanam Special Darshanam tickets

సంబంధిత కథనాలు

Tirupati Crime : విడాకులు తీసుకున్న యువకులే కిలాడీ లేడీ టార్గెట్, పెళ్లి చేసుకుని ఆస్తులకు ఎసరు!

Tirupati Crime : విడాకులు తీసుకున్న యువకులే కిలాడీ లేడీ టార్గెట్, పెళ్లి చేసుకుని ఆస్తులకు ఎసరు!

Rain Updates: ఏపీలో ఆ జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు - తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ

Rain Updates: ఏపీలో ఆ జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు -   తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ

Tirupati Accident : తిరుపతిలో ఘోర ప్రమాదం, ఫ్లై ఓవర్ పై నుంచి పడి ఇద్దరు విద్యార్థులు మృతి

Tirupati Accident : తిరుపతిలో ఘోర ప్రమాదం, ఫ్లై ఓవర్ పై నుంచి పడి ఇద్దరు విద్యార్థులు మృతి

Tirumala RTC Charges : శ్రీవారి భక్తులకు అలెర్ట్, భారీగా పెరిగిన తిరుమల-తిరుపతి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు

Tirumala RTC Charges : శ్రీవారి భక్తులకు అలెర్ట్, భారీగా పెరిగిన తిరుమల-తిరుపతి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు

Tirumala Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రెండేళ్ల తర్వాత అత్యంత వైభవంగా

Tirumala Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రెండేళ్ల తర్వాత అత్యంత వైభవంగా

టాప్ స్టోరీస్

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?

Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్

Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్