News
News
X

Sharmila On Viveka Murder Case: వివేకా హత్య కేసు తేల్చకపోతే సీబీఐ మీద నమ్మకం పోతుంది: షర్మిల

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును త్వరగా తేలకపోతే CBI మీద ప్రజలకు ఉన్న నమ్మకం పోతుందన్నారు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

FOLLOW US: 
Share:

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును త్వరగా తేల్చాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రజల అభిమానాన్ని పొందిన అంత పెద్ద నాయకుడి కేసు విచారణకు ఇంకా ఎన్నాళ్లు పడుతుందని ఆమె ప్రశ్నించారు. కేసు విచారణ త్వరగా తేలకపోతే CBI మీద ప్రజలకు ఉన్న నమ్మకం పోతుందన్నారు. వివేకా హత్యకేసు విచారణలో ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు అన్నారు. కాగా, వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ సోమవారం నోటీసులిచ్చింది. హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసులో మంగళవారం విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నారు. అయితే తనకు ఐదు రోజుల సమయం ఇవ్వాలని, బిజీ షెడ్యూళ్ల వల్ల విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి స్పందించారు. ఐదు రోజుల తరువాత సీబీఐ చెప్పినప్పుడు విచారణకు హాజరవుతానని చెప్పారు.

తన పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఎత్తిచూపిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా , ఒడిదుడుకులు ఎదురైనా పోరాడుతున్నందుకు మాపై కక్ష కట్టి దాడులు చేశారు, కేసులు పెట్టారని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. తమపై ఉద్దేశపూర్వకంగా స్పీకర్ దగ్గర కంప్లైంట్ చేసినా మేం ప్రజల పక్షాన నిలబడ్డాం అన్నారు. ఇప్పటికే 3500 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేశాం, ఎక్కడైతే ఆగిందో అక్కడినుంచే మళ్లీ పాదయాత్ర మొదలుపెడతామన్నారు. మా మాటల వల్ల ఎవరూ కూడా ఆ ఎమ్మెల్యేల మీద దాడులు చేయలేదని, పాదయాత్ర 3500 కిలో మీటర్లు పూర్తి అయ్యాక మమ్మల్ని ఆపడానికి సీఎం కేసీఆర్ గూండాలతో మా వాహనాలను ధ్వంసం చేయిండంతో పాటు తమపై దాడులు చేయించారని వైఎస్ షర్మిల ఆరోపించారు.

వైఎస్సార్ పాదయాత్ర ఫలితమే సంక్షేమ పాలన.. 
రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థాన పాదయాత్ర ఫలితమే ఆయన సంక్షేమ పాలన, ఆయన అద్బుత పథకాలు.. ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం, ఫీజ్ రీయింబర్స్ మెంట్, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, పోడు భూములకు పట్టాలు, మైనార్టీలకు రిజర్వేషన్లు వంటి వాటి వెనక ఉన్నది వైఎస్ఆర్ పాదయాత్ర అన్నారు. ఆయన పాదయాత్రకు కొనసాగింపుగా మేం 3500 కిలోమీటర్ల ప్రజా ప్రస్థానం పాదయాత్ర పూర్తి చేశామన్నారు.  ప్రతి చోటా కేసీఆర్ వైఫల్యాలు ఎత్తి చూపించాం, తెలంగాణలో రుణమాఫీ చేయకుండా ప్రతి రైతును కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆరోపించారు. వైఎస్సార్ రైతులకు ఎంతో చేసి అండగా నిలిచారు. పెట్టుబడి తగ్గించి రాబడి పెంచారు. కానీ కేసీఆర్ రైతులకు రైతుబంధు ఇస్తూ సబ్సిడీ పథకాలు అన్నీ నిలిపేశారు. మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని విస్మరించారు.  కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తామని మాటతప్పారు.  ఫీ రీయింబర్స్ మెంట్ కూడా గాలికొదిలేశారు. ఆరోగ్య శ్రీ పథకానికి తూట్లు పొడిచి , ప్రజలకు ఆరోగ్య భద్రత లేకుండా చేశారని మండిపడ్డారు.

కేసీఆర్ ఏ హామీలు నెవరేర్చలేదు.. 
పోడు భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు. దీనిపై మేం ప్రతి మంగళవారం దీక్షలు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. కాళేశ్వరం ప్రాజెక్టులోనే కేసీఆర్ 70 వేల కోట్ల అవినీతి చేశారని ఎత్తి చూపి, పదే పదే మాట్లాడింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రమే అన్నారు. పాదయాత్రకు విరామం ప్రకటించి మరీ ఢిల్లీ వెళ్లి కాగ్, సీబీఐ కి ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు.  4 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఏ పథకానికి డబ్బు లేదు.  ఆరోగ్య శ్రీ, ఫీ రీయింబర్స్ మెంట్, రుణమాఫీ సర్పంచులకు, జీతాలకు, పెన్షన్లకు దేనికీ కూడా డబ్బు లేదు. మరి అప్పు చేసి ఏం చేశారని ప్రశ్నిస్తున్నందుకే తమపై దాడులు చేయిస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.

ఒక మహిళ కారులో ఉండగానే లాక్కెళ్లి, అరెస్టు చేసి, గంటల తరబడి స్టేషన్ లో పెట్టి అక్రమ కేసులు పెట్టారు. పోలీసులు ఇంత తొత్తుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అని ప్రశ్నించారు. కోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చినా, పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా కాలయాపన చేశారన్నారు. నిరాహా దీక్ష చేసి మళ్లీ కోర్టులకు పోతే పాదయాత్ర చేసుకోనివ్వండి అని కోర్టు చెప్పిందని, మళ్లీ ఈ నెల 28 వ తేదీ నుంచి పాదయాత్ర పున: ప్రారంభిస్తున్నాం అన్నారు. 

Published at : 24 Jan 2023 06:12 PM (IST) Tags: YS Sharmila ys vivekananda reddy YS Viveka murder case YSRTP

సంబంధిత కథనాలు

Khammam News: హైదరాబాద్ - విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లతో దాడి, కోచ్ అద్దాలు ధ్వంసం!

Khammam News: హైదరాబాద్ - విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లతో దాడి, కోచ్ అద్దాలు ధ్వంసం!

Jagityal: కన్నకూతుర్లని బావిలోకి తోసేసిన తండ్రి, ఆ వెంటనే తర్వాత మరో ఘోరం!

Jagityal: కన్నకూతుర్లని బావిలోకి తోసేసిన తండ్రి, ఆ వెంటనే తర్వాత మరో ఘోరం!

CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్‌ టూర్ పూర్తి షెడ్యూల్‌ ఇదీ

CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్‌ టూర్ పూర్తి షెడ్యూల్‌ ఇదీ

Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి

Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి

BRS Vs MIM : అసెంబ్లీ వాగ్వాదం తెలంగాణ రాజకీయాల్ని మార్చిందా ? ఎంఐఎంతో వైరం బీఆర్ఎస్‌కు నష్టమేనా ?

BRS Vs MIM :  అసెంబ్లీ వాగ్వాదం తెలంగాణ రాజకీయాల్ని మార్చిందా ? ఎంఐఎంతో వైరం బీఆర్ఎస్‌కు నష్టమేనా ?

టాప్ స్టోరీస్

Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి

Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!