News
News
X

Sharmila Arrest : షర్మిల మరోసారి అరెస్ట్ - ట్యాంక్ బండ్‌పై ఉద్రిక్తత !

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి అరెస్టయ్యారు. ట్యాంక్ బండ్‌పై మెరుపు ధర్నా చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

FOLLOW US: 
Share:

Sharmila Arrest :  తెలంగాణలో  మహిళలకు భద్రత లేదని నిరనస వ్యక్తం చేస్తూ వైఎస్అర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ట్యాంక్ బండ్‌పై మెరుపు ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రికి మహిళల పట్ల చిత్తశుద్ది లేదని షర్మిల ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల విషయంలో నెంబర్ వన్ అని.. మహిళల అక్రమ రవాణాలో నెంబర్ వన్ అని.. ప్లకార్డులు ప్రదర్శించారు.  మహిళలకు భద్రత కల్పిస్తున్నాం అని కేసీఅర్ సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని.. రాష్ట్రంలో యేటా 20 వేల అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపిచంారు. 

కేసీఅర్ కి మహిళల పట్ల చిత్త శుద్ది లేదని.. మహిళలను ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నారని విమర్శలు గుప్పించారు.  మహిళా భద్రతకు చిన్న దొర కేటీఆర్ బరోసా యాప్ అని చెప్పాడని కానీ ..  యాప్ ఎక్కడుందని ప్రశ్నించారు.  తా ను ఫోన్ లో చెక్ చేశా...ఎక్కడ కనపడలేదు యాప్  లేదని.. కేవలం మాటలకి మాత్రమే చిన్న దొర,పెద్ద దొర ఉన్నారని ఆరోపించారు.  తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్ మైన్ లా తయారయ్యింది...మహిళల పట్ల ఎక్కడ ఏ బాంబ్ పేలుతుందో తెలియదని ఆరోపించారు.  రాష్ట్రంలో అధికార పార్టీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతున్నారని.. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వేల కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు.  

టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో మంది మహిళలపై అత్యాచారాలు చేశారు ... చిన్న దొర కేటీఆర్ నియోజక వర్గంలో కూడా మైనర్ ల పై అత్యాచారం జరిగితే దిక్కు లేదన్నారు.  హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు అత్యాచారం జరిగితే దిక్కు లేదు .. ఆడపిల్లల పై కన్నెత్తి చూస్తే గుడ్లు పీకుత అని చెప్పిన కేసీఅర్ ఎంత మంది గుడ్లు పీకారో చెప్పాలని డిమాండ్ చేశారు..  స్వయంగా మంత్రుల బందువులు రేపు లు చేసినా దిక్కు లేదన్నారు.  కేసీఅర్ కి ఆడవాళ్ళు అంటే వివక్ష .. కక్ష  అని ఆరోపించారు.  దళిత మహిళ లు అని చూడకుండా దాడులు చేస్తున్నారని.. లాకప్ డెత్‌లు చేస్తున్నారని ్మండిపడ్డారు.  తెలంగాణ లో ఓకే ఒక్క మహిళల కవిత కు మాత్రమే రక్షణ ఉందన్నారు. 

ఏకంగా రాష్ట్ర ప్రధమ పౌరురాలు గవర్నర్ మీదనే అసభ్య పదజాలాన్ని బీఆర్ఎస్ నేతలు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.  స్వయంగా గవర్నర్ కే గౌరవం లేదు .. రాష్ట్రంలో మహిళా కమీషన్ ఒక డమ్మీ అని మండిపడ్డారు. తానే  స్వయంగా మహిళా కమిషన్ కి పిర్యాదు చేసినా దిక్కు లేదని.. సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడితే నోటి కొచ్చినట్లు తిట్టారని మండిపడ్డారు.  కేటీఆర్ వ్రతాలు అన్నాడు .. ఒకడు మరదలు అన్నాడు.. ఒకడు ఫ్యాషన్ షో అన్నాడు ... ఒకరేమో కొజ్జా అని తిట్టాడు. మా బస్సులు తగల బెట్టారు... ఇదేనా రాష్ట్రంలో మహిళకు ఉన్న గౌరవం అనిప్రశ్నించారు.  పోడు భూములకు పట్టాలు అడిగితే చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టారని..ఇదో దిక్కుమాలిన పాలన అని ఆరోపించారు. 
 
కేసీఅర్ బిడ్డకు తప్పితే ఎవరు సంతోషంగా లేరు ... కవిత కు ఏ లోటూ లేదు  ఓడిపోతే కవిత కు mlc పదవి ఇచ్చి గౌరవం అన్నాడు.. కవిత సిగ్గులేకుండా లిక్కర్ స్కాం లో చిక్కి మహిళల గౌరవాన్ని దెబ్బ తీసిందని ఆరోపించారు  రాష్ట్రంలో దిక్కు లేదు కానీ కవిత దేశంలో ధర్నా అంటుందని.. అసలు రాష్ట్రంలో 33 శాతం ఎక్కడ అమలు అవుతుందని ప్రశ్నించారు.  ఇక్కడ నాలుగు శాతం కూడా అమలు కాలేదని.. మహిళా దినోత్సవం అని చెప్పి కేసీఅర్ మహిళలను మోసం చేశారని ఆరోపించారు.  సున్నా వడ్డీ కింద రాష్ట్రంలో 4500 కోట్లు బకాయిలు పడ్డారని.. ఇప్పుడు 750 కోట్లు ఇచ్చి మొత్తం ఇచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారని  విమర్శళు గుప్పించారు.  మహిళల అభ్యున్నతికి ఒక్క పథకం లేదని విమర్శించారు. 

షర్మిలను అరెస్ట్ చేసిన  పోలీసులు ఆమె ఇంటికి తరలించారు. 

Published at : 08 Mar 2023 01:20 PM (IST) Tags: YSR Telangana Party Telangana Politics Sharmila Sharmila's arrest

సంబంధిత కథనాలు

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Breaking News Live Telugu Updates: TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి

Breaking News Live Telugu Updates: TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి

MLA Redya Naik: ఆగస్టులోనే ఎన్నికలకు ఛాన్స్, సీఎం కేసీఆర్ చెప్పేశారు!: ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలనం

MLA Redya Naik: ఆగస్టులోనే ఎన్నికలకు ఛాన్స్, సీఎం కేసీఆర్ చెప్పేశారు!: ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలనం

Minister Errabelli : గత పాలకులకు విజన్ లేదు, కేసీఆర్ వచ్చాక ప్రగతి పరుగులు పెడుతుంది- మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli : గత పాలకులకు విజన్ లేదు, కేసీఆర్ వచ్చాక ప్రగతి పరుగులు పెడుతుంది- మంత్రి ఎర్రబెల్లి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

టాప్ స్టోరీస్

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్