అన్వేషించండి

Weather Updates: అగ్నిగుండంలా మారిన రాయలసీమ జిల్లాలు - తెలంగాణలో 4 జిల్లాల్లో తేమ, ఉక్కపోత అధికం

Temperature in Telangana: ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Weather Updates:   తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అధికమైంది. మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇకనుంచి రాయలసీమలో 41 నుంచి 44 డీగ్రీల మధ్యలో ఎండలు ఉంటాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో పగటి ఉష్ణోగ్రత 40 కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణ కేంద్రం కొన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, అధిక ప్రభావం ఉండే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో..
ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం పొడిగా మారింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం,  ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత 40 డిగ్రీల దాక ఉండనుంది. ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని, అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని వాతావరణ శాఖ, వైద్య నిపుణులు సూచించారు. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా కావలిలో 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, నందిగామలో 36.6 డిగ్రీలు, నెల్లూరులోనూ 36.6 డిగ్రీలు, విజయవాడలో 35.6 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 35.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రలు ఉన్నాయి.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వడగాల్పుల వల్ల ఈ రోజు చిత్తూరు, కడప​, కర్నూలు, అనంతపురం జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల దాక ఎండల తీవ్రత ఉంటుంది. రాయలసీమ జిల్లాల్లో కొనసాగుతున్న వేడిగాలుల నుంచి కాస్తంత ఉపశమనం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా 43 నుంచి 45 డిగ్రీలు దాక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తిరుపతి, నెల్లూరు పరిసరాల్లో నిన్న తెల్లవారుజామున స్వల్ప భూకంపం వచ్చింది. తిరుపతి నగరం నుంచి 85 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. దీని తివ్రత మరీ ఎక్కువగా లేదు. రిక్టర్ స్కేల్ మీద 3.6 నమోదయ్యింది. దీని వల్ల ఎటువంటి ప్రాణ​, ఆస్త్రి నష్టం జరగదు. మన కోస్తాంధ్ర తీరంలో ఇలాంటి స్వల్ప భూకంపం రావడం చాలా సహజం.

తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..
తెలంగాణలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 39.2 డిగ్రీలు, నల్గొండలో 39.5 డిగ్రీలు, మెదక్‌లో 41.2 డిగ్రీలు, నిజామాబాద్‌లో 39.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎక్కువ ఎండలతో ఉక్కపోత, తేమ అధికం అవుతాయి. 

Also Read: Gold-Silver Price: బంగారం కొనేవారికి నేడు కాస్త ఊరట! స్థిరంగా పసిడి ధర, వెండి కూడా అంతే

Also Read: Horoscope Today 4th April 2022: ఈ రాశులవారు కోరి తగాదా తెచ్చుకోకండి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Land : అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Land : అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Hyderabad to Kashmir Low Budget Trip : కేవలం రూ.1700లతో హైదరాబాద్​ టూ కాశ్మీర్.. లో బడ్జెట్​తో మైండ్ బ్లోయింగ్ ప్రయాణం, డిటైల్స్ ఇవే
కేవలం రూ.1700లతో హైదరాబాద్​ టూ కాశ్మీర్.. లో బడ్జెట్​తో మైండ్ బ్లోయింగ్ ప్రయాణం, డిటైల్స్ ఇవే
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Embed widget