అన్వేషించండి

Nitin Gadkari: ‘నా మెదడు విలువ నెలకు రూ. 200 కోట్లు’.. కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్యవసాయంతోపాటు ఇథనాల్ రంగాల్లో తాను చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమర్థించుకున్నారు. తన ప్రయత్నాలు లాభం కోసం కాదన్నారు. ఇథనాల్ విధానంపై విమర్శలు వస్తున్న వేళ ఈ వ్యాఖ్యలు చేశారు.

Nitin Gadkari Speaks On Ethanol Blending Row: వ్యవసాయంతోపాటు ఇథనాల్ రంగాల్లో తాను చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమర్థించుకున్నారు. తన ప్రయత్నాలు లాభం కోసం కాదని.. అభివృద్ధి కోసమని అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన అగ్రికోస్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను తాను పొగిడేసుకున్నారు. తన మెదడు కోట్ల విలువైందిగా వ్యాఖ్యానించారు. ‘నా మెదడు నెలకు రూ. 200 కోట్ల విలువైనది. నాకు డబ్బు కొరత లేదు, నేను దిగజారను’ అని అన్నారు. గడ్కరీ ఇథనాల్ విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.

వ్యవసాయంలో తాను ప్రవేశపెడుతున్న విధానాలు రైతులను శక్తివంతం చేసేందుకేనని నితిన్​ గడ్కరీ అన్నారు. ‘నేను డబ్బు కోసం ఇలా చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా? నిజాయితీతో ఎలా సంపాదించాలో నాకు తెలుసు. నేను చక్రాల వ్యాపారిని కాదు’ అని ఆయన అన్నారు. 

విదర్భలో పది వేల మంది రైతుల ఆత్మహత్యలు సిగ్గుచేటు
రాజకీయ నాయకులు ఎన్నికల్లో లబ్ధి కోసం విభజన సూత్రాలు పాటిస్తారని, ఒక్కోసారి ఇది వెనుకబాటుతనానికి దారితీస్తుందని అన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని రైతు కష్టాల గురించి తాను తీవ్రంగా కలత చెందానని గడ్కరీ అన్నారు. ‘విదర్భలో పది వేల మంది రైతుల ఆత్మహత్యలు సిగ్గుచేటు. రైతులు సంపన్నులు అయ్యే వరకు మేము నిద్రపోం" అని మంత్రి ఉద్ఘాటించారు.

తన కొడుకు వాణిజ్య సామ్రాజ్యం గురించి ప్రస్తావన
తాను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సాధువుగా ఉన్నానన్నారు. తన పని నిజాయతీ, దీర్ఘకాలిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తన కుటుంబం గురించి కూడా ప్రస్తావించారు. వ్యవసాయ వ్యాపారంలో తన కుమారుడు నిఖిల్​ గడ్కరీ చేపడుతున్న వెంచర్ల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. అతడి పాత్ర ఆలోచనలు పంచుకోవడానికి మాత్రమే పరిమితం అని స్పష్టం చేశారు.

నిఖిల్​ గడ్కరీకి అనేక బిజినెస్​లు
గడ్కరీ ప్రకారం నిఖిల్​ గడ్కరీ విస్తృత వాణిజ్య నెట్‌వర్క్‌ను నిర్మించారు. గడ్కరీ మాట్లాడుతూ.. ‘ఇరాన్ నుంచి 800 కంటైనర్ ఆపిల్‌లను దిగుమతి చేసుకున్నాడు. భారత్​ నుంచి 1,000 కంటైనర్ అరటిపండ్లను ఎగుమతి చేశాడు. గోవా నుంచి సెర్బియాకు 300 కంటైనర్ చేపలను కూడా తీసుకెళ్లాడు. ఆస్ట్రేలియాలో పాలపొడి యూనిట్‌ను స్థాపించాడు. అబుదాబి, ఇతర ప్రదేశాలకు 150 కంటైనర్లను క్రమం తప్పకుండా సరఫరా చేశాడు’ అని గడ్కరీ చెప్పారు. తన కుమారుడు ఐటీసీ సహకారంతో 26 రైస్ మిల్లులను నడుపుతున్నాడని మంత్రి వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget