అన్వేషించండి

Thurakapalem Deaths Mystery: తురకపాలెంలో మరణాలపై వీడిన మిస్టరీ- యురేనియం అవశేషాలు గుర్తింపు, చెన్నైలో నిర్ధారణ

Uranium found in water in Thurakapalem | గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో వరుస మరణాలతో జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం దీనిపై ఫోకస్ చేసింది. చెన్నైలో చేసిన టెస్టుల్లో యురేనియం ఉన్నట్లు గుర్తించారు.

Dangerous Uranium found in Thurakapalem | అమరావతి: గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావడానికి, అసాధారణ మరణాలకు ప్రధాన కారణం అక్కడి నీటిలో ఉన్న యురేనియం అవశేషాలు ఉన్నట్టు అధికారులు నిర్వహించిన సమగ్ర అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధన కోసం గ్రామంలోని త్రాగు నీరు, మట్టి, స్థానికుల రక్త నమూనాలను సేకరించి చెన్నై, ఎయిమ్స్‌, గుంటూరు జీజీహెచ్‌ ల్యాబ్‌లకు పంపించారు. రెండు నెలల వ్యవధిలో 30 మందికి పైగా చనిపోవడంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. జ్వరాలు వస్తున్నాయని ఆస్పత్రికి తీసుకెళ్తే మళ్లీ ఇంటికి తిరిగొచ్చే వారు తక్కువ అని గ్రామస్తులు చెబుతున్నారు. చిన్న జ్వరాలకే ప్రాణాలు పోతున్నాయని, దీని వెనుక ఏదో పెద్ద కారణం ఉందని తురకపాలెం వాసులు అధికారులకు తెలిపారు. గత కొన్ని నెలలుగా గ్రామంలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ప్రాణాలు పోవడం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు.

జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం(NCDC) ఆధ్వర్యంలోని వైద్య నిపుణులు గుంటూరు శివారులోని తురకపాలెంను మంగళవారం (సెప్టెంబర్ 9న) సందర్శించారు. అసాధారణ మరణాలకు కారణాలపై ఎన్‌సీడీసీ సంయుక్త సంచాలకురాలు డాక్టర్‌ హేమలత, నోడల్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని బృందం గ్రామంలో సమీక్షించింది. గ్రామస్తులను అడిగి పరిస్థితి తెలుసుకుని, కొన్ని వివరాలు సేకరించారు. 

తురకపాలెంలో యురేనియం అవశేషాలు గుర్తింపు

చెన్నైలో పరీక్షించిన నీటి నమూనాల ఫలితాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. అందులో తురకపాలెం పరిసరాల నీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్టు తేలింది. ఈ ప్రాంతంలో రాళ్ల క్వారీలు విస్తారంగా ఉండటం, వాటిలోనే స్థానికులు పని చేయడం, అలాగే ఆ క్వారీ గుంతలలోని నీటిని వినియోగించడమే ఈ సమస్యకు కారణమయ్యుండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, నీటిలో స్ట్రాన్షియం అనే హానికర మూలకం మరియు ఈకొలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు చెన్నై నివేదికలో తేలింది. అయితే, మొదటిసారిగా నిర్వహించిన పరీక్షల్లో మాత్రం బ్యాక్టీరియా కేవలం ఒకేచోటే ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై చెన్నై నివేదిక ఫలితాలు కొంత భిన్నంగా వచ్చాయని అధికారులు తెలిపారు.

యురేనియం ప్రభావంపై వైద్యుల హెచ్చరిక
యురేనియం మానవ శరీరానికి ఎంతో ప్రమాదకరం అని డాక్టర్లు చెబుతున్నారు. ఇది తాగునీరు లేదా ఆహార మార్గంలో శరీరంలోకి ప్రవేశిస్తే మొదటగా మూత్రపిండాలకు తీవ్ర నష్టం కలుగుతుంది. అనంతరం చర్మ సమస్యలు, కాలేయం,  మెదడు, ఊపిరితిత్తులు, ఎముకలకు దెబ్బతీసి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు.


తురకపాలెం – గుంటూరు జీజీహెచ్‌ నివేదిక వివరాలు:
తురకపాలెం గ్రామం నుంచి గుంటూరు జీజీహెచ్‌ వైద్య కళాశాలలకు పంపిన 91 రక్త నమూనాల్లో ఒకటి బ్లడ్ కల్చర్ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. 64 నమూనాలు నెగెటివ్‌గా నిర్ధారించారు. వైద్యాశాఖ అధికారుల ప్రకారం, మెలియాయిడోసిస్‌ అనే వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా కాకపోయినా, ఇతర సూక్ష్మజీవుల ఆనవాళ్లు లభించాయి. అందులో 11 నమూనాల్లో కోకై గ్రామ్ పాజిటివ్‌ బాక్టీరియా, 1 నమూనాలో ఎంఆర్‌ఎస్‌ఏ (MRSA), 4 నమూనాల్లో ఎంఎస్‌ఎస్‌ఏ (MSSA) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో చెన్నై ప్రయోగశాలకు పంపిన నమూనాల తాజా ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు. యురేనియం అవశేషాలు ఉన్నాయని ఆ రిపోర్టులో వెల్లడైంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 

వీడియోలు

JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget