అన్వేషించండి

Telangana దూసుకెళ్తోంది.. రాష్ట్ర పంచాయతీ‌రాజ్ శాఖకు కేంద్రం అభినందనలు

గ్రామ పంచాయతీల ఆన్‌లైన్ ఆడిటింగ్ లో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. గత ఏడాది కూడా తెలంగాణ ఆన్లైన్ ఎడిటింగ్ లో నెంబర్ వన్ గా నిలవడం విశేషం.

వరంగల్...  ఇప్పటికే దేశంలో లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ అనేక అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటుంది. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ సైతం ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుంది. తాజాగా గ్రామ పంచాయతీల ఆన్‌లైన్ ఆడిటింగ్ లో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. గత ఏడాది కూడా తెలంగాణ ఆన్లైన్ ఎడిటింగ్ లో నెంబర్ వన్ గా నిలవడం విశేషం. అదే ఒరవడిని కొనసాగిస్తూ వరుసగా రెండో సారి కూడా తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ను అభినందిస్తూ లేఖ రాసింది.

కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీ సేథీ, ఇందుకు సంబంధించిన వివరాలను ఆ లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఆన్లైన్ ఎడిటింగ్ లో తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు లీడ్ రోల్ పోషిస్తున్నట్లు ఆ లేఖలో అభినందించారు. కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్ నిర్వహిస్తున్నది. 2020-21 వ సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగం విషయమై ఆన్లైన్ ఆడిటింగ్ నిర్వహిస్తూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జారీ చేసింది. వాటికనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు తాము చేసిన నిధుల ఖర్చును ఆన్లైన్ లోనే  అందిస్తున్నది. ఈ విధంగా నిర్ణీత గడువు కంటే ముందే వందకు వంద శాతం ఆన్‌లైన్ ఆడిటింగ్ పూర్తిచేసిన తెలంగాణ.. దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది.

తెలంగాణ తర్వాతి స్థానాల్లో 72 శాతంతో తమిళనాడు, 60 శాతంతో ఆంధ్రప్రదేశ్ దేశ్, 59 శాతంతో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు 25 శాతానికి లోపే ఆన్‌లైన్ ఆడిటింగ్ చేస్తూ  వెనుకబడ్డాయి. కాగా 2019-20 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధులు వినియోగంపై నిర్వహించిన ఆన్‌లైన్ ఆడిటింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలవడం విశేషం. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తున్నాయి అని, దేశానికి ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె ప్రగతి వంటి పథకాలు, మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్ షిప్ మన పల్లెలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సంఘం నిధుల కు సమానంగా రాష్ట్ర నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి కి బాటలు వేశారన్నారు. బాపూజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమవుతుందని చెప్పారు. చిన్నచిన్న గ్రామపంచాయతీలకు కూడా కనీసం ఐదు లక్షల రూపాయలు అందేలా చేశామన్నారు. ప్రపంచంలో, దేశంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డంప్ యార్డ్, స్మశాన వాటిక, కళ్ళాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, హరిత హారం కింద మొక్కలు వచ్చాయన్నారు. నిరంతర పారిశుద్ధ్యం కొనసాగుతుండటం వల్ల పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు గా మారాయన్నారు. అందుకే కరోనా వంటి ఉపద్రవాలను సైతం తెలంగాణ రాష్ట్రం ఎదుర్కోగలిగిందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం వన్ అవార్డులు రివార్డులు ఇవ్వడంతోపాటు ప్రశంసలు అభినందనలు కురిపించడంతో సరిపెట్టుకోకుండా కాస్త నిధులు ఎక్కువగా ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మరింతగా ప్రోత్సహించాలని ఎర్రబెల్లి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Also Read: Call Records Data: బీ అలర్ట్.. ఇక మీ కాల్ రికార్డింగ్స్ రెండేళ్ల వరకు టెలికాం కంపెనీల చేతికి.. ఆపరేటర్స్‌కు కేంద్రం కొత్త రూల్స్

అధికారులు, సిబ్బందికి మంత్రి ఎర్రబెల్లి అభినందనలు
ప్రభుత్వ మార్గనిర్దేశాలకు కనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉద్యోగులు అద్భుతంగా పని చేస్తున్నారని, అందువల్లే ఇలాంటి ప్రతి ఫలాలు లభిస్తున్నాయని వారిని అభినందిస్తున్న ట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఇదేవిధంగా రానున్న కాలంలోనూ పని చేసి పంచాయతీరాజ్ శాఖ కి మంచి పేరు తేవాలని మంత్రి ఎర్రబెల్లి వారికి సూచించారు.

పంచాయతీరాజ్ శాఖకు హరీష్ రావు అభినందన
ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, నిధులను సద్వినియోగం చేసుకుంటూ, ఆన్లైన్ ఆడిటింగ్ లో కూడా నెంబర్ వన్ గా నిలుస్తూ మన గ్రామ పంచాయతీలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి హరీష్ రావు అభినందించారు. ఇదే ఒరవడిని కొనసాగించవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. మంత్రి ఎర్రబెల్లి ఆ శాఖ అధికారులు ఉద్యోగుల మంత్రి అభినందించారు.
Also Read: Anakapalli Two Girls Fact Check: అనకాపల్లి అమ్మాయిలు అబ్బాయి కోసం కొట్టుకున్నారా? అసలు జరిగింది ఇదే.. ! ఆ అమ్మాయిల జీవితం ఇప్పుడెలా ఉందో తెలుసా ?

Also Read: Delmicron Varient: ఒమిక్రాన్ తర్వాత పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Embed widget