Call Records Data: బీ అలర్ట్.. ఇక మీ కాల్ రికార్డింగ్స్ రెండేళ్ల వరకు టెలికాం కంపెనీల చేతికి.. ఆపరేటర్స్‌కు కేంద్రం కొత్త రూల్స్
భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర టెలీ కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. కాల్ రికార్డింగ్స్ రెండేళ్లపాటు భద్రపరచాలని టెలికాం ఆపరేటర్స్‌కు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
టెలీ కమ్యూనికేషన్స్ శాఖ (DoT) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తరహాలో ఏడాది కాల్ రికార్డింగ్స్‌కు బదులుగా రెండేళ్ల పాటు కాల్ డేటాను భద్రపరచాలని టెలికాం ఆపరేటర్స్‌కు సూచించింది. టెలికాం సంస్థలతో పాటు కమర్షియల్, ఇతరత్రా కాల్స్ వివరాల రికార్డులను మెయింటెన్ చేయాలని.. ఇందుకోసం ఏకీకృత లైసెన్స్ ఒప్పందంలో సవరణలు చేసింది. సెక్యూరిటీ సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని టెలీ కమ్యూనికేషన్స్ విభాగం స్పష్టం చేసింది.
డిసెంబర్ 21న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం.. ఒక నెట్‌వర్క్ నుంచి జరిగిన సంభాషణలకు సంబంధించి అన్ని కాల్ వివరాల రికార్డ్, ఎక్స్ఛేంజ్ వివరాల రికార్డ్, ఐపీ (IP) వివరాల రికార్డ్‌ను తప్పనిసరిగా రెండేళ్లపాటు ప్రభుత్వ పరిశీలన కోసం భద్రపరచాలి. సాధారణ కాల్స్‌తో పాటు ఇంటర్నెట్ కాల్స్ సంభాషణ, డేటాను రికార్డ్ చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఇది కేవలం విధానపరమైన నిర్ణయం. రెండేళ్ల పాటు జరిగిన సంభాషణల వివరాలు సేకరించి ఉంచితే భద్రతా పరమైన విషయాలకు దోహదం అవుతుంది. ఆ తరువాత సైతం డేటా తమకు అవసరమని పలు భద్రతా సంస్థలు తమకు చెప్పాయని.. డేటాను ఏడాదికి బదులుగా రెండేళ్ల పాటు రికార్డ్ చేసి ఉంచడానికి అంగీకరించిన సర్వీస్ ప్రొవైడర్లందరితో సమావేశమైనట్లు ఈ విభాగం సీనియర్ అధికారి తెలిపారు. ఆపరేటర్‌లతో టెలీ కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ కలిగి ఉన్న లైసెన్స్ అగ్రిమెంట్‌లో క్లాజ్ నం. 39.20 ప్రకారం.. కాల్ డేటా రికార్డ్స్‌ను ఐపీ వివరాల రికార్డులతో సహా (IPDR) రికార్డులను కనీసం ఒక సంవత్సరం పాటు లైసెన్సర్ ఆ శాఖ పరిశీలన కోసం భద్రపరచాల్సి ఉంటుంది. తాజాగా ఆ డిపార్ట్‌మెంట్ ఈ కాల వ్యవధిని రెండేళ్లకు పొడిగించింది.
కాల్ డేటా రికార్డులను కనీసం 12 నెలల పాటు ఉంచాలని ప్రభుత్వం టెలికాం కంపెనీలను గతంలో కోరింది. అయితే మేం 18 నెలల వరకు ఉంచుతాం. ఇప్పుడు ఆ నియమాలను మార్చారు. సరైన చట్టపరమైన సంస్థల ద్వారా అదనపు అభ్యర్థనలు వస్తే, మేము ఆ డేటాను మరింత కాలం ఉంచుతాం. అయితే మిగిలినవన్నీ కేవలం 45 రోజుల్లో తొలగించుతామని అని టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మీడియాకు తెలిపారు.
టెలికాం కంపెనీలు కాల్ రికార్డ్స్ డేటాను టెక్ట్స్ రూపంలో భద్రపరుస్తాయి. కనుక దీని కోసం అదనపు ఖర్చు అక్కర్లేదు. ఎవరికి కాల్ చేశారు. ఏమేం మాట్లాడారు అనే విషయం Excel షీట్‌లోని జాబితాలాగ టెక్ట్స్ రూపంలో సేవ్ చేసి ఉంచుతామని ఓ టెలికాం కంపెనీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండేళ్ల వరకు ఈజీగా డేటాను భద్రపరుస్తామని తెలిపారు. అంతర్జాతీయంగా అయితే 6 నెలల నుంచి రెండేళ్ల వరకు భద్రతా కారణాలతో కాల్ డేటా రికార్డ్స్ సేవ్ చేసి ఉంచుతారని చెప్పారు. వినియోగదారులకు దీని వల్ల ఏ నష్టం ఉండదన్నారు.
Also Read: Electricity Tower: ఇదేమైనా బాగుందా.. స్వీట్స్, సెల్ ఫోన్ కావాలంటే షాప్ వెళ్లు.. విద్యుత్ టవర్ పైకి ఎందుకు?