By: ABP Desam | Updated at : 23 Dec 2021 08:34 PM (IST)
Edited By: Sai Anand Madasu
తీగలపై వేలాడుతున్న వ్యక్తి
బీహర్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ముజఫర్‌పూర్ జిల్లాలోని బర్మత్‌పూర్ గ్రామంలో ఓ వ్యక్తి హై ట్రాన్స్‌మిషన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కాడు. ఈ కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. అయితే ఓ వ్యక్తి విద్యత్ టవర్ పైకి ఎక్కడం వెనక.. వింతైన కోరిక ఉంది. తీరే కోరికనే.. కానీ.. అతడు ఎందుకంత సీరియస్ గా తీసుకొని ఎక్కాడో అతడికే తెలియాలి. కాస్త కాలు జారితే ప్రాణాలు పోయే పరిస్థితి.
అయితే పైకి ఎక్కిన వ్యక్తి అక్కడి నుంచి తనకు మొబైల్ ఫోన్, స్వీట్లు కావాలని అడుగుతూనే ఉన్నాడు. విద్యుత్ శాఖ, పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా అతను కిందకు వచ్చేందుకు నిరాకరించాడు. అసలు హై ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రిసిటీ టవర్ మీద కూర్చొన్నను అనే భయమే లేదు అతడికి. ఎంత ప్రయత్నించినా అతడు కిందకు దిగి రాలేదు. వ్యక్తిని రక్షించేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF)ని పిలిచారు. ఓ వైపు చలి తీవ్రత ఎక్కువ ఉన్నా.. అతడు చొక్కా ధరించి మాత్రమే పైన ఉన్నాడు.
అతడిని కిందకు దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఎస్ హెచ్ ఓ సత్యేంద్ర మిశ్రా చెప్పారు. అయితే అతడి గురించి చుట్టుపక్కల వారిని విచారించగా.. మానసిక వ్యాధిగ్రస్తుడని తెలిసిందని ఆయన తెలిపారు. గతంలో కూడా ఇలా పైకి ఎక్కేవాడని.. మానసిక వికలాంగుడని స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు బీహార్‌లోని సివాన్ జిల్లాలోనూ ఓ ఘటన జరిగింది. ఓ మానసిక రోగి తన ముగ్గురు కొడుకులతోపాటు కుమార్తెను చంపే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం బెల్హా గ్రామంలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ.. నిందితుడి భార్య, అతని ఇతర కుమార్తె ఇంట్లో నుండి పారిపోవడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. అయితే ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన నిందితుడు పదునైన ఆయుధాన్ని పట్టుకుని తన పిల్లలు, భార్యపై దాడి చేయడంతో ముగ్గురు చనిపోయారు.
Also Read: Sub Inspector Recruitment Exam: హైటెక్ కాపీ రాజా.. పోలీస్ పరీక్షకే వచ్చి ఈ తలతిక్క ఐడియాలేంటయ్యా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు
Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!
SonuSood Foundation : ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే
Tour of Duty Scheme : ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ రిక్రూట్మెంట్లో విప్లవాత్మక మార్పులు, 4 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి రిలీజ్
IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!