By: ABP Desam | Updated at : 23 Dec 2021 08:17 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
రాష్ట్రాల్లో ఆంక్షలు(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్ని కలవరపెడుతోంది. దక్షిణాఫ్రికా దేశాల్లో మొదలైన ఈ వేరియంట్ క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది. భారత్ లో కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 236 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలను హెచ్చరిస్తోంది. క్రిస్మస్, న్యూ్ వేడుకలకు ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు అమలు చేయాలని మార్గదర్శకాలు జారీచేసింది. తెలంగాణలో క్రిస్మస్, న్యూ ఇయర్ ఆంక్షలు విధించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దిల్లీలో ఆంక్షలు
దిల్లీలో కోవిడ్-19, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో దిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రిస్మస్, న్యూస్ ఇయర్ సంబరాలపై ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించవద్దని స్పష్టం చేసింది. మాస్కులు తప్పనిసరి చేసింది. మాస్కులు ధరించని వారిని మాల్స్, షాఫింగ్ కాంప్లెక్స్, ఇతర వాణిజ్య ప్రదేశాల్లో అనుమతించవద్దని ఆదేశించింది. కోవిడ్ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తేనే పాఠశాలలు, కళాశాలలు నిర్వహించేందుకు అనుమతిస్తామని పేర్కొంది. బార్‌లు, రెస్టారెంట్లలో 50 శాతం సిటింగ్ మాత్రమే అనుమతి ఇచ్చింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 200 మంది మించరాదని కఠిన ఆంక్షలు విధించారు.
ముంబయిలో 144 సెక్షన్
మహారాష్ట్రలో ఒమిక్రాన్ పెరుగుతున్నాయి. ముంబయిలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వం నిబంధనలు విధించింది. తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని కోరింది. వేడుకలు, సమావేశాలను 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్వహించుకోవాలని సూచించింది. పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో 200 కన్నా ఎక్కువ మందితో కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే అనుమతి తప్పనిసరి అని తెలిపింది. డిసెంబర్ 16 నుంచి 31 వరకు ముంబయిలో అర్ధరాత్రుళ్లు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైన వారిని మాత్రమే ప్రజారవాణాలో ప్రయాణానికి అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది.
రెండో డోసు తప్పనిసరి
హరియాణా ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. టీకాలు వేసుకోని వారిని జనవరి 1 నుంచి బహిరంగ ప్రదేశాల్లో అనుమతించకూడదని ప్రకటించింది. జనవరి 1 నుంచి రెండో డోసు తప్పనిసరి చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, మార్కెట్లు, ఇతర వాణిజ్య ప్రదేశాల్లోకి అనుమతించాలని ఆదేశించింది. బ్యాంకుల్లో కూడా వ్యాక్సిన్ పూర్తయితేనే అనుమతించాలని ఉత్తర్వులు ఇచ్చింది.
యూపీలో 144 సెక్షన్
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఆంక్షలు విధించింది. నోయిడా, లఖ్‌నవూ జిల్లాల్లో డిసెంబర్ 31 వరకు 144 సెక్షన్‌ను అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది.
గుజరాత్ నైట్ కర్ఫ్యూ
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా పండగ సీజన్‌లో జనం రద్దీని దృష్టిలో ఉంచుకొని గుజరాత్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని ఎనిమిది నగరాల్లో డిసెంబర్ నెలఖారు వరకూ రాత్రిపూట కర్ఫ్యూను పొడిగించింది. అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, భవ్‌నగర్, జామ్‌నగర్, జునాగఢ్‌లలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. నగరాల్లో అర్ధరాత్రి 75శాతం సామర్థ్యంతో, 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది.
Also Read : 'అయ్యా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి... బూస్టర్‌కు అనుమతివ్వండి'
కర్ణాటకలో ఆంక్షలు
న్యూ ఇయర్ వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, ఇతర కార్యక్రమాలకు అనుమతిలేదని తెలిపింది. పబ్‌లు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్లలో డీజేల వినియోగాన్ని నిషేధించింది. కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. పబ్‌లలో 50శాతం సామర్థ్యంతో న్యూఇయర్ వేడుకలు జరుపుకోవచ్చు. డీజేలతో పార్టీలు చేసుకునేందుకు అనుమతి లేదన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారిని పబ్‌లు, రెస్టారెంట్లలోకి అనుమతించవద్దని పేర్కొంది.
తెలంగాణలో
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
Also Read: కర్ణాటకలో ఒమిక్రన్ భయం.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
Also Read: Omicron Doubling: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్
Bhavani Island: పర్యాటక అద్బుతం విజయవాడ భవానీ ఐల్యాండ్, నది మధ్యలో ప్రకృతి అందాలు
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Palnadu Students Fight : అచ్చంపేట వర్సెస్ క్రోసూరు స్టూడెంట్స్ - పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థుల గ్యాంగ్ వార్ !
Bharti Airtel Q4 Earnings: జియోను బీట్ చేసిన ఎయిర్టెల్ ARPU, రూ.2007 కోట్ల బంఫర్ ప్రాఫిట్