అన్వేషించండి

Karnataka No New Year : కర్ణాటకలో ఒమిక్రన్ భయం.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

కర్ణాటకలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతూండటంతో కొత్త సంవత్సర వేడుకలపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది.


కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం మెల్లగా దేశం మొత్తం కమ్మేస్తోంది. కొత్తగా ప్రభుత్వాలు ఆంక్షలు దిశగా వెళ్తున్నాయి. ఒమిక్రాన్ కారణంగా దేశంలోనే తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నట్లుగా ప్రకటించింది. ముఖ్యంగా న్యూఇయర్ వేడుకలు జరగడానికి వీల్లేదని కర్ణాటక సీఎం బసవరాజ్  బొమ్మై ప్రకటించారు. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎలాంటి  బహిరంగ పార్టీలు, సామూహిక వేడుకలు జరుపుకోకూడదు. పబ్‌లు, రెస్టారెంట్లు, అపార్టుమెంట్లలో డీజేల వాడకాన్ని నిషేధించారు. ఒమిక్రాన్ వ్యాప్తి అంశంపై నిపుణులతో సంప్రదింపులు జరిపిన కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించడమే మేలని నిర్ణయానికి వచ్చింది.

Also Read: విజయ్ మాల్యా, నీరవ్ మోదీల నుంచి రూ. 13 వేల కోట్లు రికవరీ... పార్లమెంట్ లో కేంద్ర మంత్రి సీతారామన్ ప్రకటన..

అయితే కొన్ని నిబంధనలతో సాధారణంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవానికి పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. పబ్‌లు, రెస్టారెంట్లలోయాభై శాతం సీటింగ్ సామర్త్యంతో వేడుకలు నిర్వహించుకోవచ్చు.అయితే డీజేలు మాత్రం పెట్టకూడదు. అదే సమయంలో  వేడుకలకు వచ్చే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు డోసుల టీకాలు తీసుకుని ఉండాలి. టీకాలు తీసుకోనని వారిని అనుమతించకూడదు. ఈ నిబంధనలతో కర్ణాటక ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పెద్ద ఎత్తున న్యూఇయర్ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతూండటంతో... వాటిని ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.

Also Read: 'అయ్యా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి... బూస్టర్‌కు అనుమతివ్వండి'

కర్ణాటకలో ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. కర్ణాటకలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 19 నమోదయ్యాయి. ఇప్పటికే విదేశాల నుంచి వస్తున్న వారికి కఠినమైన పరీక్షలు నిర్వహిస్తోంది. అనుమానితులను క్వారంటైన్‌లో ఉంచుతోంది. అయినప్పటికీ కేసులు పెరుగుతూండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీ కావడంతో న్యూఇయర్ వేడుకలు చాలాపెద్ద ఎత్తున జరుగుతాయి. గతంలో ఇలాగే జరగడంతో కరనా వ్యాప్తి జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఈ సారి కర్ణాటక సర్కార్ ముందుగానే జాగ్రత్తలు  తీసుకుంది. 

Also Read: Omicron Doubling: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
Tags:delhiArvind KejriwalDelhi Chief MinisterOmicronomicron variant
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Metro Phase2: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
AP Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro Phase2: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
AP Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Viral News: గుంటూరులో ఫ్రీగా చికెన్ బిర్యానీ, కోడి కూర - రద్దీని కంట్రోల్ చేయలేక గేట్లు మూసివేసిన నిర్వాహకులు
గుంటూరులో ఫ్రీగా చికెన్ బిర్యానీ, కోడి కూర - రద్దీని కంట్రోల్ చేయలేక గేట్లు మూసివేసిన నిర్వాహకులు
Crime News: డిన్నర్‌కు పిలిచి వివాహితపై సామూహిక అత్యాచారం, పరిచయం ఉందని వెళితే దారుణం!
డిన్నర్‌కు పిలిచి వివాహితపై సామూహిక అత్యాచారం, పరిచయం ఉందని వెళితే దారుణం!
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Embed widget