Omicron Threat: 'అయ్యా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి... బూస్టర్‌కు అనుమతివ్వండి'
దిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని బూస్టర్ డోసులకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతోన్న వేళ బూస్టర్ డోసులపై చర్చ పెరుగుతోంది. తాజాగా బూస్టర్ డోసులపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా మాట్లాడారు. దిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని బూస్టర్ డోసులు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ కోరారు. ఇప్పటివరకు దిల్లీలో 28 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
కేసులు ఇలానే పెరిగితే ఇక అన్ని కరోనా పాజిటివ్ శాంపిళ్లను జీనోం సీక్వెన్సింగ్‌కు పంపాల్సి ఉంటుందని కేజ్రావాల్ అన్నారు. ప్రస్తుతం పెరుగుతోన్న కొవిడ్ కేసుల్లో ఎక్కువ మందికి ఆసుపత్రిలో చేరాల్సినంత అవసరం లేదని అందుకోసమే హోం ఐసోలేషన్ సేవలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
దిల్లీలో కొత్తగా 6 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 28కి చేరింది. ఈ 28 మందిలో 12 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. 16 మంది చికిత్స పొందుతున్నారు.
ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఉదయానికి 153 వద్ద ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 6 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా గుజరాత్‌లో 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 11 రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వ్యాపించింది. దిల్లీ (22), రాజస్థాన్ (17), కర్ణాటక (14), తెలంగాణ (20), గుజరాత్ (11), కేరళ (11), ఆంధ్రప్రదేశ్ (1), చండీగఢ్ (1), తమిళనాడు (1), బంగాల్ (1). అయితే దిల్లీలో ఈరోజు మరో 6 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Also Read: Aishwarya Rai Summoned: ఈడీ ముందుకు ఐశ్వర్య రాయ్.. పనామా పత్రాల కేసులో ప్రశ్నల వర్షం
Also Read: Omicron Doubling: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్!
Also Read: New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

