Anakapalli Two Girls Fact Check: అనకాపల్లి అమ్మాయిలు అబ్బాయి కోసం కొట్టుకున్నారా? అసలు జరిగింది ఇదే.. ! ఆ అమ్మాయిల జీవితం ఇప్పుడెలా ఉందో తెలుసా ?
అబ్బాయి కోసం ఇద్దరు అనకాపల్లి అమ్మాయిలు కొట్టుకున్నారని ఓ వీడియో వైరల్ అయింది. కానీ గొడవ అబ్బాయి కోసం కాదు. కానీ నిజం తెలిసే సరికి వారిద్దరి జీవితాలు రిస్క్‌లో పడ్డాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ?
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద కొట్టుకున్నారు. జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వారి కొట్లాటను చాలా మంది వినోదంగా చూశారు. కొంత మంది వీడియో తీశారు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశారు. ఓ అబ్బాయి కోసం ఇద్దరూ కొట్టుకుంటున్నారని ప్రచారం చేశారు. దీంతో ఆ వీడియోకు ఎక్కడా లేనంత స్కోప్ వచ్చింది. సోషల్ మీడియాలో కలికాలం అని చర్చించుకున్నారు. కామెడీగా కొంత మంది సెటైర్లు వేశారు. మరికొంత మంది అమ్మాయిల క్యారెక్టర్లపై తేడా వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా స్పందించారు. కానీ నిజంగా అక్కడేం జరిగిందో అనే సంగతి ఎవరూ పట్టించుకోలేదు... చెప్పినా వినే తీరిక సోకాల్డ్ నెటిజన్లకు ఉండదు. వారికి మసాలా అద్దిన న్యూస్ ఉంది కాబట్టి దాన్నే నమ్ముతారు..? కానీ అక్కడేం జరిగింది ? ఆ పిల్లలు ఎవరు ? ఎందుకు కొట్టుకున్నారు..? అసలు జరిగినదానికి...బయట ప్రచారం జరుగుతున్నదానికి సంబంధం ఉందా..?
అసలు అక్కడ గొడవ జరిగింది.. "కాలు తగిలిందని" !
అనకాపల్లికి చెందిన అ ఇద్దరు ఆడపిల్లలు కొట్టుకున్నది అబ్బాయి కోసం అని సోషల్ మీడియా మొత్తం ప్రచారం చేసింది. ఎక్కువ మంది అదే నమ్మారు. దీనికి కారణం నిజం ఏమిటో తెలియకపోడం. అసలు నిజం ఏమిటంటే... ఆ ఇద్దరూ కొట్టుకుంది అబ్బాయి కోసం కాదు. ఓ చిన్న మాటగొడవను పట్టుదలకుపోయి అంతకంతకూపెంచుకోవడంతోనే సమస్య వచ్చింది. అనకాపల్లిలో కాలేజీలు ముగిసిన తర్వాత ఎక్కువ మంది పక్క కాలనీలు...గ్రామాలకు బస్సుల ద్వారా వెళ్తూంటారు. ఇలా తమ ఇంటికి వెళ్లేందుకు ఓ విద్యార్థిని... మత కాలేజీలోనే చదువుతున్న ఓ కజిన్‌తో కలిసి బస్టాప్‌లో కూర్చుంది. వారిద్దరూ అకడమిక్ విషయాలో... మరో కుటుంబపరమైన విషయాలో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మరో యువతి అటుగా వెళ్తున్న సమయంలో యువకుడి కాలు ఆమెకు తగిలింది. ఆ యువతి కావాలనే ఆ యువకులు కాలుతో తాకాడన్న ఉద్దేశంతో గట్టిగా అరిచింది. దాంతో యువకుడితో ఉన్న అమ్మాయి సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. కావాలని తన కజిన్ కాలుతో తాకలేదని చెప్పింది .
Also Read: తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని మృతి... ఫస్టియర్ లో ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్య ..!
క్షణికావేశంతో మాటకు మాట అనుకుని కొట్టుకున్న అమ్మాయిలు !
అయితే ఇరువరి మధ్య ఆ అంశంపై మాటాకు మాట పెరిగిపోయింది. చివరికి ఇద్దరూ సహనంకోల్పోయి కొట్టుకోవడం ప్రారంభించారు. వీరిద్దరినీ విడతీయాల్సిన జనం చోద్యం చూశారు. వీడియో తీశారు. తనకు తెలిసిన అబ్బాి.. మా కజిన్ అని ఓ అమ్మాయి చెబుతున్న మాటలను మ్యానిపులేట్ చేసి.. నా వాడు..నా నాడు అని ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్నారని ప్రచారం చేశారు. ఆ గొడవ సద్దుమణిగిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత తమ పేరుతో.. తామ గొడవ వీడియోతో జరుగుతున్న ప్రచారం చూసి ఆ అమ్మాయిలు ఇద్దరూ తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యారు.
Read Also: కర్నూలు జిల్లాలో కాల్ మనీ కలకలం... వడ్డీ వ్యాపారులు వేధింపులతో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం
ఆపాల్సింది పోయి వీడియో తీసి మసాలా స్టోరీ అల్లేశారు !
ఈ ప్రచారం ఆ అమ్మాయిలిద్దరికే కాదు..వారి తల్లిదండ్రులకూ తలవంపులు తెచ్చేదే. ఆ పిల్లల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావంచూపేలా ఉన్న ఆ వీడియో..దానికి లింక్‌చేసి ప్రచారం చేస్తున్న కట్టకథ ఆ తల్లిదండ్రుల్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. వెంటనే తమ పిల్లల్ని ఇక బయటకు పంపించలేనంత ఆవేదనకు గురయ్యారు. వారిలో ఓ అమ్మాయిని చదువు మాన్పించేశారు తల్లిదండ్రులు. మరో అమ్మాయి కోలుకోలేనంతగా మానసికంగా ఇబ్బంది పడుతోంది. అప్పటి వరకూ కాలేజీలో.. బంధువుల్లో మంచి పిల్లలుగా ఉన్న తాము ఒక్క సారిగా ఇలా సోషల్ మీడియాలో తమ ప్రమేయం లేకుండానే చెడ్డవారిగా ట్రోల్ కావడం ... వారికి సోషల్ మీడియా విధించిన శిక్ష.
Also Read: మద్యం ధరలపై వాగ్వాదం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు !
ఆ అమ్మాయిల కుటుంబాల వేదన ఎవరికిపడుతుంది ? వారి భవిష్యత్ నాశనం చేసి ఏం సాధించారు ?
సోషల్ మీడియాకు నిజాలు అక్కర్లేదు. వ్యక్తుల మనోభావాలు అక్కర్లేదు. ఎవరి జీవితాలూ అక్కర్లేదు. విలువలు అసలు ఉండవు. ఓ వీడియో కనిపిస్తే దాన్ని కథలు..కథలుగా మసాలా దట్టించి ప్రచారం చేయడమే వచ్చు. దాని వల్ల ఎంత మంది జీవితాలు నాశనమైపోతాయో.. ఎన్ని కుటుంబాలు వేదన చెందుతాయో ఎవరూ పట్టించుకోరు. అదే సోషల్ మీడియా సైకోతనం. ఇప్పుడు ఆ సైకోతనం బారిన ఆ ఇద్దరు అమ్మాయిలుపడ్డారు ? చేయని తప్పునకు వారు అనుభవిస్తున్న శిక్షకు ఎవరు బాధ్యలు ? . సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ బాధ్యులే. వారిలో మార్పు రానంత వరకూ ఇలాంటి బాధితులు ఉంటూనేఉంటారు. అలాంటి వారిలో రేపు మనం కూడా ఉండొచ్చు. అందుకే.. ఈ దీనికి ఇంతటితో అడ్డుకట్ట వేయాలంటే.. సోషల్ మీడియాను బాధ్యతగా వాడుకోవడం మనతోనే ప్రారంభించాలి. అప్పుడే మార్పు వస్తుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి