Warangal: విస్తరిస్తున్న ఆంత్రాక్స్ వ్యాధి.. వరుసగా గొర్రెలు మృతి, ఆందోళనలో ప్రజలు
గొర్రెల వరుస మరణాలకు ఆంత్రాక్స్ వ్యాధే కారణం అని స్థానికులు భావిస్తున్నారు. స్థానికంగా నివసించే సాంబయ్య అనే వ్యక్తి పెంచుకునే గొర్రెల మందలో ఇటీవల కొన్ని రోజులుగా మందలో గొర్రెలు చనిపోతున్నాయి.
తెలంగాణలో మరో వ్యాధి విస్తరిస్తోంది. రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఈ ఆంత్రాక్స్ జాడలు కలకలం రేపుతున్నాయి. దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు ఈ వ్యాధి బారిన పడి చనిపోవడంతో స్థానికులను ఆందోళన కలిగిస్తోంది. గొర్రెల వరుస మరణాలకు ఆంత్రాక్స్ వ్యాధే కారణం అని స్థానికులు భావిస్తున్నారు. స్థానికంగా నివసించే సాంబయ్య అనే వ్యక్తి పెంచుకునే గొర్రెల మందలో ఇటీవల కొన్ని రోజులుగా మందలో గొర్రెలు చనిపోతున్నాయి. దీంతో ఆందోళన చెందిన సాంబయ్య తొగడ్రాయి పశు వైద్య అధికారికి విషయం చెప్పారు. దీంతో డాక్టర్ శారద చనిపోయిన గొర్రెల శాంపిల్స్ సేకరించి ఆ శాంపిల్స్‌ను పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని పశువుల ప్రధాన ఆసుపత్రి ప్రయోగశాలకు పంపించారు.
అయితే, దీనికి సంబంధించిన నివేదికలు ల్యాబ్ నుంచి వచ్చాయి. ఆ రిపోర్టులో గొర్రెలకు ఆంత్రాక్స్ సోకినట్లు నిర్ధారణ అయిందని పశు వైద్య అధికారి వెల్లడించారు. దీంతో గొర్రెల కాపరులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆంత్రాక్స్ గొర్రెల నుంచి మనుషులకు సోకితే ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుందని వెల్లడించారు. దీంతో గొర్రెల మందను గ్రామానికి దూరంగా ఉంచాలని సూచించారు. ఈ ఆంత్రాక్స్ వ్యాధి పశువుల నుంచి పశువులకే కాకుండా పశువుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది. దీంతో స్థానికులే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు కూడా భయాందోళనలకు గురవుతున్నారు.
Also Read : ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !
ఆ జంతువుల్లోనే ఆంత్రాక్స్ వ్యాధి
ఆంత్రాక్స్ వ్యాధి అనేది శాకాహార పశువుల్లోనే వస్తుంది. మాంసాహార జంతువుల్లో ఉండదు. మేకలు, గొర్రెలు, గుర్రాలు, కోళ్లు వంటివి శాకాహార జంతువులు కాబట్టి వాటిలో ఈ వ్యాధి ఎక్కువగా విస్తరిస్తుంటుంది. ఈ వ్యాధి బారినపడి పశువులను తాకితే అది మనషులకు కూడా సోకే అవకాశం ఉంది. అంత్రాక్స్ న్యుమోనియా కేసులలో 95 శాతం శరీరం తాకడం వల్ల వ్యాప్తిచెందుతుంది. చర్మంపై బొబ్బలు, దద్దుర్లు ఏర్పడడం ప్రధాన లక్షణాలని నిపుణులు చెబుతున్నాయి. బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టిరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుంది.
వైరస్ సోకాక ఈ వ్యాధి లక్షణాలు మూడు రోజుల్లోనే బయటపడతాయి. కానీ, కొన్ని కేసుల్లో రెండు నెలల వరకూ లక్షణాలు బయటకు కనిపించవు. ఈ వ్యాధిని యాంటీబయాటిక్స్‌తో నయం చేయొచ్చు. కానీ, వ్యాధి లక్షణాలు కనిపించగానే ఎంత తొందరగా చికిత్స ప్రారంభిస్తే అంత మంచిది. ఆలస్యం చేస్తే, ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది.
Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?
Also Read: TRS Harish Kavita : ప్లీనరీలో కనిపించని హరీష్‌రావు, కవిత ! టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా ?