అన్వేషించండి

DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 3 విడతల్లో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ - తెలంగాణ (DOST 2026) ద్వారా డిగ్రీ కాలేజీలో ప్రవేశాలను 3 విడతలుగా నిర్వహించనున్నారు. విద్యార్థులు బుధవారం (ఈ నెల 15) నుంచి తొలి విడత ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా అప్లై చేసుకోవాలి. మొత్తం మూడు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, జూన్ 20 నుంచి 27 వరకు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 1వ తేదీ నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, ఉపాధ్యక్షులు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ తదితరులు దోస్త్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

రిజిస్ట్రేషన్ ఫీజు..
ఈ ప్రవేశాలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ www.dost.cgg.gov.in లో ఏప్రిల్ 13న దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ ఫీజు మొదటి విడతకు రూ. 200 చెల్లించాలి. ఒకవేళ రెండో విడత నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ. 400 పేమెంట్ చేయాలి. గత ఏడాది లెక్కల ప్రకారం దోస్త్, నాన్-దోస్త్, రెసిడెన్షియల్ కళాశాలల్లో కలిపి రాష్ట్రంలో మొత్తం 4.40 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.


DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

దోస్త్ మూడు విడతల కౌన్సెలింగ్ షెడ్యూలు..
తొలి విడత రిజిస్ట్రేషన్లు - ఏప్రిల్ 15 నుంచి మే 7వ తేదీ వరకు 
వెబ్ ఆప్షన్లు - ఏప్రిల్ 30 నుంచి మే 8వ తేదీ వరకు ఇవ్వాలి
సీట్ల కేటాయింపు - మే 14
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ - మే 15 నుంచి 23వ తేదీ వరకు

రెండో విడత రిజిస్ట్రేషన్లు - మే 15 నుంచి మే 25వ తేదీ వరకు 
వెబ్ ఆప్షన్లు - మే 15 నుంచి మే 26వ తేదీ వరకు ఇవ్వాలి
సీట్ల కేటాయింపు - మే 30
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ - మే 31 నుంచి జూన్ 5 తేదీ వరకు

మూడో విడత రిజిస్ట్రేషన్లు - మే 31 నుంచి జూన్ 15వ తేదీ వరకు 
వెబ్ ఆప్షన్లు - మే 31 నుంచి జూన్ 16వ తేదీ వరకు ఇవ్వాలి
సీట్ల కేటాయింపు - జూన్ 20
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ - జూన్ 20 నుంచి జూన్ 25 తేదీ వరకు

దోస్త్ పరిధిలోకి మరిన్ని కాలేజీలు..
ఈ సందర్భంగా  దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. గతేడాది వరకు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను సీపీగెట్ (CPGET) ద్వారా భర్తీ చేయగా, ఈసారి వాటిలోని మూడు మేనేజ్‌మెంట్ కోర్సులను దోస్త్ పరిధిలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. గత విద్యాసంవత్సరం (2025-26)లో మొత్తం 4.40 లక్షల సీట్లు ఉండగా, 2.05 లక్షల సీట్లు భర్తీ అయినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల శాతం పెరగడంతో డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరగవచ్చని ఆశిస్తున్నారు. ప్రస్తుతం సొంతంగా జాయినింగ్స్ నిర్వహించుకుంటున్న 60 ప్రైవేటు కాలేజీలను సైతం దోస్త్ పరిధిలోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. 

దోస్త్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ (OU), కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాలతో పాటు చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, కొత్తగూడెంలోని మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ, జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ వంటి కోర్సుల్లో సీట్లను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు. వీటితో పాటు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (SBTET) పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డీ ఫార్మసీ సీట్లను, గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథిమ్)లోని ఒక కోర్సు సీట్లను కూడా దోస్త్ ద్వారానే భర్తీ చేయనున్నామని అధికారులు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Embed widget