X

KCR Review : పార్లమెంట్‌లో పోరాటమే.. ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఎంపీలతో కేసీఆర్ సమీక్ష !

ధాన్యం కొనుగోళ్ల విషయంలో పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై ఎంపీలతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. తదుపరి పోరాటంపై దిశానిర్దేశం చేశారు.

FOLLOW US: 

ధాన్యం కొనుగోళ్ల అంశంపై పార్లమెంట్‌లో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్నదానిపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.  ధాన్యం కొనుగోళ్లు, కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎంపీలతో సమావేశమయ్యారు.  పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ ఎంపీలకు కీలక సూచనలు చేశారు. కొన్ని రోజులుగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపైనే రాజకీయాలు జరుగుతున్నాయి. 

Also Read : విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఎంపీలు చేస్తున్న ఆందోళనకు లోక్‌సభలో పలు పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. అయితే.. ధాన్యం కొనుగోలు విషయంపై శుక్రవారం  గోయల్‌ కూడా వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంట్‌ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ ఎంపీలకు సూచనలు చేశారు. 

Also Read : థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఆ విషయంలో కేంద్రం మీనమేషాలు: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

కేసీఆర్ ధాన్యాన్ని కేంద్రానికి ఇవ్వబోమని చెబుతూ లేఖ ఇచ్చారని పీయూష్ గోయల్ ఓ లేఖను పార్లమెంట్‌లో ప్రదర్శించారు.  తెలంగాణ నుంచి ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన బియ్యం కూడా ఇవ్వడం లేదని అయినా ఎందుకు రాజకీయం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదని పీయూష్ గోయల్ తెలిపారు. తెలంగాణలో  వెరిఫికేషన్ కు వెళ్లినప్పుడు స్టాక్ లెక్కల్లో చాలా లోపాలు కనిపించాయన్నారు. యినా కూడా ప్రతినెలా మేం గడువును పొడిగిస్తూ వచ్చామన్నారు. ఏళ్ల తరబడి రాష్ట్రాలతో ఎంవోయూ చేసుకోవడం, దాని ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతూనే వస్తోందని స్పష్టం చేశారు.

Also Read: Konijeti Rosaiah : వైఎస్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?

ఈ క్రమంలో నిన్న పార్లమెంట్‌ సమావేశంలో కేంద్ర మంత్రి స్పందించిన తీరుపై.. ఈ రోజు సీఎం కేసీఆర్‌ మంత్రులు, ఎంపీలతో కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. ఆయన చెప్పిన విషయాల్లో ఎంత నిజాలు ఉన్నాయి. ఎన్ని అవాస్తవాలు ఉన్నాయన్న వాటిని పార్లమెంట్ వేదికగానే బయట పెట్టాలనే వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేయనున్నట్లుగా తెలుస్తోంది.  ధాన్యం కొనుగోళ్లపై జాతీయ విధానం ఉండేలా కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి? ఇతర రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్న వేళ వారితో ఎలా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలనే అంశంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. 

Also Read: మాటల మాంత్రికుడు రోశయ్య .. ఆ పంచ్‌లకు ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: telangana kcr Piyush Goyal Fci Paddy Grain Purchases TRS MPs

సంబంధిత కథనాలు

Hyderabad Chicken: ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..

Hyderabad Chicken: ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..

Formula E Hyderabad : లండన్, న్యూయార్క్ అండ్ హైదరాబాద్.. "ఫార్ములా ఈ" కార్ రేసులకు వేదికగా భాగ్యనగరం !

Formula E Hyderabad :  లండన్, న్యూయార్క్ అండ్ హైదరాబాద్..

Breaking News Live: కడప మెడికల్ కాలేజీలో కరోనా కలకలం.. ఏకంగా 50 మందికి పాజిటివ్

Breaking News Live: కడప మెడికల్ కాలేజీలో కరోనా కలకలం.. ఏకంగా 50 మందికి పాజిటివ్

TS High Court: రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిందే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

TS High Court: రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిందే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

Weather Updates: తెలంగాణలో వడగండ్ల వానలు.. ఏపీలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్.. ఎల్లో అలర్ట్ జారీ

Weather Updates: తెలంగాణలో వడగండ్ల వానలు.. ఏపీలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్.. ఎల్లో అలర్ట్ జారీ
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Lokesh Corona : నారా లోకేష్‌కు కరోనా - హోం ఐసోలేషన్‌లో చికిత్స !

Lokesh Corona :   నారా లోకేష్‌కు కరోనా - హోం ఐసోలేషన్‌లో చికిత్స !

Rashmika: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు.. 

Rashmika: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు.. 

Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. ఫిబ్రవరి 20న పోలింగ్

Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. ఫిబ్రవరి 20న పోలింగ్

Kadapa RIMS: కడప రిమ్స్ లో కరోనా కలకలం... 50 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్

Kadapa RIMS: కడప రిమ్స్ లో కరోనా కలకలం... 50 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్