అన్వేషించండి

Nizamabad: విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

నిజామాబాద్‌ పాఠశాలలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు కూడా భయపడుతున్నారు.

కరోనా ప్రజల్లో మళ్లీ గుబులు రేపుతోంది. కొత్త వేరియంట్‌పై జరుగుతున్న ప్రచారం, అక్కడక్కడా పెరుగుతున్న కేసులు భయకంపితుల్ని చేస్తోంది. నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో బాలికల ప్రాథమిక పాఠశాలలో టీచర్ మరుసటి రోజున విద్యార్థికి కరోనా రావడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల్లో పరిస్థితిపై ఏబీపీ దేశం ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. పాఠశాలల్లో శానిటేషన్ సరిగ్గా లేదు. మరుగొడ్లు పరిమితంగా ఉన్నాయ్. దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయ్. గతంలో కూడా గురుకులాల్లోనే విద్యార్థులకు పాజిటివ్ కేసులు ఎక్కువగా రావటంతో మూసివేశారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ నేపథ్యంలో మొదట స్కూళ్లలోనే కేసులు నమోదు కావటం ఒకింత తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది.

పాఠశాలల్లో అంతంత మాత్రమే శుభ్రత

ఉపాధ్యాయురాలికి, విద్యార్థినికి కరోనా పాజిటివ్ వచ్చిన స్కూల్‌లో ఏబీపీ దేశం పరిశీలించింది. అక్కడ తీసుకుంటున్న కరోనా చర్యలు ఎలా ఉన్నాయో చెక్ చేసింది. దీనిపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శానిటేషన్ జరగటం లేదని... మరుగుదొడ్లు సరిగ్గా లేవని చెప్తున్నారు. కొంత మంది విద్యార్థులు ఇప్పటికే కరోనా భయంతో ఇళ్లల్లోకి వెళ్లిపోతున్నారని విద్యార్థులు చెబుతున్నారు.

భయాందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

జిల్లావ్యాప్తంగా 1,759 గురుకులాలు, రెసిడెన్షియల్‌, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలున్నాయ్. 2 లక్షల 80 వేల మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. కరోనా కారణంగా ఏడాదిన్నరకుపైగా విద్యాసంస్థలు మూతపడ్డాయ్. మొదట్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించినా సెప్టెంబర్ నుంచి ఆఫ్‌లైన్ క్లాసులు మొదలయ్యాయ్. మొదలైన కొన్ని రోజులకు విద్యార్థుల హాజరు శాతం అంతంత మాత్రమే ఉన్నా... తర్వాత పెరిగింది. అయితే కరోనాతోపాటు కొత్త వేరియంట్స్‌పై వస్తున్న వార్తలతో మళ్లీ హాజరు శాతం తగ్గింది. విద్యార్థికి, టీచర్‌కి కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా వాసులు ఉలిక్కిపడుతున్నారు. విద్యార్థులను స్కూల్‌కు పంపాలా వద్దా అన్న ఆందోళనలో ఉన్నారు.

తగ్గుతున్న విద్యార్థుల హాజరు శాతం

కరోనాతోపాటు ఒమిక్రాన్ నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ స్కూళ్లపై పడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తల్లిదండ్రులు తమ పిల్లలను భయంభయంగా స్కూళ్లకు పంపుతున్నారు. మరోవైపు కరోనాకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తరగతి గదుల్లో శానిటేషన్, విద్యార్థులు మాస్కులు తప్పకుండా ధరించేలా చూస్తున్నామని పరిసరాలు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు ఉపాధ్యాయులు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాల్లో మరుగుదొడ్లు ఒకటి రెండే ఉంటున్నాయ్. దీంతో విద్యార్థినిలు ఇబ్బంది పడుతున్నారు. పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి కానీ అలా జరగటం లేదు. కనీసం శానిటైజేషన్ కూడా చేయట్లేదని విద్యార్థులే చెబుతున్నారు. థర్డ్ వేవ్ నేపధ్యంలో ఇకనైనా స్కూల్ యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగంలో పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు కొనసాగిస్తున్నారు. 

Also Read: శీతాకాలంలో కరోనాను తట్టుకునే శక్తి కావాలంటే... ఇవన్నీ తినాల్సిందే
Also Read:  ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం
Also Read: ల్యాప్‌టాప్‌ను డిటెర్జెంట్‌తో ఉతికేసిన భార్య, ఆమె అతి శుభ్రత జబ్బుతో వేగలేనంటున్న భర్త, వీరి కథలో ఎన్ని ట్విస్టులో...

Also Read: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్
Also Read :  ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP DesamKolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ  బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
CM Chandrababu: 'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Mahakumbh Viral Girl Monalisa: కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 
కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 
Nara Lokesh: 'మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా' - టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు
'మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా' - టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు
Embed widget