(Source: ECI/ABP News/ABP Majha)
Sugar Alternative: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్
పంచదారను ఎంత తగ్గిస్తే అంతమంచిదని చెబుతున్నారు డైటీషియన్లు. దానికి బెస్ట్ ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టారు.
స్టెవియా... ఇదొక మొక్క. ఈ మొక్కల ఆకులు ఎంత తియ్యగా ఉంటాయంటే చక్కెర కూడా ఆ తీపి ముందు తేలిపోతుంది. మనం ఇంట్లో వాడే పంచదార కన్నా ఈ ఆకులు వందరెట్లు తియ్యగా ఉంటాయి. అందుకే ఈ ఆకుల నుంచి చేసిన చక్కెరను, ప్రస్తుతం మనం వాడుతున్న ప్రాసెస్డ్ పంచదారకు ప్రత్నామ్నాయంగా వాడాలని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. అంతేకాదు స్టెవియా ఆకులతో చేసిన చక్కెర కార్బోహైడ్రేట్లు, కృత్రిమ పదార్థాలు, కేలరీలు లేకుండా స్వచ్చంగా ఉంటుంది. మార్కెట్లో దొరికే శుద్ధి చేసిన చక్కెరను తినమని ఏ పోషకాహార నిపుణుడు సూచించరు. దీనిలో ఎలాంటి పోషకవిలువలు ఉండవు, శరీరానికి శక్తి కూడా అందదు. అందుకే పంచదారకు ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టాల్సి వచ్చింది.
ఏమిటీ స్టెవియా?
స్టెవియా మొక్క ఆకులతో తయారుచేసిన చక్కెర ఇది. దీన్ని లిక్విడ్ లేదా మాత్రల రూపంలో విక్రయిస్తుంటారు. అయితే స్టెవియా రుచి పెద్దగా కొంతమందికి నచ్చదు. తీపి ఎక్కువై కాస్త చేదు రుచి కలిగినట్టు అనిపిస్తుంది. దీన్ని కాఫీ, టీ, కుకీలు, కేకుల తయారీలో కూడా వాడొచ్చని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.
మంచిదే అంటున్న న్యూట్రిషనిస్టులు
స్టెవియా చక్కెర... మొక్కల ఆధారిత సహజ స్వీటెనర్. అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలు ఉన్న వారు చక్కెరకు బదులు దీన్ని వాడుకోవచ్చు అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అయితే అధిక మోతాదులో తీసుకోవద్దని సూచిస్తున్నారు. దీన్ని రోజూ తీసుకోవచ్చని, శరీరంపై ఎటువంటి దుష్ఫ్రభావాలు పడవని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా స్టెవియా తినడం వల్ల మనకు శరీరానికి లభించే శక్తి గ్రాముకు రెండు కేలరీల కన్నా తక్కువే ఉంటుందని చెప్పింది. ఇది శరీరంలో పేరుకుపోదని స్పష్టం చేసింది. దీన్ని జీరో క్యాలరీ ఫుడ్ గా చెప్పుకోవచ్చని డయాబెటిక్, ఊబకాయం రోగులకు కూడా ఉపయోగకరమని చెప్పింది.
చక్కెర తయారీలో కార్బన్ వాడతారు, కానీ స్టెవియా సేంద్రియ పద్దతిలో తయారవుతుంది. స్టెవియాలో యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సమస్యలను నివారిస్తాయి. ఇది యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ప్రవర్తిస్తుంది. ఇందులో జింక్, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read also: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం
Read also: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది
Read also: టమోటో సూప్‌ను ఇలా చేసుకుని తాగండి... క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది
Read also: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?
Read also: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి