TRS News: రాజ్యసభలో కేంద్రం అన్నీ అబద్ధాలే - కేంద్రమంత్రిపై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలైజ్ నోటీసు
TRS in Rajyasbha: ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలంతా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేకే మాట్లాడారు.
Telangana Paddy Procurement: తెలంగాణలో పండే వడ్లను కేంద్రం కొనుగోలు చేసే విషయంలో దుమారం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నేతలు మరోసారి మండిపడ్డారు. దేశంలో ఎఫ్‌సీఐ వద్ద పోగుపడుతున్న బియ్యాన్ని ఎగుమతి చేయడం లేదంటూ కేంద్రం అబద్ధాలు చెబుతోందని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు (కేకే) (K Kesava Rao) ఆరోపించారు. పారా బాయిల్డ్ రైస్‌ను కేంద్రం ఎగుమతి చేస్తోందని, అలాంటప్పుడు తెలంగాణలో ధాన్యం ఎందుకు సేకరించడం లేదని నిలదీశారు. ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలంతా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేకే (K Kesava Rao) మాట్లాడారు.
శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు పారా బాయిల్డ్ రైస్ (Para Boiled Rice) అడుగుతున్నాయని, ఇలాంటి సమయంలో కేంద్రం సేకరించి ఆయా దేశాలకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తెలంగాణ మంత్రులు ఎప్పుడూ కేంద్ర మంత్రులను బెదిరించలేదని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామని అన్నారు. ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతూ.. దేశంలో గత ఏడేళ్లుగా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ విపరీతంగా పెరిగిందదని ఆరోపించారు. ప్రభుత్వ ప్రతి వ్యాపారాన్ని కేంద్రం లాభంతో అమ్మేయాలని చూస్తోందని విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలును ప్రజా సంక్షేమం కోణంలో చూడాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు.
పీయూష్ గోయల్‌పై (Piyush Goyal) సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) దేశాన్ని తప్పుదోవ పట్టించారని, ఆయన వ్యాఖ్యలు అబద్ధమని ఆరోపిస్తూ నేడు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేశారు. చైర్మన్‌కు రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు స్పీకర్‌కు ఆ లేఖను ఇచ్చారు. రూల్ 187 ప్రకారం కేంద్ర మంత్రి పీయూష్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు రాజ్యసభ టీఆర్ఎస్ సభ్యులు తమ లేఖలో తెలిపారు. ఒకటో తేదీన పారా బాయిల్డ్ రైస్ ఎగుమతిపై మంత్రి పీయూష్ గోయల్ఇ (Piyush Goyal) చ్చిన సమాధానం తప్పుదోవ పట్టించేలా ఉందని అన్నారు. వాస్తవానికి విదేశాలకు మిలియన్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను ఎగుమతి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో స్పష్టంగా ఉందని టీఆర్ఎస్ (TRS) ఎంపీలు ఆరోపించారు. మంత్రి సమాధానం సరైన రీతిలో లేని కారణంగానే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. లోక్‌సభ టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఇదే అంశాన్ని లేఖలో ప్రస్తావిస్తూ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు.