Top 5 Headlines Today: గుంటూరులో పార్టీ మారే యోచనలో ఎంపీ, మాజీ ఎంపీలు! పాతబస్తీలో ఘనంగా లాల్ దర్వాజ బోనాలు
Top 5 Telugu Headlines Today 16 June 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Telugu Headlines Today 16 June 2023:
రాజకీయ కారణాలతో గవర్నమెంట్ టీచర్‌ని చంపారు, దారుణం: చంద్రబాబు
విజయనగరం జిల్లా రాజాంలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు 58 ఏళ్ల ఏగిరెడ్డి కృష్ణ కొత్తపేటకు చేరుకోగానే ఓ బొలెరో వాహనం వచ్చి ఆయన బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణను రాజకీయ కారణాలతో హత్యే చేయడం దారుణం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన హత్యను తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలకు ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఉదాసీన వైఖరే కారణం అని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. పూర్తి వివరాలు
ఘనంగా లాల్ దర్వాజ బోనాలు, అమ్మవారికి తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు
లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవారికి, అక్కన్న మాదన్న ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ బోనాల పండుగ అని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఏటా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని అన్నారు. పూర్తి వివరాలు
గుంటూరులో కుండమార్పిడి రాజకీయం! పార్టీలు మారే యోచనలో ఎంపీ, మాజీ ఎంపీలు!
ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకోన్నున్నట్లుగా కనిపిస్తోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నుంచి ప్రముఖ నాయకులు గేటు దూకనున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. ఎంపీగా ఉన్నా తనకు ప్రాధాన్యం లేదని ఒకరు భావిస్తుంటే.. జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న తన మాటకు అధిష్ఠానం కనీస విలువ ఇవ్వడం లేదని ఓ కురువృద్ధ నేత భావిస్తున్నారట! నర్సారావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు 2019 ఎన్నికలలో విజయం సాధించారు. పార్టీ ఆరంభం నుంచి దేవరాయలు పార్టీతోనే ఉన్నారు. పూర్తి వివరాలు
కాంగ్రెస్ కాదు రేవంతే టార్గెట్ - టీ పీసీసీ చీఫ్‌పై బీఆర్ఎస్ భిన్నమైన వ్యూహం !
కాంగ్రెస్ మంచిదే కానీ రేవంత్ రెడ్డి రాంగ్ చాయిస్ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేస్తూండటం కొత్త రాజకీయంగా ఉందని కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గాంధీభవన్‌లో గాడ్సేను తెచ్చి పెట్టారని.. పోకిరీ చేతిలో కాంగ్రెస్ ను పెట్టారని.. తరచూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ కన్నారేవంత్ రెడ్డినే ప్రమాదకరంగా భావిస్తున్నారు. ఆయన చేతిలో కాంగ్రెస్ అనే ఆయుధాన్ని తప్పిస్తే చాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు
శ్రీవాణి ట్రస్టుపై దుష్ప్రచారం తగదు, అన్ని టోకెన్లు పారదర్శకంగానే - టీటీడీ ఈవో వెల్లడి
శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి కోరారు. ఆదివారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 23 మంది భక్తుల సలహాలు, సూచనలకు, ప్రశ్నలకు టీటీడీ ఈవో సమాధానం చెప్పారు. అనంతరం టీటీడీ ఈఓ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ. ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ కు 880 కోట్లు విరాళాలు అందాయని, 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కి విరాళాల ఇచ్చి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. ఇప్పటి వరకు 2500 ఆలయాలను నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. పూర్తి వివరాలు