Top Headlines Today: బండారు అరెస్టుపై టీడీపీ నేతలు ఫైర్; తెలంగాణలో కొత్త పీఆర్సీ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
బండారు అరెస్టుపై టీడీపీ నేతలు ఫైర్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లి 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చిన అనంతరం టీడీపీ నేతను అరెస్ట్ చేశారు. అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో వైద్య నిర్వహించకుండానే పోలీసులు బండారు సత్యనారాయణను హైవే మీదుగా గూంటూరుకు తరలిస్తున్నారు. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు చేయడాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇంకా చదవండి
ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీని ( PRC) నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ గా రిటైర్డ్ ఐఎఎస్ ఎన్. శివశంకర్ ను , సభ్యునిగా బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.6 నెలల్లోపు కమిటీ నివేదికను ప్రభుత్వానికి అంద చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పే రివిజన్ కమిటీకి కార్యకలాపాలకు అవసరమయ్యే నిధులను, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. ఇంకా చదవండి
నేడే సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ రేపు (అక్టోబరు 2) విచారణకు రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మాజీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా పేర్కొని అరెస్టు కూడా చేశారు. అయితే, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ను గత నెల మూడో వారంలో దాఖలు చేశారు. ఇంకా చదవండి
తెలంగాణ కాంగ్రెస్‌కు చేరికల సైడ్ ఎఫెక్టులు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తన చేరికలు జరుగుతున్నాయ. బలమైన నేతలు అనుకున్న వారు వచ్చి చేరుతున్నారు. అయితే వారికి సీట్లివ్వడానికి సిద్ధమైతే.. ఇప్పటి వరకూ పార్టీ కోసం పని చేసిన వారు అసంతృప్తికి గురై పార్టీకి గుడ్ బై చెప్పే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మైనంపల్లి హన్మంతరావు చేరిక కారణంగా మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ఇంచార్జులు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంకా చదవండి
విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ‘లియో’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
ఎన్ని సినిమాలు తీశామన్నది పాయింట్ కాదు.. తీసిన సినిమాలతో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించామన్నది పాయింట్ అనే మాటను ఇప్పటికే చాలామంది దర్శకులు నిరూపించారు. అందులో కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ కూడా ఒకరు. లోకేశ్ ఇప్పటివరకు అరడజను సినిమాలను కూడా డైరెక్ట్ చేయలేదు. కానీ ఇంతలోనే దేశంలోని పెద్ద పెద్ద డైరెక్టర్ల పక్కన కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అంతే కాకుండా కేవలం కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇంకా చదవండి
సల్మాన్ ఖాన్ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ - 'వార్ 2' కన్నా ముందే తారక్ బాలీవుడ్ ఎంట్రీ?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ తారక్ ఏ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుండి వస్తున్న అవుట్ అండ్ అవుట్ స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైన్ 'టైగర్ 3'(Tiger 3). మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్నారు. YRF స్పై యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ ఉండబోతోంది. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇంకా చదవండి
వరల్డ్ కప్‌లో టీమిండియా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? టాప్ ప్లేయర్ ఎవరు?
ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ నుంచి భారత జట్టు ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అక్టోబరు 8వ తేదీన చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు మూడోసారి ప్రపంచకప్ గెలవడంపై ఆశలు పెట్టుకుంది. నిజానికి గత 10 ఏళ్లలో భారత జట్టు ఒక్క ఐసీసీ టోర్నీని కూడా గెలవలేకపోయింది. ఇంకా చదవండి
650 కిలోమీటర్ల రేంజ్ అందించే కొత్త ఈవీ - లాంచ్ చేసిన ప్రముఖ బ్రాండ్!
చైనీస్ ఈవీ తయారీదారు బీవైడీ తన ఎలక్ట్రిక్ సెడాన్ కారు ‘సీల్’ను థాయ్‌లాండ్‌లో విడుదల చేసింది. దీని ధర భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 29.8 లక్షల వరకు ఉంది. అంటే భారతదేశంలో అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎంజీ జెడ్ఎస్ ప్రో డీటీ (ఆన్ రోడ్ దాదాపు రూ. 29.6 లక్షలు)కి దాదాపు సమానంగా ఉందన్న మాట. ఇంకా చదవండి
వందే భారత్ రైలుకు తప్పిన పెను ప్రమాదం, వందల ప్రాణాలు సేఫ్ - భారీ కుట్రకు ప్లాన్!
ఉదయ్‌పూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కొందరు దుండగులు వందే భారత్ రైలుపై పెద్ద పెద్ద రాళ్లు పెట్టి పట్టాలు తప్పించేందుకు కుట్ర చేశారు. రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో వేలాది మంది ప్రయాణికులు ప్రాణాలు రక్షించబడ్డాయి. వివరాలు... రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా సమీపంలో ఉదయపూర్ - జైపూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పించేందుకు కొందరు దుర్మార్గులు.. చిత్తౌర్ గఢ్ జిల్లా గంగారార్ పరిధిలోని భిల్వారా సమీపంలో కొందరు వ్యక్తులు ట్రాక్ పై రాళ్లు పేర్చారు. ట్రాక్ లోని ఇనుప ప్లేట్‌ల మధ్యలో అడుగు పొడవున్న రెండు రాడ్లను చొప్పించారు. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి.. రైలును ఆపేశారు. ఇంకా చదవండి
ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్ రేట్‌కే యాపిల్ ఐఫోన్ - ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సూపర్ ఆఫర్!
చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు యాపిల్ ఐఫోన్‌ను ఉపయోగించాలని కలలు కంటారు. అయితే ఖరీదైన ధర కారణంగా చాలా తక్కువ మంది మాత్రమే ఐఫోన్‌ను కొనుగోలు చేయగలుగుతారు. యాపిల్ ఇటీవలే ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసింది. భారతదేశంలో దీని ధర రూ. 79,900 నుంచి ప్రారంభం అవుతుంది. దీంతో పాత ఐఫోన్ సిరీస్‌పై భారీ ఆఫర్లు అందించారు. ఇంకా చదవండి