అన్వేషించండి

సల్మాన్ ఖాన్ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ - 'వార్ 2' కన్నా ముందే తారక్ బాలీవుడ్ ఎంట్రీ?

బాలీవుడ్ కండర వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'టైగర్ 3' మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు ఓ వార్త బాలీవుడ్ మీడియాలో తెగ ప్రచారం అవుతుంది.

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ తారక్ ఏ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుండి వస్తున్న అవుట్ అండ్ అవుట్ స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైన్ 'టైగర్ 3'(Tiger 3). మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్నారు. YRF స్పై యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ ఉండబోతోంది. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్ లో తెగ హడావిడి చేస్తోంది. అదేంటంటే 'టైగర్ 3' మూవీలో తారక్ ఎంట్రీ కూడా ఉండబోతున్నట్లు బాలీవుడ్లో ఓ వార్త ఊపందుకుంది. ఈ మూవీ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు మూవీలో ఎన్టీఆర్ ఎంట్రీ కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ లో మార్వెల్ సిరీస్ కు ఎంత క్రేజ్ ఉందో, బాలీవుడ్ లో యశ్ రాజ్ స్పై యూనివర్స్ కి అంతే క్రేజ్ ఉంది. ఈ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న మరో మూవీ 'వార్ 2'. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ మూవీ 2025లో విడుదల కాబోతోంది.

'వార్ 2' ద్వారా యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో అడుగుపెడుతున్న ఎన్టీఆర్, ఈ సినిమా కంటే ముందుగానే రా ఏజెంట్ గా 'టైగర్ 3' లో పరిచయం కాబోతున్నారని లేటెస్ట్ గా బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది స్పై యూనివర్స్ లో భాగంగా షారుక్ నటించిన 'పఠాన్' లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఎలా ఉంటుందో, ఇప్పుడు 'టైగర్ 3' లోను తారక్ ఎంట్రీ అదేవిధంగా ఉంటుందని చెబుతున్నారు. 'టైగర్ 3' క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చే ఎన్టీఆర్ పాత్ర మళ్లీ 'వార్ 2' లో ఎంట్రీ ఇస్తుందట. ఇదే విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ఫిలిం అనలిస్ట్ విశ్వజిత్ పాటిల్ సైతం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే దీనిపై యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

ఒకవేళ 'టైగర్ 3' లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తే ఖచ్చితంగా తెలుగులో ఈ మూవీకి మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే తరహాలో ఇప్పుడు సల్మాన్ టైగర్ త్రీ లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నారనే వార్త బాలీవుడ్ లో సర్క్యులేట్ అవుతుంది. ఇప్పటికే 'టైగర్ 3' లో షారుక్ ఖాన్ క్యామియో రోల్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నారనే వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే. రీసెంట్ గా 'టైగర్ కా మెసేజ్' పేరుతో విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ ని అందుకొని సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. దీపావళి కానుకగా నవంబర్ 10న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : అప్పుడే రెండు నెలలు - కొడుకు క్యూట్ పిక్‌ షేర్ చేసుకున్న ఇలియానా

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Mrunal Thakur: లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget