By: ABP Desam | Updated at : 02 Oct 2023 07:48 PM (IST)
ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ( Image Source : Apple )
iPhone 12 Offer: చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు యాపిల్ ఐఫోన్‌ను ఉపయోగించాలని కలలు కంటారు. అయితే ఖరీదైన ధర కారణంగా చాలా తక్కువ మంది మాత్రమే ఐఫోన్‌ను కొనుగోలు చేయగలుగుతారు. యాపిల్ ఇటీవలే ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసింది. భారతదేశంలో దీని ధర రూ. 79,900 నుంచి ప్రారంభం అవుతుంది. దీంతో పాత ఐఫోన్ సిరీస్‌పై భారీ ఆఫర్లు అందించారు.
బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 8వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. మీరు కేవలం రూ. 32,999తో ఐఫోన్ 12ని సొంతం చేసుకోవచ్చు. బిగ్ బిలియన్ డేస్ సేల్ కింద ఐఫోన్ 12 రూ.38,999కి విక్రయించనున్నారు. ఇది కాకుండా మొబైల్ ఫోన్‌పై రూ.3,000 బ్యాంక్ ఆఫర్, రూ.3,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. దీని తర్వాత ఫోన్ ధర రూ.32,999కు తగ్గుతుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 48,999కి అందుబాటులో ఉంది.
ఇప్పుడి కాలంలో ఐఫోన్ 12 కొనడం సరైనదేనా లేదా?
మీరు ఈ ఫోన్‌ని ఇప్పుడు కొనుగోలు చేయాలా వద్దా అని తెలుసుకునే ముందు, ముందుగా దీని స్పెసిఫికేషన్లు తెలుసుకోండి. ఐఫోన్ 12లో 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే అందించారు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో వెనకవైపు రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 12 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
యాపిల్ ఏ14 చిప్‌సెట్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ ఫోటోగ్రఫీ, బ్యాటరీ పరంగా మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇప్పటికి ఈ ఫోన్ పాతది కావచ్చు కానీ బడ్జెట్ తక్కువగా ఉన్న వారికి ఇది చెడ్డ ఆప్షన్ కాదు. ఈ బడ్జెట్‌లో మీరు ఖచ్చితంగా ఐఫోన్ వైపు చూడవచ్చు.
ఐఫోన్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్, రియల్‌మీ, మోటొరోలా, వివో స్మార్ట్‌ఫోన్‌లపై కూడా డిస్కౌంట్లు అందించనున్నారు. మీరు పోకో ఎం5ని రూ. 6,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా వివో వీ29ఈని రూ.24,999కి, నథింగ్ ఫోన్ 1ని రూ.23,999కి ఆర్డర్ చేయవచ్చు.
గత నెలలోనే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లలో ఏ16 బయోనిక్ చిప్, డైనమిక్ ఐల్యాండ్, 48 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఈ ఫీచర్లు ఉన్నాయి. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో ఈ ఫీచర్లు మొదటగా అందించారు. ఇప్పుడు స్టాండర్ట్ వేరియంట్స్‌లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిలో యూఎస్‌బీ టైప్-సీ పోర్టును కూడా అందించారు.
ఐఫోన్ 15 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఐఫోన్ 15 ప్లస్ ధరను మనదేశంలో రూ.89,900గా నిర్ణయించారు. వీటికి సంబంధించిన సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!
Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!
Indian Smartphone Brands: భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల పతనానికి కారణం ఇదే - చైనా కంపెనీలు చేశాయా? చేజేతులా చంపేసుకున్నారా?
Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!
Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
Nara Lokesh: '3 నెలల్లో ప్రజా ప్రభుత్వం' - అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న నారా లోకేశ్
Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్- తప్పులేదన్న సజ్జనార్
Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
/body>