News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bandaru Satyanarayana Arrest: తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్ చేసేంత నేరం ఏం చేశారు? బండారు అరెస్టుపై టీడీపీ నేతలు ఫైర్

Bandaru Satyanarayana Arrest: 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చిన అనంతరం మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

FOLLOW US: 
Share:

Bandaru Satyanarayana Arrest: 
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లి 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చిన అనంతరం టీడీపీ నేతను అరెస్ట్ చేశారు. అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో వైద్య నిర్వహించకుండానే పోలీసులు బండారు సత్యనారాయణను హైవే మీదుగా గూంటూరుకు తరలిస్తున్నారు. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు చేయడాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. 

బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు అప్రజాస్వామికం అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. హద్దులు మీరి వ్యవహరిస్తున్న  వైసీపీ నేతలను కట్టడి చేయకుండా.. ప్రతిపక్ష నేతలపై అక్రమకేసులు పెడుతున్నారు అని ఆరోపించారు. తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసే అంత నేరం ఆయన ఏం చేశారు? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష టీడీపీ నేతలపై వేధింపులు, కక్ష సాధింపులే అజెండాగా జగన్ పాలన సాగిస్తున్నారని, త్వరలోనే ఏపీ సీఎంకు ప్రజలే బుద్ధి చెప్పేరోజులు వస్తాయన్నారు. 

ప్రజల అభివృద్ధి, సంక్షేమం గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాల్లో సీఎం జగన్ మునిగితేలుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు ఫిర్యాదు ఇచ్చినా గంటల వ్యవధిలోనే 4 జిల్లాలు దాటి బండారు సత్యనారాయణ ఇంటిపై దాడి చేసిన పోలీసులు.. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై ఎందుకు స్పందించరు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తాడేపల్లి డైరెక్షన్ లో అక్రమ కేసులు పెడుతున్న డీజీపీ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ప్రశ్నించే గొతులను తొక్కుతున్న జగన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓటుతో ప్రజలే తొక్కుతారు అని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.  

బండారు సత్యనారాయణ అరెస్టుపై లోకేష్ రియాక్షన్..
బండారు సత్యనారాయణ అరెస్టుపై ఢిల్లీలో ఉన్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మాజీ మంత్రి అరెస్టును తీవ్రంగా ఖండించారు. వైకామ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలంతా కూసే రోత బూతు కూతలపై పోలీసులు ఎన్ని వేల కేసులు నమోదు చేయాలో అన్నారు. బూతు కూతలు వద్దని హితవు పలికిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని మాత్రం టెర్రరిస్టులా అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. వైసీపీ పార్టీకి ఓ చట్టం, విపక్షాలకి మరో చట్టమా? ఇదేం అరాచక పాలన అని ప్రశ్నించారు. 

మంత్రి రోజాపై బండారు సత్యనారాయణమూర్తి అనుచిత వ్యాఖ్యలు
ఏపీ మంత్రి రోజా.. నందమూరి, నారా కుటుంబాలపై  చేసిన అమర్యాద వ్యాఖ్యలను మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఖండించారు. రెండు రోజుల కిందట  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ పర్యాటక మంత్రి రోజాపై ఘాటు విమర్శలు చేశారు. ‘ఎన్టీఆర్ కుటుంబంపై, భువనేశ్వరి, బ్రాహ్మణీలపై మాట్లాడే అర్హత నీకు లేదు. నీ బాగోతం బయటపెడితే నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు. రోజా గ‌తంలో అశ్లీల చిత్రాల్లో న‌టించారని, అందుకు  సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌న్నారు. గతంలో మిర్యాల‌గూడ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చి ఎన్ని లాడ్జీలు తిరిగావో త‌మకు తెలుస‌ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. బండారు కామెంట్లపై స్పందించిన మహిళా కమిషన్ టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరింది. ఈ క్రమంలో నిన్న రాత్రి బండారు సత్యనారాయణ ఇంటికి వెళ్లిన పోలీసులు అక్టోబర్ 2న రాత్రి ఉద్రిక్తతల నడుమ ఆయనను అరెస్ట్ చేశారు.

Published at : 02 Oct 2023 10:06 PM (IST) Tags: ANDHRA PRADESH Nara Lokesh Vizag News Atchannaidu #tdp

ఇవి కూడా చూడండి

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

APPSC Group-1:  ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

Breaking News Live Telugu Updates: కేసీఆర్‌ కోలుకోవడానికి నెలకుపైగా సమయం- హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

Breaking News Live Telugu Updates: కేసీఆర్‌ కోలుకోవడానికి నెలకుపైగా సమయం- హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

Top Headlines Today: యశోదలో చేరిన మాజీ సీఎం కేసీఆర్- రేపటి నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం

Top Headlines Today: యశోదలో చేరిన మాజీ సీఎం కేసీఆర్- రేపటి నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?