Viral News: చిన్నప్పుడు అమ్మా,నాన్న ఆటాడారు - 20 ఏళ్ల తర్వాత నిజంగానే భార్యభర్తలయ్యారు - ఇదో క్యూట్ లవ్ స్టోరీ
Kids: చిన్నప్పుడు ఇంటి దగ్గర, స్కూళ్లలో చాలా ఆటలు ఆడుతూ ఉంటాం. అందులో అమ్మానాన్న ఆట ఒకటి. కానీ పెద్దయ్యాక అలా ఆడిన వాళ్లు పెళ్లి చేసుకున్న సందర్భాలు దాదాపు ఉండవు. ఉంటే అద్భుతం. అలాంటిదే ఇది.

Kids who played roles of husband and wife in kindergarten get married 20 years later:
ఇరవై ఏళ్ల కిందట.. ఓ కిండర్ గార్టెన్ స్కూల్
ఆ రోజు స్కూల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఉన్నాయి. ప్లే స్కూల్, ఎల్ కేజీ, యూకేజీ ఇలా అన్ని క్లాసుల్ని కలిపేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అందరూ ..ఎవరికి తోచిన ఫ్యాన్సీ డ్రెస్ లో వారు పంపారు. ఓ పిల్లవాడి తల్లి తన కుమారుడ్ని పెళ్లి కొడుకు డ్రెస్ లో పంపింది. ఓ పిల్ల తల్లి తమ కూతుర్ని పెళ్లి కుమార్తె డ్రెస్‌లో పంపింది. స్కూల్లో వీరిద్దరితో పెళ్లి ఆట ఆడించారు. ఫోటోలు తీశారు. అప్పటితే ఎపిసోడ్ అయిపోయింది.
ఇరవై ఏళ్ల తర్వాత ఓ కల్యాణ మండపం
ఓ యువతి, యువకుడి పెళ్లి హుషారుగా జరిగింది. ఆటపాటలతో అందరూ హాయిగా గడిపారు. కాసేపటి తర్వాత వాళ్లకో నిజం తెలిసింది. అదేమిటంటే తమకు ఇరవై ఏళ్ల కిందటే పెళ్లి అయిందని. ఓ వ్యక్తి ఫోటో షేర్ చేయడంతో ఈ విషయం వారికి తెలిసింది. ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది. ఎందుకంటే .. ఇరవై ఏళ్ల కిందట పెళ్లి అయింది నిజంగా కాదు. ఆటలో. కిండర్ గార్టెన్ స్కూళ్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆ పెళ్లి జరిగింది. నిజానికి వారిద్దరూ ఒక్క క్లాస్ కాదు. తర్వాత కూడా వారు ఫ్రెండ్స్ కాదు. కానీ యాధృచ్చికంగా అలా పెళ్లి జరిగిపోయింది.
Kindergarten kids in China who played husband and wife at school tie knot 20 years later
— AI Day Trading (@ai_daytrading) January 21, 2025
Loving duo’s paths did not cross until many years after their ‘puppy love’, both were still single, decided to tie the knot for real. pic.twitter.com/xPL7OY9z91
జీవితమంటేనే ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మంచివి.. కొొన్ని అద్భుతమైనవి ఉంటాయి. అలాంటి ఓ ఘటన ఆ జంట జీవితాల్లో జరిగింది. చిన్నప్పుడు కిండర్ గార్టెన్ స్కూల్లో వారు భార్య, భర్తలుగా నటిస్తూ ఓ నాటకం వేశారు. దాన్ని వారు మర్చిపోయి ఉంటారు. కానీ ఇరవై ఏళ్ల తర్వాత వారు నిజంగానే పెళ్లి చేసుకున్నారు. ఘటన చైనాలోని ఓ పట్టణంలో జరిగింది.
పైన తథాస్తు దేవతలుంటారని మన దగ్గర చెబుతూ ఉంటారు. చైనాలో అలాంటి సామెతలు , కథలు ఉన్నాయో లేవో కానీ ఈ యువజంట విషయంలో మాత్రం నిజం అయింది. చిన్నప్పుడు అలా భార్య, భర్తల వేషం వేస్తే ఇప్పుడు నిజంగానే ఆ రోల్స్ లోకి వచ్చేశారు. అందుకే దేవుడిరాతను ఎవరూ తప్పించుకోలేరని ఉంటారు.





















