Chandrababu Speech: హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
World Economic Forum | గతంలో ఐటీ ఇండస్ట్రీ వచ్చాక హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిందని, టెక్నాలజీని అందిపుచ్చుకుని పీ4 మోడల్ తో అద్భుతాలు చేద్దామని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Andhra Pradesh News | దావోస్: ఐటీ వచ్చాక హైదరాబాద్ అభివృద్ధి వేగంగా జరిగింది. గత 25 ఏళ్లలో ఎన్నో మార్పులు సంభవించాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum)లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు ప్రసంగించారు. 1991లో ఆర్థిక సంస్కరణలతో భారత్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఐటీ పరిశ్రమలు వచ్చాక హైదరాబాద్‌కు వేగంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌ను పలు రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల అగ్ర నగరాల సరసన చేర్చాం. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాం. రెండంకెల అభివృద్ధి సాధిస్తేనే కోరుకున్న మార్పు సాధ్యం. ఇక్కడ మిమ్మల్ని చూశాక నమ్మకం పెరిగింది. భవిష్యత్‌లో నా కలలు కచ్చితంగా నెరవేరతాయని నమ్మకం పెరిగిందని’ అన్నారు.
తలసరి ఆదాయం ఎక్కువేనన్న చంద్రబాబు
ఏఐ, రియల్ టైమ్ డేటా, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి ఎన్నో టెక్నాలజీ రంగాల్లో ప్రముఖులను ఒక దగ్గరికి చేర్చితే వీటిపై ఎన్నో అవకాశాలు పెరుగుతాయి. నిత్యజీవితంలో టెక్నాలజీ వాడకం పెరిగింది. నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తో గ్లోబల్ కమ్యూనిటీకి ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారతీయుల తలసరి ఆదాయం ఎక్కువ. కారణం ఏంటంటే గత 20 ఏళ్లలో దేశంలో జరిగిన మార్పులు, సంస్కరణలే కారణం.
భారతీయులు అధికంగా కష్టపడతారు, గొప్ప స్ధాయికి ఎదుగుతారు
భారతీయులు అధికంగా కష్టపడతారు. ఐఎస్‌బీ లాంటివి ప్రపంచ స్థాయి నేతల్ని తయారుచేయాలి. దేశాన్ని డిజిటలైజేషన్ చేయాలని ప్రధాని మోదీ నా తరహాలోనే ఆలోచిస్తున్నారు. సమాజానికి మనం ఎంతో కొంత తిరిగిచ్చేందుకు సిద్ధంగా ఉంది. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ కావాలని చంద్రశేఖర్ అన్నారు. పీ4 పబ్లిక్, ప్రైవేట్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్ మోడల్ ద్వారా అద్బుతాలు చేయవచ్చు. పేదరిక నిర్మూలన కోసం శ్రమిద్దాం. రాష్ట్రంలో అవకాశాలు మెరుగు చేస్తే పేదరికం తగ్గుతుంది. ఐడియాలు ఇవ్వడం మాత్రమే కాదు, అవి కార్యరూపం దాల్చేలా చేసేందుకు ముందుకు రావాలని’ గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ సమ్మిట్ లో చంద్రబాబు పిలుపునిచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

