By: ABP Desam | Updated at : 09 Jun 2023 04:20 PM (IST)
టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో చార్జిషీట్ దాఖలు
TSPSC Leak Case : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 49 మందిని సిట్ అధికారులు అరెస్టు చేయగా.. వీరిలో 16మంది మధ్యవర్తులుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఏఈఈ ప్రశ్నపత్రం లీకైన తర్వాత 13 మందికి, డీఏవో పేపర్ 8మందికి, గ్రూప్-1 ప్రిలిమ్స్ నలుగురికి చేరినట్లు సిట్ అధికారులు గుర్తించారు.ఈ కేసులో ఇప్పటివరకు రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలినట్లు సిట్ చార్జిషీట్‌లో పేర్కొంది. ఇప్పటికే నిందితులకు సంబంధించిన ఖాతా వివరాలు, చేతుల మారిన నగదు వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరికొంత మందిని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
అరెస్ట్ అయిన వారిలో ఇందులో 15 మంది నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు మిగతా నిందితులంతా జైల్లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే పూల రమేష్ అరెస్ట్‌తో ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు కొత్త మలుపు తిరిగింది. పూల రమేషే హైటెక్ మాస్ కాపీయింగ్ చేయించినట్లుగా గుర్తించారు. ఏఈ ప్రశ్నాపత్రాన్ని దాదాపు 80 మందికి పూల రమేష్ విక్రయించాడు. ఇతని నుంచి రాబట్టిన కీలక సమాచారంతో అరెస్ట్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశ ఉంది.
ఇటీవలే కోర్టు అనుమతితో డీఈ రమేష్ ను కస్టడీలోకి తీసుకున్న అధికారులు
మే వ తేదీన కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న విద్యుత్ శాఖ డీఈ రమేష్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు షాకింగ్ విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. డీఈ రమేష్ ద్వారా ఓ మాజీ ఎంపీటీసీ కూతురు కూడా ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాసినట్లు వెల్లడి అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు వేగాన్ని పెంచిన సిట్ అధికారులు ఇటీవల వరంగల్ జిల్లా విద్యుత్ శాఖలో డీఈగా పని చేస్తున్న రమేష్ ను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విచారణలో ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్, డీఏఓ పరీక్షల ప్రశ్నాపత్రాలను 40 మందికి ఇవ్వడంతోపాటు హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేయించినట్లు తేలింది. ఈ క్రమంలోనే డీఈ రమేష్ ను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు నాంపల్లి కోర్టు అనుమతితో అతడిని ఆదివారం కస్టడీకి తీసుకున్నారు.
75 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని మాస్ కాపీయింగ్
విచారణలో కరీంనగర్ జిల్లా బొమ్మకల్ మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ కూతురు రమేష్ ద్వారా ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాసినట్లు తేలింది. శ్రీనివాస్ ను కిలిసిన రమేష్ 75 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడి అయింది. ఈక్రమంలోనే ఆ ఎంపీటీసీ కూతురు పరీక్ష రాయగా... ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా ఆమెకు రమేష్ జవాబులు చేర వేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఎంపీటీసీతో పాటు ఆయన కూతురును కూడా విచారించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇలా ఇప్పటి వరకు విచారణలో మొత్తం 80 మందికి డీఈ రమేష్ ప్రశ్నాపత్రాలు అమ్మినట్లు గుర్తించారు.
Chandrababu arrest: ఐటీ ఉద్యోగుల ర్యాలీకి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి మద్దతు
Hyderabad Boy Death: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడి మృతి, పది నిమిషాలకే అంత ఘోరం - పజిల్‌గా మారిన కేసు!
Hyderabad News: భూములపై రుణాలిస్తామని డబ్బులు లాగేశారు - చివరకు బోర్డు తిప్పేశారు!
Sabitha Indra Reddy: కూరగాయలు కొన్న మంత్రి - ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన మహిళ
IT Employees Car Rally: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీ ప్రారంభం - బోర్డర్ వద్ద టెన్షన్! వందల్లో పోలీసులు
Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
Asian Games: బంగ్లా 51కే ఆలౌట్ - ఆసియా టీ20 ఫైనల్‌కు స్మృతి మంధాన సేన
TDP on Jagan: ర్యాలీకి భయపడుతూ తాడేపల్లి పిల్లి ప్యాలెస్‌లో పడుకుంది - సీఎంపై టీడీపీ సెటైర్లు
/body>