X

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు.. 74 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు..

జర్నలిస్టు తీన్మార్ మల్లన్న చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. 74 రోజులుగా మల్లన్న తీన్మార్ మల్లన్న జైలులోనే ఉన్నారు.

FOLLOW US: 

ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. చిలకలగూడలో నమోదైన కేసులో తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన మల్లన్నకు ఆయన అనుచరులు, అభిమానులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం అక్కడనుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ జ్యోతి‌ష్యు‌డిని బ్లాక్‌ మెయిల్‌ చేసి.. డబ్బులు డిమాండ్ చేశారని తీన్మార్ మల్లన్నపై ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా ఆగస్టులో  ఆయన అరెస్టు అయ్యారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు కాగా అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు ఇదివరకే బెయిల్ వచ్చింది. పెండింగ్‌లో ఉన్న మరో కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న 74 రోజులుగా జైల్లో ఉన్నారు. దీంతో బెయిల్ మంజూరు కోసం తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సోమవారం సాయంత్రం జైలు నుంచి విడుదల అయ్యారు. 

ఇప్పటికే తీన్మార్ మల్లన్న భార్య.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఎంపీ అరవింద్ కుమార్, సోదరుడితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆమె అమిత్ షాను కలిసి తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. అక్రమంగా కేసులు పెట్టి మల్లన్నను వేధిస్తున్నారని ఆరోపించారు. కేసు మీద కేసు పెడుతూ జైలుకు పంపే కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఒక కేసులో బెయిలు వస్తే మరో కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మల్లన్నపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలతో కూడిన లేఖను గతంలోనే అమిత్ షాకు అందించారు. మల్లన్న బీజేపీలో చేరబోతున్నట్టు ఇటీవలే క్యూ న్యూస్ ఛానల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు కోర్టులో చుక్కెదురు.. ఇక నేటి నుంచి..

Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న Q న్యూస్ ఆఫీసులో సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలు.. ఏమేం సీజ్ చేశారంటే..

Also Read: Theenmaar Mallanna: తీన్మార్ మల్లన్న అరెస్టు.. ఓ జ్యోతిష్యుడి ఫిర్యాదు వల్లే.. అసలేం జరిగిందంటే..

Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న చరిత్ర అలాంటిది.. మాజీ ఉద్యోగుల సంచలన ఆరోపణలు

Also Read: Anantapur News: అనంత విద్యార్థులపై విరిగిన లాఠీ... ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Teenmar Mallanna Q News Telangana High Court Bail To Teenmar Mallanna Teenmar Mallanna Arrest News

సంబంధిత కథనాలు

Harish Rao Review: థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రెడీ.. పడకలు సిద్ధం, ఒమిక్రాన్ ఆందోళన వేళ మంత్రి హరీశ్ సమీక్ష

Harish Rao Review: థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రెడీ.. పడకలు సిద్ధం, ఒమిక్రాన్ ఆందోళన వేళ మంత్రి హరీశ్ సమీక్ష

Weather Updates: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Updates: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు

Petrol-Diesel Price, 29 November: వాహనదారులకు శుభవార్త, స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలివీ..

Petrol-Diesel Price, 29 November: వాహనదారులకు శుభవార్త, స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలివీ..

Gold-Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి కూడా అదే దారిలో.. నేటి ధరలివే..

Gold-Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి కూడా అదే దారిలో.. నేటి ధరలివే..

AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు మరోసారి అస్వస్థత... హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు

AP Governor:  ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు మరోసారి అస్వస్థత... హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Shiva Shankar Master: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇకలేరు..

Shiva Shankar Master: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇకలేరు..

Vitamin D in Winter: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?

Vitamin D in Winter: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?

Shiva Shankar Master: నడవలేడనుకున్న మనిషి.. కొరియోగ్రాఫర్ గా మారి..

Shiva Shankar Master: నడవలేడనుకున్న మనిషి.. కొరియోగ్రాఫర్ గా మారి..

Redmi Note 11T 5G: రూ.17 వేలలోనే రెడ్‌మీ సూపర్ 5జీ ఫోన్.. రెండు రోజుల్లో మార్కెట్లోకి!

Redmi Note 11T 5G: రూ.17 వేలలోనే రెడ్‌మీ సూపర్ 5జీ ఫోన్.. రెండు రోజుల్లో మార్కెట్లోకి!