![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న Q న్యూస్ ఆఫీసులో సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలు.. ఏమేం సీజ్ చేశారంటే..
తీన్మార్ మల్లన్న Q న్యూస్ ఆఫీసులో సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీలు చేశారు. నెల రోజల వ్యవధిలో తనిఖీలు చేయడం ఇది రెండోసారి.
![Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న Q న్యూస్ ఆఫీసులో సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలు.. ఏమేం సీజ్ చేశారంటే.. cyber crime police search in teenmar mallanna Q News office Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న Q న్యూస్ ఆఫీసులో సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలు.. ఏమేం సీజ్ చేశారంటే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/25/0ba65624a6955239888c0c756ba01102_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని తిన్మార్ మల్లన్న Q న్యూస్ ఆఫీసులో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు చేశారు. కంప్యూటర్లు , హార్డ్ డిస్క్ లు 26, 2 సెల్ ఫోన్లు, ఇతర సామాగ్రిని సీజ్ చేశారు. 3 డీసీఎంలు, 4 వ్యాన్లు, పది కార్లు, బైకుల మీద పోలీసులు Q న్యూస్ ఆఫీసుకు వచ్చినట్టు తెలుస్తోంది. నాలుగు గంటలపాటు తనిఖీలు చేశారు. అయితే ఆ సమయంలో ఆఫీసులో తీన్మార్ మల్లన్న లేరు. Q న్యూస్ కార్యాలయంలో నెల రోజుల్లోనే రెండుసార్లు పోలీసుల సోదాలు చేశారు.
Also Read: Bullet Bandi Song: 'బుల్లెట్ బండి' ఫేమ్ పెళ్లి కూతురుకు బంపర్ ఆఫర్.. సాయి శ్రీయ ప్రధాన పాత్రలో..
Nityananda Kailasa : నిత్యానంద "కైలాస"కు దగ్గరి దారి తెలిసిపోయింది..! ఇక పోలీసులు వెళ్తారా..?
గతంలోనూ తనిఖీలు...
తీన్మార్ మల్లన్న కార్యాలయంలో నెల రోజుల కిందట కూడా రాత్రి పూట సైబర్ క్రైం పోలీసులు తనిఖీలు చేశారు. హార్డ్ డిస్క్, పెన్‌డ్రైవ్, కంప్యూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీన్మార్ మల్లన్న వద్ద పనిచేసి మానేసిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. తీన్మార్ మల్లన్నతో పాటు అతని సోదరుడు పలువురి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నట్లు యువతి ఆరోపణలు చేసింది. వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు సదరు యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు తనిఖీలు చేశారు. అయితే మల్లన్నకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని అప్పుడు పోలీసులు వెల్లడించారు.
మెుదట తనిఖీల సమయంలో సమాచారం తెలుసుకున్న మల్లన్న అభిమానులు కార్యాలయం వద్దకు భారీగా వచ్చారు. అయితే మల్లన్న కార్యాలయం నుంచి పోలీసులు కంప్యూటర్‌ను తీసుకెళుతుండగా ఆయన అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. అనంతరం వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి చేరి ఆందోళన చేపట్టారు.
తనిఖీలు ఎందుకు చేస్తున్నారో కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదని గతంలోనే తీన్మార్ మల్లన్న చెప్పారు. ప్రజా ప్రతినిధుల అక్రమాలను ప్రశ్నించినందుకే తనపై కుట్రలు జరుగుతున్నాయని..ప్రభుత్వం ఎన్నికేసులు పెట్టినా భయపడబోనని చెప్పుకొచ్చారు. ఇప్పటికే తనపై పదుల సంఖ్యలో కేసులు పెట్టారని చెప్పారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన వెనక్కి తగ్గేది లేదని.. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందన్నారు.
Traffic Police: ఇదేందయ్యా.. ఇదే.. ట్రాఫిక్ పోలీసులు బైక్ తోపాటు మనిషిని కూడా గాల్లోకి ఎత్తేసారుగా..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)