అన్వేషించండి

Telangana School Reopen: తెలంగాణలో స్కూల్స్ ఓపెన్ కు బ్రేక్... ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు... ఆ విద్యార్థులపై చర్యలొద్దని ఆదేశం

తెలంగాణ పాఠశాలలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు వారం రోజులపాటు స్టే విధించింది. అప్పటి వరకు స్కూళ్లు తెరవద్దని ఆదేశించింది.

విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాలలకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాలని బలవంతం చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని తెలిపింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభించవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.   

Also Read: YS Sharmila: అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కొప్పు రాజు కుటుంబంతో షర్మిల

Also Read: Supreme Court Judges Oath: చర్రితలో తొలిసారి... 9 మంది సుప్రీం జడ్జిలు ప్రమాణ స్వీకారం... మొత్తం జడ్జిల సంఖ్య ఎంతంటే?

విద్యాసంస్థలదే తుది నిర్ణయం

తెలంగాణలో సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ హైకోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కొవిడ్‌ సమయంలో పాఠశాలలను ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని పిటిషనర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రత్యక్ష బోధనపై మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆన్‌లైన్‌, ఆఫ్ లైన్ బోధనపై విద్యాసంస్థలకే పూర్తి నిర్ణయాధికారాన్ని ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యక్ష బోధన నిర్వహించాలనుకునే పాఠశాలలకు వారంలోపు మార్గదర్శకాలు జారీచేయాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీచేసింది. స్కూళ్లలో పాటించే కోవిడ్ మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని విద్యాశాఖకు సూచించింది. 

Also Read: SmartPhones in September: సెప్టెంబరులో విడుదల కానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే..

Also Read: Tollywood Drug Case: ఆ లెక్కలు చెప్పండి.. పూరీ జగన్నాథ్‌పై ఈడీ ప్రశ్నల వర్షం, బ్యాంక్ అకౌంట్ల పరిశీలన

కోవిడ్ మూడో దశ 

రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని హైకోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబరు లేదా అక్టోబరులో మూడో దశ పొంచి ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయని వెల్లడించింది. బడులు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతారన్న అభిప్రాయాలు ఉన్నాయనని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం రెండింటిని సమన్వయం చేసి చూడాలని సూచించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసింది.

Also Read: Tollywood Drugs Case LIVE: ఈడీ ముందుకు పూరీ జగన్నాథ్.. ఆరేళ్ల బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తున్న అధికారులు

Also Read: AP New Medical Policy: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... కొత్త వైద్యులకు మూడేళ్ల ప్రొబేషన్... !

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ఎండీ భేటీ!
హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ఎండీ భేటీ!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు నీళ్లు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు నీళ్లు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget