News
News
X

AP New Medical Policy: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... కొత్త వైద్యులకు మూడేళ్ల ప్రొబేషన్... !

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగుపర్చేందుకు, వైద్య సిబ్బంది నియామకం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తాజా వైద్య నియామకాల్లో ప్రొబేషన్ సమయాన్ని మూడేళ్లకు పెంచింది

FOLLOW US: 
 
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగు పరిచేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్య పరికరాల అధునీకరణ, పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించేందుకు సిద్ధమైంది. దీని ప్రకారం వైద్య విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేలా తగిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాశ్వత నియామకాల కింద నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నా, పనిచేసేందుకు వైద్యులు అంతగా ఆసక్తి చూపడంలేదు. తాజాగా చేపట్టిన వైద్యుల నియామకాల్లో రెండేళ్ల ప్రొబేషన్‌ను ప్రభుత్వం మూడేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై వైద్యులు ఎంతమేర ఆసక్తి చూపిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. వైద్య విధాన పరిషత్‌ జిల్లా ఆసుపత్రులు, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లోని 12 విభాగాల్లో 453 పోస్టుల భర్తీకి ప్రకటన చేస్తే 800 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు తెలిపింది. 

Also Read: IAS Officers Transfer: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... 14 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ... పదోన్నతుల కనీస సర్వీసు తగ్గింపు

కన్సాలిడేటెడ్ వేతనం

బోధనాసుపత్రుల్లో ప్రత్యక్ష విధానంలో 32, లేటరల్‌ ఎంట్రీ ద్వారా 17 మంది వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. వీటికి కేవలం 90 మందే దరఖాస్తు చేసుకున్నారు.  వైద్య విధాన పరిషత్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌లో కన్సాలిడేటెడ్‌ వేతనం కింద నెలకు రూ.53 వేలను చెల్లిస్తామని ప్రకటించారు. తొలి మూడేళ్ల ప్రొబేషన్‌ పీరియడ్‌లో పనితీరు సంతృప్తికరంగా ఉంటే  రెగ్యులర్ వేతనంతోపాటు ఇతర అలవెన్సులు అందిస్తామని ప్రకటించింది.  ఈ ప్రకటనలో మూడేళ్లపాటు ప్రొబేషన్‌ పీరియడ్‌ ఉంటుందని తెలిపింది. అలాగే నెలకు రూ.92 వేలు కన్సాలిడేటెడ్‌ వేతనం ఇస్తామని వెల్లడించింది. 

News Reels

Also Read: Covid 19 India Cases: దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. కరోనా థర్డ్ వేవ్‌‌కు సన్నద్ధం కావాలి.. ఆరోగ్య నిపుణులు

వేతనాల వ్యత్యాసాలు

రెగ్యులర్‌ స్కేల్‌కు బదులు కన్సాలిడేటెడ్‌ వేతనం ఇస్తామని చెప్పడంతో.. వైద్య విధాన పరిషత్‌ ద్వారా నియమితులయ్యే వైద్యులకు అందే మొత్తం వేతనంలో రూ.25 వేలు తగ్గుతోంది. ప్రొబేషన్‌ పీరియడ్‌ తగ్గించి, వేతనాల్లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రభుత్వానికి కోరుతున్నారు. ఈ రెండు నోటిఫికేషన్లలో మూడేళ్ల ప్రొబేషన్‌పై శాఖాపరమైన నిబంధనలను మార్చారా అని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర అధికారులు ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందికి ఇచ్చే వేతనాల చెల్లింపుల్లోనూ వ్యత్యాసాల తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Also Read: Corona Updates: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులివే.. దేశంలో 31వేలకు పైగా ఆందోళనకర వేరియంట్లు

Published at : 31 Aug 2021 11:21 AM (IST) Tags: AP News AP Latest news Doctors AP Notification AP health medical department

సంబంధిత కథనాలు

Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నేడు జరిగే స్పెషల్ పూజలివే!

Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నేడు జరిగే స్పెషల్ పూజలివే!

తుపానుగా మారనున్న వాయుగుండం-మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే

తుపానుగా మారనున్న వాయుగుండం-మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే

YSRCP Welfare Survey : సంక్షేమాన్ని మించి అసంతృప్తి - చల్లార్చచేందుకు వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నాలు ! ఇక నేరుగా రంగంలోకి సీఎం జగన్

YSRCP Welfare Survey :  సంక్షేమాన్ని మించి అసంతృప్తి - చల్లార్చచేందుకు వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నాలు ! ఇక నేరుగా రంగంలోకి సీఎం  జగన్

Srikalahasti: చొక్కాని ఉత్సవంలో అపశృతి - మంటలు చెలరేగడంతో భక్తుల తొక్కిసలాట, పలువురికి గాయాలు

Srikalahasti: చొక్కాని ఉత్సవంలో అపశృతి - మంటలు చెలరేగడంతో భక్తుల తొక్కిసలాట, పలువురికి గాయాలు

Nellore Girl Kidnap: నెల్లూరులో బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు, గంటల వ్యవధిలో కిడ్నాపర్ అరెస్ట్

Nellore Girl Kidnap: నెల్లూరులో బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు, గంటల వ్యవధిలో కిడ్నాపర్ అరెస్ట్

టాప్ స్టోరీస్

TS News Developments Today: నేడు తెలంగాణలో ఉన్న మెయిన్ ముచ్చట్లు గివే!

TS News Developments Today:  నేడు తెలంగాణలో ఉన్న మెయిన్ ముచ్చట్లు గివే!

RGV - Ashu Reddy: అషు రెడ్డి కాళ్లను ముద్దాడిన రామ్ గోపాల్ వర్మ, ఫొటో వైరల్

RGV - Ashu Reddy: అషు రెడ్డి కాళ్లను ముద్దాడిన రామ్ గోపాల్ వర్మ, ఫొటో వైరల్

Women Umpires in Ranji: బీసీసీఐ కీలక నిర్ణయం- రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లు

Women Umpires in Ranji: బీసీసీఐ కీలక నిర్ణయం- రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లు

చలికాలంలో ముల్లంగి వంటలను కచ్చితంగా ఎందుకు తినాలి?

చలికాలంలో ముల్లంగి వంటలను కచ్చితంగా ఎందుకు తినాలి?