Corona Updates: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులివే.. దేశంలో 31వేలకు పైగా ఆందోళనకర వేరియంట్లు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా వైరస్ కారణంగా ఏపీలో 13 మంది మృతి చెందగా.. తెలంగాణలో ఇద్దరు చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో 41,173 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 878 కరోనా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,13,001కి చేరింది. కొత్తగా కరోనా నుంచి 1,182 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 19,84,301కి చేరింది. ప్రస్తుతం 14,862 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,65,76,995 శాంపిల్స్ పరీక్షించారు.
Also Read: Woman Arrested: ప్రియుడి కోసం కన్నబిడ్డకు చిత్రహింసలు.. ఏపీ మహిళను అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
India Taliban Relations: 'భారత్'తో బలమైన బంధం కావాలి.. కానీ 'పాక్' మాకు బ్రదర్: తాలిబన్లు
తెలంగాణలో కొత్తగా 340 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,57,716 మంది కరోనా బారిన పడ్డారు. 359 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,47,953 మందికి చేరింది. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు 3,872 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
Also Read: Paralympics 2020: అవనికి ప్రత్యేక SUV వాహనం... ప్రకటించిన ఆనంద్ మహీంద్ర
Maha ED : మహారాష్ట్ర మంత్రికి ఈడీ సమన్లు.. రాణె అరెస్టుకు ప్రతీకారమా..!?
24 గంటల్లో తెలంగాణలో 75,102 మందికి పరీక్షలు చేశారు. అయితే ఇంకా 1,658 మంది రిపోర్ట్స్ రావల్సి ఉంది. ఇప్పటివరకు 2,45,59,439 మందికి నిర్ధరణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.58 శాతం, రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది. ఆసిఫాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 24 జిల్లాలో పదిలోపే కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 72 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
Also Read: West Godavari: గుంతల రోడ్డు బాగు చేయాలని అడవికొలను ప్రజల ఆందోళన.. పోలీసుల లాఠీ ఛార్జ్..
Gold Smuggling: ప్యాంటుపై పెయింట్ అనుకున్నారా? గోల్డ్ స్మగ్లింగ్ కు 'వాట్ ఏన్ ఐడియా సర్ జీ'
దేశంలో 31వేలకు పైగా ఆందోళనకర కొవిడ్ 19 వేరియంట్లు ఉన్నట్లు గుర్తించింది జీనోమ్ కన్సార్టియం. దేశవ్యాప్తంగా జరిపిన జీనోమ్ సీక్వెన్సింగ్‌లో వీటిని గుర్తించారు. ఇందులో 4,227 ఆల్ఫా, 219 బీటా, 2 గామా, 21,192 డెల్టా, 5,417 బి.1.1617.1, బి.1.617.3 వేరియంట్లు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి భారత్‌లో డెల్టానే ప్రధాన ఆందోళనకర వేరియంట్‌గా ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Jagan Tollywood Meet : నాలుగో తేదీన టాలీవుడ్ పెద్దలతో ఏపీ సీఎం జగన్ భేటీ !