West Godavari: గుంతల రోడ్డు బాగు చేయాలని అడవికొలను ప్రజల ఆందోళన.. పోలీసుల లాఠీ ఛార్జ్..
పశ్చిమగోదావరి జిల్లా అడవికొలనులో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు చర్యపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో రోడ్లు బాగాలేవని సమస్య పరిష్కరించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా అడవికొలను ప్రజలు పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం ఇద్దామని అనుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్థులను అడ్డుకున్నారు.
అయినా ప్రజలు ఆగలేదు. సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యేను కలిస్తే తప్పేంటని పోలీసులతో వాగ్వాదనికి దిగారు. ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ప్రజలపై దాడికి దిగారు. లాఠీఛార్జ్ చేశారు. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ALSO READ: నాలుగో వ్యక్తితో పెళ్లి కోసం మూడో భర్త దగ్గర డబ్బులు తీసుకున్న గాజువాక పిల్ల
అడవికొలను గ్రామానికి జనసేన పార్టీ మద్దతుదారే సర్పంచ్‌గా ఎంపికయ్యారు. అందుకే తమ గ్రామాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ప్రజలు. శాంతియుతంగా ఆందోళన చెబుతున్న తమపై లాఠీ ఛార్జ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల చర్యపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమని.. దెబ్బతిన్న రోడ్లు బాగు చేయాలని అడగడం కూడా ఆంధ్రప్రదేశ్‌లో తప్పా అని ప్రశ్నించారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారా కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నిలదీశారు.
ALSO READ:మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదల
ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ఇలా లాఠీలతో బెదిరించి నోళ్లు మూయించాలని చూడటం నిజంగా పిరికితనమే అవుతుందన్నారు నాదెండ్ల మనోహర్. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు లేవని... గుంతలే ఉన్నాయన్నారు.
పోలీసు శాఖ అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి పని చేస్తే కచ్చితంగా చట్టం ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు నాదెండ్ల. రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో పోలీసులు కళ్లారా చూస్తూ కూడా ప్రశ్నిస్తున్న ప్రజలపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను కొట్టి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని.. అక్రమ కేసులు బనాయించడం మంచిది కాదని హితవు పలికారు.
ALSO READ: శభాష్ సర్పంచ్.. గ్రామ సమస్యపై సీఎం జగన్‌కు లేఖ... సీఎం స్పందనతో అధికారులు పరుగులు
ఇప్పుడు ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోడ్లు బాగు చేయమని అడిగితే లాఠీ ఛార్జి చేయడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ALSO READ:కన్యత్వాన్ని తిరిగి పొందవచ్చా? వర్జినిటీ రిపేర్ పేరుతో వైద్యులు ఏం చేస్తున్నారు?
ALSO READ: 3 రకాల కోవిడ్ వ్యాక్సిన్లను 5 సార్లు తీసుకున్నాడు, చివరికి ఏమైందంటే..