Covid 19 India Cases: దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. కరోనా థర్డ్ వేవ్‌కు సన్నద్ధం కావాలి.. ఆరోగ్య నిపుణులు
కరోనా సెకండ్ వేవ్ ఇంకా తొలగిపోలేదని, మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు తప్పదని వైద్యశాఖ, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో నిన్నటితో పోల్చితే దాదాపు 12 వేల మేర కేసులు తగ్గాయి.
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు రెండు రోజులు పెరిగితే మరో రెండు, మూడు రోజులు తగ్గుతున్నాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ ఇంకా తొలగిపోలేదని, మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు తప్పదని వైద్యశాఖ, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భారత్ లో గడిచిన 24 గంటల్లో 30,941 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే దాదాపు 12 వేల మేర కేసులు తగ్గాయి.
నిన్న ఒక్కరోజులు మరో 350 మంది కొవిడ్19 మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. గడిచిన రోజుతో పోల్చితే మరణాల సంఖ్య కాస్త తగ్గినా.. కొత్త వేరియంట్ల ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమవారం ఒక్కరోజులో 36,275 మంది కరోనా మహమ్మారిని జయించారు. కరోనాను నుంచి కోలుకున్న వారి సంఖ్య 3. 19 కోట్లు (3 కోట్ల 19 లక్షల 59 వేల 680) అయింది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,38,560 (4 లక్షల 38 వేల 560)కి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షల 70 వేల 640గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. క్రియాశీల కేసులు 1.13 శాతం ఉండగా.. రికవరీ రేటు 97.53 శాతానికి చేరింది.
Also Read: Liver Health: కాలేయాన్ని కాపాడుకోవాలంటే.. వీటిని తప్పకుండా తినాలి, లేకపోతే మూల్యం తప్పదు..
India reports 30,941 fresh COVID-19 cases, 36,275 recoveries, and 350 deaths in the last 24 hours
— ANI (@ANI) August 31, 2021
Active cases: 3,70,640
Total recoveries: 3,19,59,680
Death toll: 4,38,560
Vaccination: 64,05,28,644 pic.twitter.com/dVyKCg4cep
గుబులురేపుతోన్న కేరళ
దేశ వ్యాప్తంగా గత మూడు నెలలుగా నమోదవుతున్న కేసులలో సగానికి పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే వస్తున్నాయి. తాజా కేసులలో 19,622 కొవిడ్ కేసులు కేవలం కేరళలో నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 350 మంది చనిపోగా, అందులో 132 మరణాలు ఈ ఒక్క రాష్ట్రంలోనే సంభవించడం ఆందోళనకు గురిచేస్తోంది.
జనవరి నుంచి ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 64 కోట్ల 05 లక్షల 28 వేల 644 డోసుల కరోనా టీకాలు పంపిణీ జరిగినట్లు తెలిపారు. ఇందులో గడిచిన 24 గంటల్లో 61 లక్షల 90 వేల 930 డోసుల వ్యాక్సిన్‌ను ప్రజలు తీసుకున్నారు.
Also Read: Hyderabad Crime News: తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై లైంగిక దాడి.. ఆ మహిళ నిలదీయడంతో..!