అన్వేషించండి

Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

Telangana News: తెలంగాణ గ్రూప్ 1 పరీక్షా కేంద్రాల వద్ద కొన్ని చోట్ల తొలి రోజు గుండెలు పిండేసే దృశ్యాలు కనిపించాయి. నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

Telangana Group 1 Exams: ఒక్క నిమిషం.. ఒకే ఒక్క నిమిషం వారి కలను చిదిమేసింది. కన్నవారిని ఉన్న ఊరిని వదిలి పుస్తకాలతో కుస్తీ పడుతూ ప్రభుత్వ అధికారులుగా స్థిరపడాలన్న వారి ఆశలపై నీళ్లు చల్లింది. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కాగా వివిధ కారణాలతో నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు అనుమతించలేదు. మధ్యాహ్నం 2 గంటలకు అన్నీ పరీక్షా కేంద్రాల గేట్లను అధికారులు మూసేశారు. దీంతో తమను పరీక్షకు అనుమతించాలని కన్నీటితో వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఓ పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థి రోదిస్తూ తనను లోపలికి పంపించాలని గేటు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా తొలి రోజు కొన్ని చోట్ల గుండెలు పిండేసే దృశ్యాలు కనిపించాయి. ఎంత వేడుకున్నా ఫలితం లేకపోవడంతో చివరకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు. 

గోడ దూకి పరీక్ష కేంద్రం వైపు..

సికింద్రాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన ఓ అభ్యర్థి తనను లోపలికి పంపించాలని అధికారులను వేడుకున్నాడు. అయినా నిబంధనల ప్రకారం పోలీసులు అతన్ని అనుమతించలేదు. దీంతో గోడ దూకి పరీక్ష కేంద్రం వైపు పరుగులు పెట్టాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో చోట, ఓ మహిళా  అభ్యర్థిని నిమిషం ఆలస్యంగా రాగా.. అధికారులు అనుమతించలేదు. దీంతో గేట్లు పట్టుకుని కన్నీటితో తనను అనుమతించాలని వేడుకుంది. అయినా, పోలీసులు లోపలికి అనుమతించలేదు.
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

అమ్మ కన్నీటిని చూసి..

గ్రూప్ - 1 పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన ఓ అభ్యర్థినిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో పరీక్ష రాయలేకపోయానని ఆమె ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. ఈ క్రమంలో పోలీసు సిబ్బంది ఆమెకు సపర్యలు చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన సదరు అభ్యర్థిని బిడ్డ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యం అక్కడి వారిని కదిలించింది.
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

శభాష్.. పోలీస్

అటు, కొన్ని కేంద్రాల్లో పోలీసులు అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా సాయం చేశారు. దుండిగల్‌లో ఓ అభ్యర్థిని పొరపాటున తన పరీక్షా కేంద్రానికి కాకుండా వేరే పరీక్షా కేంద్రానికి వెళ్లింది. దీంతో కన్నీళ్లు పెట్టుకోగా అక్కడే విధులు నిర్వహిస్తోన్న ఓ పోలీస్ సిబ్బంది విషయం తెలుసుకుని ఆ అభ్యర్థినిని తన బైక్‌పై ఆమె పరీక్షా కేంద్రానికి సకాలంలో తీసుకెళ్లారు. దీంతో పోలీస్ సిబ్బందిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, కీసరలో అభ్యర్థి పరీక్షా కేంద్రానికి రావడం ఆలస్యం కావడంతో.. ఇది గమనించిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య అతన్ని పెట్రోలింగ్ వాహనంలో గీతాంజలి ఇంజినీరింగ్ పరీక్షా కేంద్రానికి సకాలంలో తీసుకొచ్చారు. దీంతో ఆ అభ్యర్థి సజావుగా పరీక్ష రాయగలిగారు.
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

ప్రశాంతంగా ముగిసిన పరీక్ష

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు క్వాలిఫై కాగా వీరిలో అత్యధికులు పరీక్షకు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. తొలి రోజు జనరల్ ఇంగ్లీష్ పేపర్ పరీక్ష నిర్వహించారు. మంగళవారం నుంచి ఈ నెల 27 వరకూ  వివిధ సబ్జెక్టుల ప్రకారం పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆందోళనలు కొనసాగుతోన్న క్రమంలో పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్నీ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు. పరీక్ష గది, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్ జిల్లాలో 5,163 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 4,896 మంది హాజరయ్యారు. 

అటు, గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలు స్పష్టంగా చెప్పిందని.. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంది. పలితాల విడుదలకు ముందే తుది విచారణ ముగించాలని ఉన్నత న్యాయస్థానానికి సూచించింది.

Also Read: Telangana Jobs: బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న రేవంత్ రెడ్డి - అన్ని లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Embed widget