News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IPS Officer Transfers: తెలంగాణలో ఐపీఎస్ అధికారులకు ట్రాన్స్‌ఫర్‌లు - ప్రభుత్వం ఉత్తర్వులు

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టినట్టు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ ఆఫీస‌ర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరి ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టినట్టు తెలుస్తోంది. పోలీసు ప‌ర్సన‌ల్ విభాగం అద‌న‌పు డీజీగా సౌమ్య మిశ్రా, ఔష‌ధ నియంత్రణ డైరెక్టర్ జ‌న‌ర‌ల్‌గా క‌మ‌లాస‌న్ రెడ్డి, ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్, హోంగార్డు డీఐజీగా అంబ‌ర్ కిషోర్ ఝా, మేడ్చల్ డీసీపీగా శ‌బ‌రీశ్ లను ట్రాన్స్‌ఫర్ చేశారు. 

ఇటీవలే ఐఏఎస్ ల బదిలీ

ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఎస్ఎస్ అధికారుల బదిలీలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 31 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ గత శుక్రవారం (జూలై 14) ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా పోస్టింగ్ కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. బదిలీ అయిన 31 మందిలో 16 మంది మహిళలు ఉన్నారు.

బదిలీ అయిన ఐఏఎస్‌ల వివరాలు

శశాంక్‌ గోయల్‌ను ఎంఆర్‌హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్‌ జనరల్‌గా, ఆయుష్ డైరెక్టర్‌గా హరిచందన, శైలజా రామయ్యర్​ - యువజన సర్వీసులు, పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శిగా, ఆర్కియాలజీ డైరెక్టర్‌, క్రీడాపాధికార సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు, అలగు వర్షిణి - హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ, కొర్రా లక్ష్మీ - క్రీడల సంచాలకులు, హైమావతి - ఎయిడ్స్ కంట్రోల్‌ సొసైటీ డైరెక్టర్‌, కె.హరిత - ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శిగా, కె.నిఖిల - రాష్ట్ర పర్యాటకశాఖ సంచాలకులుగా, ప్రియాం ఆల - భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా, ఐలా త్రిపాఠి - ములుగు కలెక్టర్‌గా, కృష్ణ ఆదిత్య - కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, సత్య శారదా దేవి - వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శిగా, ముజమిల్‌ ఖాన్‌ - పెద్దపల్లి కలెక్టర్‌గా, సత్యనారాయణ- టీఎస్‌ఫుడ్స్‌ ఎండీగా, ప్రతీక్‌ జైన్​ - భద్రాచలం ఐటీడీఏ పీవోగా, పి.గౌతం - సెర్ప్‌ సీఈవో, అనుదీప్ దురిశెట్టి - హైదరాబాద్‌ కలెక్టర్‌, ఎస్‌.స్నేహ- జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌, మంద మకరందు- నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌, నవీన్‌ నికోలస్‌ - గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.

Published at : 19 Jul 2023 06:24 PM (IST) Tags: Telangana Govt Assembly Elections IPS Officer transfers IPS Officers

ఇవి కూడా చూడండి

Top Headlines Today: నేడు సుప్రీంలో బాబు పిటిషన్ విచారణ; కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక? - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: నేడు సుప్రీంలో బాబు పిటిషన్ విచారణ; కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక? - నేటి టాప్ న్యూస్

Weather Latest Update: తెలుగు రాష్ట్రాలపైకి బలమైన ఆవర్తనం! ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

Weather Latest Update: తెలుగు రాష్ట్రాలపైకి బలమైన ఆవర్తనం! ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

Ganesh Nimajjanam 2023: ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తాం, గణేష్ మండప నిర్వహకుల ఆందోళన! భారీగా ట్రాఫిక్ జామ్

Ganesh Nimajjanam 2023: ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తాం, గణేష్ మండప నిర్వహకుల ఆందోళన! భారీగా ట్రాఫిక్ జామ్

టాప్ స్టోరీస్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత