అన్వేషించండి

Telangana Rythu Bharosa: ఇక రైతు భరోసా అందరికీ రాదు! ఈ రైతులకు మాత్రమే - ప్రభుత్వం సన్నాహాలు

Rythu Bharosa Scheme : రైతులకు ఎంత భూమి ఉన్నా సరే పెట్టుబడి సాయాన్ని మాత్రం ఐదు ఎకరాలకే అందించే దిశగా సర్కార్ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించనున్నారు.

Rythu Bharosa News:  రైతు భరోసా (బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు) పథకానికి సీలింగ్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఐదు లేదా 10 ఎకరాల భూమి ఉన్న వారికే పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రైతులకు ఎంత భూమి ఉన్నా సరే పెట్టుబడి సాయాన్ని మాత్రం ఐదు లేదా 10 ఎకరాల వరకే అందించే దిశగా సర్కార్ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అర్హత గల రైతులకు మాత్రమే సాయం అందేలా పకడ్బంధీ విధివిధాలను రూపొందించే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది.

పంట పెట్టుబడి సాయం కోసం ప్రతి ఎకరాకు రూ. 15 వేలు అందజేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత ఈ ఖరీఫ్ సీజన్ నుంచి పంట పెట్టుబడి సాయం అందజేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే గతంలో రైతుబంధు పథకం కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించేవారు. ఇదే పథకాన్ని రైతు భరోసాగా పేరుమార్చి ఎకరాకు రూ. 15 వేలు రెండు విడతల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అప్పట్లో ఎలాంటి పరిమితుల్లేవు
గత కేసీఆర్ సర్కార్ హయాంలో  రైతుబంధు పథకానికి  ఎలాంటి పరిమితులు లేవు.  రైతు పేరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు పంట పెట్టుబడి సాయం అందింది. ఎకరానికి ఏటా రెండు విడతల్లో కలిపి రూ. 10 వేలు సాయాన్ని రైతుల ఖాతాల్లో బీఆర్ఎస్ సర్కార్ జమ చేసింది. అయితే నిజమైన రైతులు కాని వారికి కూడా రైతు బంధు సాయం అందిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే వందలాది ఎకరాలు ఉన్న వాళ్లు, అసలు వ్యవసాయమే చేయని వాళ్లు,  కోటీశ్వరులు, ఇన్ కమ్ ట్యాక్స్  కట్టేవారికి రైతు బంధు సాయం అందించడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి.  రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలు, పడావు భూములకు కూడా రైతుబంధు అందిందనే ఆరోపణలు వచ్చాయి. 

తగ్గనున్న ఆర్థిక భారం
 దీంతో ఈసారి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం రైతుబంధు పథకానికి పరిమితి విధించాలని యోచిస్తోంది. దీని ద్వారా అసలైన లబ్ధిదారులకు సాయం అందించడమే కాకుండా ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గనుంది. కోటీశ్వరులు, ఆదాయ పన్ను కట్టే వారికి  రైతుబంధు ఇవ్వబోమని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. అలాగే సాగు చేసే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంటే వ్యవసాయం చేసే నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసాను ప్రభుత్వం అందిస్తుంది. కొండలు, గుట్టలు, పడావు భూవులు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఉన్న వారికి పంటపెట్టుబడి సాయాన్ని నిలిపి వేయనుంది.

21న మంత్రి వర్గ సమావేశం
రైతు బంధును ఐదు ఎకరాల వరకే పరిమితం చేయాలా? లేదా 10 ఎకరాల వరకు అందించాలా? అనే విషయంపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.  రేపు (జూన్ 21) జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా పథకంపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. అంతిమ నిర్ణయం తర్వాత త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులందరూ పంట పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా విధివిధానాలు ఖరారు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

రెవెన్యూ రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా  69 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరి వద్ద 1.53 కోట్ల ఎకరాల భూమి ఉంది. వీరిలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 64.75లక్షల మంది ఉన్నారు. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం రైతు బంధుకు సీలింగ్ విధిస్తుందన్న వార్త నేపథ్యంలో  పెద్ద మొత్తంలో భూములు ఉన్న వాళ్లు తమ కుటుంబ సభ్యుల పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కేంద్రంతో చర్చలు సఫలం.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ
కేంద్రంతో చర్చలు సఫలం.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ
HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Embed widget