అన్వేషించండి

Telangana LRS : ఎల్ఆర్ఎస్‌పై తాజా అప్ డేట్ - మూడు నెలలోనే పూర్తి - తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

Telangana Ministers : మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రులు పొంగులేటి, భట్టి విక్రమార్క అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

LRS in Telangana :  లే ఔట్ రెగ్యులరైజేషన్ .. ఎల్‌ఆర్‌ఎస్  ప్రక్రియను వేగవంతం చేయాలని  రెవెన్యూ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.  నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.  ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో ముఖ్యంగా ప్రభుత్వ భూములు  ప్రైవేట్  వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఎల్.ఆర్.ఎస్. పై శనివారం నాడు జిల్లా కలెక్టర్ లతో  మంత్రి పొంగులే్టి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  భూపాలపల్లి జిల్లా  పర్యటనలో ఉన్న  పొంగులేటి   ఆ జిల్లా కలెక్టర్ ఆఫీసు నుండి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క పాల్గొన్నారు.  గత ప్రభుత్వం ఆగస్టు 31 నుండి అక్టోబర్ 31, 2020 వరకు ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల ను    సీకరించింది .  ఈ సమయంలో 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి.   గత నాలుగు సంవత్సరాలుగా ఈ దరఖాస్తులు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదు.  మొత్తం 25.70 లక్షల దరఖాస్తుల్లో హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పరిధిలో 13.69 లక్షలు మరియు గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటి పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు వచ్చాయి.  

ఈ దరఖాస్తుదారులు సమస్య పరిష్కారం కొరకు నాలుగు సంవత్సరముల నుండి ఎదురుచూస్తున్నారని  మంత్రి తెలిపారు.  ఈ దరఖాస్తులను అత్యంత ప్రాదాన్యతాక్రమములో పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు.  ఇందుకోసం, జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై తీసుకోవాలని, ప్రతిపాదనలు పంపిస్తే రెవెన్యూ శాఖ నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటుచేయాలి.  క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్ లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు (హెల్ప్ డెస్క్లు)  వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు.  ఎల్అర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయుల సిబ్బంది, అధికారులకు శిక్షణ  తక్షణమే చేపట్టాలని, ఎల్ఆర్ఎస్ విధివిధానాలను విడుదల చేసిన నేపథ్యంలో అమలుకు అవసరమైన కార్యాచరణను చేపట్టాలని, జిల్లా కలెక్టర్ లు ఈ ప్రక్రియ ను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.  హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాలల్లో అత్యంత విలువైన భూములు ఉన్నాయని ఈ జిల్లాల్లో లేఅఔట్ ల క్రమబద్దీకరణ విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ఆస్తులకు చట్టపరమైన గుర్తింపుతో సహా ఆమోదించబడిన లేఅవుట్ల ద్వారా అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. 
ఆమోదించబడిన లేఅవుట్ యజమానులకు ఇంటి నిర్మాణాలకు భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి సహాయపడుతుందని రెవిన్యూ మంత్రి తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
Hyderabad News: మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
Best Car Under Rs 8 Lakh: రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
Telangana Congress: బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్రతన్‌ టాటా వీలునామాలో శంతను పేరు, ఏమిచ్చారంటే?మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP DesamNara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
Hyderabad News: మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
Best Car Under Rs 8 Lakh: రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
Telangana Congress: బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
YS family property dispute: విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
Kaleshwaram Case: కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
Kiran Abbavaram: ‘క‘ బాగాలేదనిపిస్తే సినిమాలు వదిలేస్తా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ స్పీచ్
‘క‘ బాగాలేదనిపిస్తే సినిమాలు వదిలేస్తా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ స్పీచ్
iMac 24 inch 2024: కొత్త ఐమ్యాక్ 24 లాంచ్ చేసిన యాపిల్ - ప్రొఫెషనల్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!
కొత్త ఐమ్యాక్ 24 లాంచ్ చేసిన యాపిల్ - ప్రొఫెషనల్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!
Embed widget