అన్వేషించండి

EV offer for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఆఫర్ - ఈవీలపై 20 శాతం వరకు రాయితీ!

Telangana government employees: తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా మరో చారిత్రాత్మక అడుగు వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రాయితీలను అందిస్తోంది.

EV offer for Telangana government employees:   పర్యావరణ పరిరక్షణ,  కాలుష్య నియంత్రణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని సుమారు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా వాహన తయారీ సంస్థలతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక రాయితీలను ఖరారు చేసింది. సచివాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వివరాలను వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), మహీంద్రా, ఏథర్ ఎనర్జీ వంటి ప్రముఖ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగులకు  10 నుంచి 20 శాతం వరకు అదనపు డిస్కౌంట్ ఇచ్చేందుకు అంగీకరించాయి.

దేశంలోనే తొలిసారిగా స్టేట్ నెగోషియేటెడ్ రాయితీలు 

సాధారణంగా ప్రభుత్వం పన్ను మినహాయింపులు మాత్రమే ఇస్తుంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి తయారీ సంస్థలతో నేరుగా చర్చలు జరిపి తన ఉద్యోగుల కోసం ప్రత్యేక ధరలను నిర్ణయించడం దేశంలోనే మొదటిసారి. ఓలా ఎలక్ట్రిక్ వంటి సంస్థలు ఇచ్చే ఈ ప్రత్యేక ఆఫర్ల వల్ల ఒక్కో ఉద్యోగి వాహనాన్ని బట్టి వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు  గరిష్టంగా రూ. 4 లక్షల వరకు  ఆదా చేసుకునే అవకాశం ఉంది. కేవలం పన్ను రాయితీలు మాత్రమే కాకుండా, నేరుగా కొనుగోలు ధరలోనే ఈ తగ్గింపు లభిస్తోంది. 

100% పన్ను మినహాయింపుతో రెట్టింపు లాభం 

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈవీ పాలసీ-2024 ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు,  రోడ్డు ట్యాక్స్‌పై 100 శాతం మినహాయింపు అమలులో ఉంది. ఇప్పుడు అదనంగా లభించే ఈ 20 శాతం డిస్కౌంట్‌తో కలిపి చూస్తే, ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు అత్యంత చౌకగా మారనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. ఇకపై ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేసే లేదా అద్దెకు తీసుకునే వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.   

గ్రీన్ తెలంగాణ దిశగా అడుగులు 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్  ఢిల్లీ లాంటి కాలుష్య పరిస్థితులు హైదరాబాద్‌కు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులే ముందుగా ఈవీలను వినియోగించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. దీని కోసం సచివాలయం, జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో భారీగా ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ వంటి సంస్థలు ప్రభుత్వంతో చేతులు కలపడం వల్ల క్షేత్రస్థాయిలో పెను మార్పులు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget