వైఫై రూటర్ అనేది మనం కొనే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల లాగే కాలక్రమేణా పాతబడిపోతుంది.

సాధారణంగా ఒక రూటర్ని 3 నుండి 5 ఏళ్లకు ఒకసారి మార్చడం ఉత్తమం

WiFi 5, WiFi 6, ప్రస్తుతం WiFi 7 వంటి కొత్త వెర్షన్లు వస్తున్నాయి. పాత రూటర్లు ఈ వేగాన్ని అందుకోలేవు

100 Mbps లేదా 500 Mbps ప్లాన్ తీసుకున్నా, పాత రూటర్ పాత టెక్నాలజీతో ఉంటే పూర్తి స్థాయి వేగం రాదు.

కొత్త రూటర్లలో WPA3 వంటి బలమైన సెక్యూరిటీ ఉంటుంది.

స్మార్ట్ టీవీలు, అలెక్సా, సీసీ కెమెరాలు ఇలా చాలా పరికరాలు కనెక్ట్ అయి ఉంటున్నాయి. పాత రూటర్లు ఇన్ని కనెక్షన్లను తట్టుకోలేవు.

రూటర్లు 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. కాలక్రమేణా వాటి సామర్థ్యం తగ్గిపోతుంది.

కొత్త రూటర్లలో ఉండే 'బీమ్‌ఫార్మింగ్ టెక్నాలజీ వల్ల సిగ్నల్ ఇంటి మూలమూలకూ అందుతుంది.

కంపెనీలు పాత మోడళ్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇవ్వడం ఆపేస్తాయి. దీనివల్ల రూటర్ పనితీరు మందగిస్తుంది.

మీ రూటర్ ఐదేళ్ల కంటే పాతదైతే, మీ ఇంటర్నెట్ వేగం పెంచుకోవడానికి ఒక కొత్త 'వైఫై 6 రూటర్ కొనడం మంచిది.