అన్వేషించండి

Good news for vehicle buyers in Telangana: తెలంగాణ వాహనదారులకు బంపర్ ఆఫర్ - రెండో వాహనంపై 2 శాతం అదనపు పన్ను రద్దు!

Telangana vehicle Tax : తెలంగాణలో రెండో వాహనం కొనుగోలుపై ఇప్పటివరకు ఉన్న అదనపు పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రెండో వాహనం కొనేవారికి కొంత మొత్తం ఆదా అవుతుంది.

No additional tax to be paid if buying a second vehicle:  తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఒకే వ్యక్తి పేరు మీద రెండో వాహనం లేదా అంతకంటే ఎక్కువ వాహనాలు కొనుగోలు చేసినప్పుడు విధించే 2 శాతం అదనపు జీవితకాల పన్ను ను రద్దు చేస్తూ రవాణా శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  వాహన్ పోర్టల్‌ను ప్రారంభించిన సందర్భంగా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు.

ఈ పన్ను ఎందుకు విధించారు? 

గతంలో రహదారులపై వాహనాల సంఖ్యను నియంత్రించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అదనపు పన్నును ప్రవేశపెట్టింది. ఒక వ్యక్తికి ఇప్పటికే ఒక వాహనం ఉండి, రెండో వాహనం కొంటే, ఆ వాహనం ధరపై అదనంగా 2 శాతం లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉండేది. ఉదాహరణకు, 10 లక్షల రూపాయల కారు కొంటే, అదనంగా 20 వేల రూపాయల పన్ను కట్టాల్సి వచ్చేది. దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు ఆదాయం వచ్చేది.

రద్దు చేయడానికి ప్రధాన కారణాలు 

 కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుటంున్నారు. 2 శాతం పన్ను తప్పించుకోవడానికి చాలా మంది వాహనదారులు తమ భార్య లేదా ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద వాహనాలను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో బీమా  క్లెయిమ్ సమయంలో లేదా వాహనం అమ్మేటప్పుడు యాజమాన్య హక్కుల విషయంలో అనేక చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి.  తెలంగాణ ప్రభుత్వం తాజాగా కేంద్ర ప్రభుత్వ జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫామ్  వాహన్ లో చేరింది. ఈ సాఫ్ట్‌వేర్‌లో రెండో వాహనాన్ని గుర్తించి అదనపు పన్ను విధించే ఆప్షన్ లేదు. దీని కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ తయారు చేయించడం కంటే, పన్నును రద్దు చేయడమే మేలని ప్రభుత్వం భావించింది.  పొరుగు రాష్ట్రాల్లో ఇలాంటి అదనపు పన్ను లేకపోవడం వల్ల ఇక్కడి వాహనదారులపై అనవసర ఆర్థిక భారం పడుతోందని నివేదికలు అందాయి.

వాహన కొనుగోలుదారులకు కలిగే లాభాలు 

ఈ నిర్ణయంతో వాహనదారులకు నేరుగా ఆర్థిక వెసులుబాటు కలగనుంది. ఇకపై ఒకే వ్యక్తి పేరు మీద ఎన్ని వాహనాలు కొన్నా అదనపు పన్ను ఉండదు, కేవలం సాధారణ లైఫ్ ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఇది ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఉపశమనం. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.  వాహన్ పోర్టల్ ద్వారా ఇకపై ఆర్‌సీ డూప్లికేట్, పేరు మార్పు వంటి సేవలు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో పొందే వీలుంటుంది. 

తెలంగాణ రాష్ట్రంలో ఏటా సుమారు 7 లక్షల ద్విచక్ర వాహనాలు, 2.5 లక్షల కార్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో సుమారు 20 శాతం వరకు రెండో వాహనాలే ఉంటున్నాయి. తాజా నిర్ణయంతో వాహన రంగంలో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని డీలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంస్కరణల దిశగా రవాణా శాఖ వేసిన ఈ అడుగు పారదర్శకతను పెంచడమే కాకుండా, దళారుల ప్రమేయం లేకుండా ప్రజలకు నేరుగా సేవలు అందేలా చేస్తుంది. 

టాప్ హెడ్ లైన్స్

TIMS Sanathnagar Hospital Inauguration:హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget