అన్వేషించండి

Telangana Elections 2023 : కాళేశ్వరం అవినీతిపై 15 నిమిషాల్లో సీబీఐ విచారణ - ఒక్క షరతు పెట్టిన కిషన్ రెడ్డి !

మేడిగడ్డ బ్యారేజీని బీజేపీ బృందం పరిశీలించింది. కాళేశ్వరంను ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా కిషన్ రెడ్డి అభివర్ణించారు.


Telangana Elections 2023 :  మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగుబాటుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పిల్లర్ల కుంగడంతో బ్యారేజ్ ఉంటుందా.. మొత్తానికే కొట్టుకపోతుందనే ఆందోళ ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజీని బీజేపీ ప్రతినిధుల బృందం శనివారం పరిశీలించింది. కిషన్ రెడ్డి నేతత్వంలో మేడి గడ్డ బ్యారేజీని బీజేపీ నేతలు పరిశీలించారు. కుంగిన పిల్లర్లను డా. లక్ష్మణ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరాన్ని పరిశీలించిందన్నారు. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను కేంద్రానికి ఇచ్చిందన్నారు.                    

కాళేశ్వరం పేరుతో అంచనాలు పెంచి దోపిడి                                           

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో కీలక అంశాలను పొందుపర్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పన్నులతో కాళేశ్వరం నిర్మాణం చేసిందన్నారు. కాళేశ్వరం నిర్మాణానికి రూ.40వేల కోట్లు అంచనా వేశారన్నారు. అంచనాను రూ. 1.30 లక్షల కోట్లకు పెంచారన్నారు. కాళేశ్వరంపై తెలంగాణ సమాజం అంతా ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఇంజనీర్ల నోరు మూయించి కేసీఆరే ఇంజనీర్ గా వ్యవహరించారన్నారు. కేసీఆర్ ఉత్తరం రాస్తే 15 నిమిషాల్లో సీబీఐ విచారణ చేస్తుందన్నారు. 

కేంద్రానికి  పూర్తి సమాచారం ఇవ్వని  తెలంగాణ                 

 అధికారులు 20 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులను వివరాలు అడిగితే కేవలం 11 అంశాలకు సంబంధించి మాత్రమే సమాధానం ఇచ్చారని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం వైఫల్యాలను ప్రజలకు తెలియకుండా.. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా నిలిచిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల కోట్లు దుర్వినియోగం చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. రూ. లక్ష కోట్ల అప్పులు చేసిన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందన్నారు.  

కేసీఆర్ లేఖ రాస్తే సీబీఐ విచారణ                        

కేసీఆర్ అవినీతితో మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్లు ఏర్పాడి పిల్లర్లు కుంగిపోయాయని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే కేంద్ర జలశక్తి నిపుణులకు లేఖ రాసినట్లు కిషన్ రెడ్డి గుర్తు చేశారు.   సీఎం కేసీఆర్ ఇంజనీరుగా అవతారమెత్తి,నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణచడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు సీబీఐ విచారణ చేయించడం లేదని ప్రశ్నిస్తోంది. అయితే బీజేపీ మాత్రం కేసీఆర్ లేఖ రాయాలని చెబుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Embed widget