Telangana Deeksha Divas 2023: నవంబర్ 29న దీక్షా దివస్, చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్!
Deeksha Divas memorable day in Telangana: కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు గుర్తుగా గత 14 ఏండ్లుగా తెలంగాణలో నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహించుకుంటున్నారు.
Deeksha Divas News In Telugu: కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు గుర్తుగా గత 14 ఏండ్లుగా తెలంగాణలో నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహించుకుంటున్నారు. ఈ నవంబర్ 29తో 15 ఏటకు చేరుకుంటున్నామని, ఏడాది సైతం ఘనంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజు నవంబర్ 29. ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ అంటూ నినదించిన బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకుని ఉద్యమం చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగా డిసెంబర్ 9న అప్పటి కేంద్రమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేశారు. అయితే ఉద్యమం చేసినా.. అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోవడంతో ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమయ్యారు. చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తేవడంలో సఫలీకృతులయ్యారు.
దీక్షకు ముందు రోజు నవంబర్ 28, 2007న కరీంనగర్ కు చేరుకున్న కేసీఆర్.. మరుసటి రోజు 29న దీక్షాస్థలం సిద్ధిపేటకు కరీంనగర్ నుంచి జయశంకర్ సార్ తో కలిసి బయలుదేరారు. కానీ అల్గునూర్ చౌరస్తా వద్ద పోలీసులు అదుపులో తీసుకుని వరంగల్ మీదుగా కేసీఆర్ ను ఖమ్మం జైలుకు తరలించారు. ఈ సంఘటన తెలంగాణ ను కుదిపేసింది. గూలాబీ దళపతి కేసీఆర్ ను దీక్షకు ఉపక్రమించకుండా అదుపులోకి తీసుకోవడం తెలంగాణ ప్రజలను ఆవేదనతో పాటు ఆగ్రహానికి గురి చేసింది.
ఖమ్మం జైలులో ఆరోగ్యం క్షీణించడంతో కేసీఆర్ ను డిసెంబర్ 3న హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ కు తరలించే క్రమంలో రికార్డైన కేసీఆర్ విజువల్స్ ను చూసిన తెలంగాణ ప్రజలు చలించిపోయారు. మా కోసం పోరాడుతున్న నేత అచేతన వ్యవస్థలో ఉన్నాడన్న విషయం తెలిసి ఆందోళనకు గురయ్యారు. ఉమ్మడి పాలకుల వ్యవహారాలన్నీ ఉద్యమ కారులను అవమానించేలా రెచ్చగొట్టేలా ఉండటంతో ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. తనను నిమ్స్ కు తరలించేటప్పుడు ‘కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో’, 'తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో' అని కేసీఆర్ చేసిన నినాదం తెలంగాణ ఉద్యమ నినాదమైంది. దీంతో తెలంగాణ రాష్ట్రం అంతా అల్లకల్లోలమైంది. ప్రజలు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, యువత భగ్గుమన్నారు. బస్సులు బందు, రైళ్లు బంద్ అయ్యాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చారు. అరెస్టును తట్టుకోలేక శ్రీకాంతాచారి ఎల్బీనగర్ లో తొలి బలిదానం ఇచ్చాడు. మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసిన తొలి అమరుడిగా నిలిచాడు. యువత ఆత్మహత్యలు చూసి ఉద్యమ సారథి కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
కేసీఆర్ పట్టు విడువకుండా కొనసాగిస్తున్న దీక్షతో కాంగ్రెస్ కోర్ కమిటీ ఢిల్లీలో డిసెంబర్ 9న సమావేశమైంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం రోశయ్యను హైదరాబాద్ విమానం ఎక్కించారు. రాత్రి 11.30 గంటలకు ఢిల్లీలో చిదంబరం మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పి ప్రత్యేక రాష్ట్రం అవిర్భవించడానికి కారణమైంది. అప్పటినుంచి దీక్షా దివస్ గా దీన్ని ప్రతి ఏటా తెలంగాణ సమాజం నిర్వహించుకుంటూ రాష్ట్ర సాధనలో కీలకమైన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటోంది.