Ramoji Rao Funeral: మీడియా దిగ్గజం రామోజీరావు అంతిమయాత్ర - పాడె మోసిన చంద్రబాబు
Ramoji Rao: మీడియా దిగ్గజం రామోజీరావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. స్మృతి వనం వద్ద నివాళి అర్పించిన అనంతరం రామోజీరావు పాడె మోశారు.
Chandrababu Attends Ramoji Rao Funeral: మీడియా దిగ్గజం రామోజీరావు (Ramoji Rao) అంతిమయాత్ర ఆదివారం ఉదయం ఫిల్మ్ సిటీ నుంచి ప్రారంభమై.. రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా స్మృతి వనం వద్దకు చేరుకుంది. రామోజీరావు అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) హాజరయ్యారు. స్మృతి వనం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన రామోజీరావు పాడె మోశారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఈనాడు సంస్థల సిబ్బంది, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రామోజీరావు అంతిమయాత్రలో పాల్గొన్నారు. మీడియా మొఘల్‌కు కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు. అటు, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. రామోజీరావు మరణానికి సంతాపంగా ఏపీలో ఆది, సోమవారాలు సంతాపదినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అటు, తెలంగాణలో షూటింగ్స్ ఆదివారం బంద్ కానున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది.
రామోజీరావు గారి అంతిమ సంస్కారాలకు హాజరై, రామోజీరావు గారి పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు గారు#RamojiRao#RamojiRaoLivesOn #NaraChandrababuNaidu pic.twitter.com/9C0A3tdXIY
— Telugu Desam Party (@JaiTDP) June 9, 2024
Also Read: Ramoji Rao Born Again: రామోజీరావు మళ్లీ పుట్టారు, ఈనాడు ఛైర్మన్ పుట్టిన ఇంట్లో అదేరోజు చిన్నారి జననం