X

TS Omicron : ఒమిక్రాన్ ఎప్పుడైనా రావొచ్చు... తెలంగాణలో హైఅలర్ట్ !

ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్నందున కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని పిలుపునిచ్చింది.

FOLLOW US: 

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉందని తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు హెచ్చరించారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఆమెకు ఒమిక్రాన్ వైరస్ సోకిందన్న అనుమానతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లుగా చెప్పారు. ఫలితాలు వచ్చాక ఒమిక్రానా కాదా అనేది తెలుస్తుంది. ఒమిక్రాన్‌ నివారణకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.  ప్రజలు కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలన్నారు.  

Also Read : ఉద్యమకారులపై ఈటల ఆకర్ష్ .. బీజేపీలో వరుస చేరికలకు ప్లాన్ !

ఒమిక్రాన్‌ ఎప్పుడైనా దేశంలోకి రావొచ్చని శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. డెల్టా కంటే ఒమిక్రాన్‌ ఆరు రెట్లు వేగంగా విస్తరిస్తోంది. మూడ్రోజుల్లోనే 3 దేశాల నుంచి 24 దేశాలకు వ్యాప్తి చెందిందని శ్రీనివాసరావు గుర్తు చేశారు. ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోనివారు.. రెండో డోస్‌ టీకా తీసుకోవాల్సిన వారు కచ్చితంగా వ్యాక్సినేషన్‌కు వెళ్లాలని  విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల మంది రెండో డోస్ తీసుకోవాల్సి ఉందని.. వీరంతా వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారని గుర్తుశారు.. 

Also Read : శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?

కొత్త వేరియంట్‌ ఎంత ప్రమాదకరం అనేది మనం పాటించే కొవిడ్‌ నిబంధనల మీద ఆధారపడి ఉంటుందని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం  కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.  తెలంగాణలో మాస్క్‌ తప్పనిసరి చేసింది.. మాస్కు లేకుంటే రూ. వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయానికి వచ్చింది. బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని ప్రభుత్వం కోరింది. 

Also Read : ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపునకు సర్వం సిద్ధం.. కేసీఆర్ వద్ద ఫైల్, బస్సుల వారీగా పెరగనున్న వివరాలివే..

ఒమిక్రాన్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సుదీర్ఘంగా సమీక్షించారు. ముప్పు ఎలా ఉంటుందో తెలియకపోయినా ముందస్తుజాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. నాలుగు రోజులు గా కేసులు పెరుగుతున్నందున.. తెలంగాణకు బయటి నుంచి వచ్చే వాళ్ళు తప్పని సరిగా నెగటివ్ సర్టిఫికేట్ ఉండాలనే నిబంధన తీసుకు వచ్చారు. 

Also Read : ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపునకు సర్వం సిద్ధం.. కేసీఆర్ వద్ద ఫైల్, బస్సుల వారీగా పెరగనున్న వివరాలివే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: telangana cm kcr Korana Omikron DH Srinivasa Rao

సంబంధిత కథనాలు

Telangana Govt Vs Governer :  ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి దాడిపై వాకబు చేసిన గవర్నర్ తమిళిశై ! ప్రభుత్వంతో పెరుగుతున్న దూరం..  బెంగాల్ తరహా పరిస్థితులు వస్తాయా ?

Telangana Govt Vs Governer : ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి దాడిపై వాకబు చేసిన గవర్నర్ తమిళిశై ! ప్రభుత్వంతో పెరుగుతున్న దూరం.. బెంగాల్ తరహా పరిస్థితులు వస్తాయా ?

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Chiru KCR : చిరంజీవికి కేసీఆర్ ఫోన్ .. ఆరోగ్య పరిస్థితిపై ఆరా! ఇంకా ఏం చర్చించారంటే ?

Chiru KCR :  చిరంజీవికి కేసీఆర్ ఫోన్ .. ఆరోగ్య పరిస్థితిపై ఆరా! ఇంకా ఏం చర్చించారంటే ?

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్! నేడు నగరంలో కరెంట్ కట్.. ఈ టైంలోనే మీ ఏరియాలో అంతరాయం..

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్! నేడు నగరంలో కరెంట్ కట్.. ఈ టైంలోనే మీ ఏరియాలో అంతరాయం..

Breaking News Live: అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు.. కారణం ఏంటంటే..

Breaking News Live: అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు.. కారణం ఏంటంటే..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Stock Markets Crash: రక్త మోడుతోంది! సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 డౌన్‌.. మదుపర్ల కంటనీరు!!

Stock Markets Crash: రక్త మోడుతోంది! సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 డౌన్‌.. మదుపర్ల కంటనీరు!!

Plastic Surgery Tragedy : 75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ.. బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే "ఐ"లో విక్రమ్ అయ్యాడు ! ఇప్పుడు దారేంటి ?

Plastic Surgery Tragedy :  75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ..  బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే

Ravi shastri on Virat Kohli: విరాట్‌ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!

Ravi shastri on Virat Kohli: విరాట్‌ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!

Shraddha Kapoor: సాహో బ్యూటీ మేకప్ లేకుండా ఎలా ఉంటుందంటే... ఇదిగో ఇలా ఉంటుంది

Shraddha Kapoor: సాహో బ్యూటీ మేకప్ లేకుండా ఎలా ఉంటుందంటే... ఇదిగో ఇలా ఉంటుంది