అన్వేషించండి

Southwest Monsoon: ఈనెల 6న తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవాకాశం ఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

Telangana Weather Updates: ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 6న నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది

Rains In Telangana : దేశంలోకి నైరుతి రుతుపవనాలు(South West Monsoon) ముందే ప్రవేశించడంతోపాటు  చాలా వేగంగా దేశం నలువైపులా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావం అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా వర్షాలు కురవడంతోపాటు....వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత నెల 30న కేరళను తాకిన రుతుపవనాలు...కర్ణాటక(Karnataka) మీదుగా రాయలసీమ(Rayalaseema)లోకి ప్రవేశించాయి. ఈనెల 6న రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ  తెలిపింది. ఆదివారం హైదరాబాద్‌(Hyderabad)తోపాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది.

ఏపీలోకి రుతుపవనాలు
కేరళ(Kerala)లోకి ముందగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు....కర్ణాటక (Karnataka) మీదుగా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోకి ప్రవేశించాయి. చాలా రోజుల తర్వాత జూన్ 1, 2 తేదీల్లోనే రుతుపనాలు(Monsoon) రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభించడానికి రుతుపవనాలు రాక ఎంతో ఆవశ్యకం. రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశించిన రుతుపవనాలు క్రమంగా  రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలోనూ పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. ఈనెల 6న రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రాయలసీమలోకి రుతుపవనాల రాకతో తెలంగాణ(Telangana)లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆదివారం మొత్తం మబ్బులు పట్టి చిరుజల్లులు కురిశాయి. హైదారాబాద్‌(Hyderabad)లో అయితే భారీ వర్షమే కురిసింది. 

తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులు
నైరుతి రుతుపవనాల రాకను పురస్కరించుకుని తెలంగాణ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అసిఫాబాద్(Ashifabad) జిల్లా వాంకిడిలో ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జగిత్యాల(Jagtial) జిల్లా కోరుట్లలో పిడుగుపడి చెట్లు నేలకూలాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.  

మూడు రోజులు వర్షాలు
రాగల మూడురోజులపాటు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉపరితల ఆవర్తన ప్రభావంతో నల్గొండ(Nalgonda), ఖమ్మం, సూర్యాపేట(Suryapeta), మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డితోపాటు ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణశాఖ వెల్లడించింది. యాద్రాద్రి భువనగిరి జిల్లా వీరవెల్లిలో ఈదురుగాలులకు పశువుల కొట్టం రేకులు ఎగిరిపోయాయి.బీఎస్‌ తిమ్మాపురంలో ఫొటో స్టూడియో రేకులు పడిపోయి కంప్యూటర్లు, ప్రింటర్, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. బాచుప్పలో కోళ్లఫాం కూలిపోయింది. మెదక్‌ జిల్లా వల్లంపట్లలో పిడుగు పాటుతో పాడిగేదె మృతిచెందింది. అలాగే అసిఫాబాద్‌ జిల్లాలోని గుండి పెద్దవాగులో వంతెన కొట్టుకుపోయింది. జన్నారంలో ఇంటి కప్పు లేచిపోగా...కిష్టంపేటలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. అలాగే పలుచోట్ల మేకలు పిడుగుపాటుకు చనిపోయాయి. హైదరాబాద్‌లోనూ పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. 

నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. ఆదివారం కేరళలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించడంతోపాటు తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు, కర్ణాటక, ఏపీలోకి ప్రవేశించాయి. రతుపవనాల రాకతోనే తొలకరి జల్లులు కురిసి...రైతులు సాగుకు సిద్ధమవుతుంటారు. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు దకిణ భారతదేంలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు కారణమవుతాయి. వీటి రాకతో సకాలంలో వర్షాలు కురవడంతోపాటు....నదులు, రిజర్వాయర్లు నిండిపోతాయి. అందుకే రైతులు నైరుతి రుతుపవనాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. సకాలంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో  ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తన దుకాణాల వద్ద రద్దీ భారీగా పెరిగింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
Viral Video: రూ.10 కోసం ఇంత దారుణమా? - విశ్రాంత ఐఏఎస్‌పై బస్ కండక్టర్ దాడి, వైరల్ వీడియో
రూ.10 కోసం ఇంత దారుణమా? - విశ్రాంత ఐఏఎస్‌పై బస్ కండక్టర్ దాడి, వైరల్ వీడియో
Kumbh mela: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
TTD News: 'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
Sobhan Babu Birthday: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
Embed widget