Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 13 రివ్యూ... శ్వేత, ప్రసన్న ఎలిమినేషన్... ఎగిరి గంతులేసిన మనీష్
Bigg Boss Agnipariksha: బిగ్ అగ్నిపరీక్షకు ముగింపు పలికే సమయం దగ్గరైంది. ప్రస్తుతం ఉన్న 15 మంది కామనర్స్‌లో నుంచి ఎలిమినేషన్స్ మొదలయ్యాయి. ఆల్రెడీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అసలేం జరిగిందంటే..

Bigg Boss Agnipariksha- Latest Episode 13 Updates: బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇక ఎండ్ కాబోతోంది. అసలు బిగ్ బాస్ ఆట వచ్చే వారం నుంచి మొదలు కానుంది. ఈ మిగిలిన రెండు, మూడు రోజులు మరింత ఇంపార్టెంట్ కానున్నాయి. ఉన్న 15 మందిలోంచి శ్వేతను ఈ రోజు బయటకు పంపించారు. రెండు ఎల్లో కార్డులు వచ్చిన వాళ్లు.. రెడ్ కార్డ్‌కి అర్హులు.. అగ్ని పరీక్ష నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. అలా ఈ రోజు జరిగిన టాస్కులో శ్వేతకు మళ్లీ ఎల్లో కార్డ్ వచ్చింది. నవదీప్ ఏమో మళ్లీ ప్రసన్నకి ఎల్లో కార్డు ఇచ్చాడు. అలా శ్వేత, ప్రసన్నలను బయటకు పంపించేశారు. అసలు ఈ రోజు ఎపిసోడ్ ఎలా జరిగిందంటే..
ఎపిసోడ్ ప్రారంభంలోనే అభిజిత్ ఓ ఆఫర్ ఇచ్చాడు. ఎల్లో కార్డులు ఉన్న వాళ్లు ఈ రోజు టాస్క్ బాగా ఆడితే.. ఆ కార్డ్ వెనక్కి తీసుకుంటాను అన్నాడు. ఇక నవదీప్‌కు సర్ ప్రైజ్ అన్నట్టుగా దర్శకుడు తేజని తీసుకు వచ్చారు. మహేష్ బాబుతో రోడ్డు మీద షూటింగ్.. అప్పుడు నవదీప్ కనిపించాడు.. సమీర్ చెప్పడంతో ఆడిషన్ చేశాను.. రోడ్డు మీద దొరికాడు.. కెమెరా అంటే ఫియర్ ఉండేది కాదు.. అని నవదీప్ గురించి తేజ చెప్పాడు.
మంగళవారం పెట్టిన టాస్కులో కొన్ని జంటలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ జంటలు ఇష్టం లేకపోతే.. మార్చుకునే ఛాన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో నిన్న ఆటలో అరటిపండు అయిన కల్కిని ఈ రోజు శ్రీజ తీసుకుంది. ఇక ఈ రోజు ఆటలో అరటి పండుగా శ్రేయా మిగిలింది. శ్వేత మార్చుకోవాలని అనుకుంది.. కానీ చివరకు ఆప్షన్ లేకుండా మళ్లీ హరీష్‌తోనే జత కట్టేసింది.
మూటల టాస్క్‌ని ఈ రోజు నిర్వహించారు. ఎవరు ఎన్ని మూటలు తీసుకుంటారో మీ ఇష్టం.. దాని వల్ల నష్టమో లాభమో ఇప్పుడే చెప్పలేం.. అని టాస్క్ ఇచ్చారు. దీంతో పవన్, హరీష్, శ్రీజ ఇలా అందరూ బాగానే మూటల్ని సంపాదించారు. ఇక ఈ మూటలతో ఓ ఆట పెట్టారు. ఓ కంటెస్టెంట్ బల్ల మీద పడుకుని ఉంటే.. ఆ బల్ల మీదుండే రంధ్రాల్లోంచి ఆ మూటల్ని దూరం నుంచి గురి చూసి పడేయాలి.
ఆ టాస్కులో పవన్, మనీష్ ఎక్కువ మూటల్ని ఆ రంధ్రాల్లోంచి పడేసి టై చేశారు. దీంతో మళ్లీ పవన్, మనీష్‌కు టాస్క్ పెట్టారు. దూరం నుంచి మూటల్ని బాక్సులో వేసే ఈ టాస్కులో మనీష్ గెలిచాడు. దీంతో మనీష్ వద్దన్న ఎల్లో కార్డుని అభిజిత్ వెనక్కి తీసుకున్నాడు. దీంతో మనీష్ ఎగిరి గంతేశాడు. మనీష్ టీంలోని దివ్యకి ఓటింగ్ అప్పీల్ వచ్చింది.
ఆ తరువాత వరెస్ట్ ప్లేయర్స్ అంటూ శ్వేతకి ఎల్లో కార్డ్ ఇచ్చారు. అలా రెండు ఎల్లో కార్డులు రావడంతో ఆమెను బయటకు పంపించారు. అమ్మని బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకు రాలేకపోయాను అని చెప్పి ఎమోషనల్ అయింది. ఇక నవదీప్ వచ్చి మళ్లీ ప్రసన్నకి ఎల్లో కార్డ్ ఇచ్చాడు. దీంతో ప్రసన్న కూడా బయటకు వెళ్లాల్సి వచ్చింది. ప్రసన్న కూడా ఎమోషనల్ అయ్యాడు. ఈ షో తనకు సరిపడదని చెబుతూ ప్రసన్న ఎమోషనల్ అయ్యాడు. నాగకి సారీ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఈ రెండు రోజుల్లో ఎంత మందిని ఎలిమినేట్ చేస్తారు.. ఇంటి లోపలకు ఎంత మందిని తీసుకు వెళ్తారో చూడాలి.
Also Read:బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 11 రివ్యూ... మనీష్‌కు ఘోర పరాభవం - ఎగిరి గంతులేసిన శ్రేయా





















