అన్వేషించండి

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్‌ 11 రివ్యూ... మనీష్‌కు ఘోర పరాభవం - ఎగిరి గంతులేసిన శ్రేయా

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అంచనా వేసే టాస్కులో నాలుగు టాస్కుల్ని పెట్టి.. గెలిచిన వారిని లీడర్లుగా నియమించారు. సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Bigg Boss Agnipariksha - Top 5 Selection: బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సోమవారం నాటి ఎపిసోడ్‌లో అంచనా వేసే టాస్కుల్ని నిర్వహించారు. అంచనా వేసే టాస్కులో ఎవరి సత్తా ఏంటి? అన్నది అర్థం అవుతోంది. ఏ వస్తువు ఎంత బరువు ఉంటుంది? అన్నది కొన్ని సార్లు చూసి, ఇంకొన్ని సార్లు తాకి చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు టాస్కులో బిగ్ బాస్ టీం అలాంటి టాస్కులే కంటెస్టెంట్లకు ఇచ్చింది. ఈ క్రమంలో నాలుగు టాస్కుల్ని పెట్టి.. గెలిచిన వారిని లీడర్లుగా నియమించారు. చివరకు మిగిలిన ముగ్గురిలో వాదోపవాదాల తరువాత లీడర్‌ను నిర్ణయించారు. అసలు ఈ రోజు ఎలా జరిగిందో ఓ సారి చూద్దాం.

మరమరాలను పెట్టి.. అందులో సరిగ్గా 250 గ్రాముల్ని తీసుకోవాలని అన్నారు. దానికి దగ్గరగా కేవలం శ్రీజ మాత్రమే 210 గ్రాముల్ని తీసింది. దీంతో శ్రీజ ఆ టాస్కులో విన్ అయింది. కళ్యాణ్ పడాల, ప్రియల్ని తన టీంలోకి తీసుకుంది. అలా గ్రీన్ టీంకి శ్రీజ లీడర్ అయింది. ఆ తరువాత పాతి పెట్టిన చెరుకు గడల్లోంచి పెద్ద చెరుకు గడని తీసుకుని షాకిబ్ విజేతగా నిలిచాడు. అలా పవన్, దివ్యలను తీసుకుని ఎల్లో టీంకి షాకిబ్ లీడర్ అయ్యాడు. ఆపై స్ట్రాలు గెస్ చేసే టాస్కులో నాగ, హరీష్ టై అయ్యారు. నాగ తన ఛాన్స్ వదిలేసుకుని హరీష్‌కు లీడర్ షిప్ ఇచ్చాడు.

Also Read: బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 10 రివ్యూ.. అగ్ని పరీక్షలో ఏది రియల్? ఏది ఫేక్?.. మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు!

హరీష్ తన టీంలోకి ప్రసన్న, కల్కిలను తీసుకుని రెడ్ టీంను ఫార్మ్ చేశాడు. ఆపై బరువైన ఆలుగడ్డను తీసుకోవాలనే టాస్కులో శ్వేత విన్నర్‌గా నిలిచింది. నాగ, అనూషలను తీసుకుని శ్వేత బ్లూ టీంను ఏర్పాటు చేసుకుంది. చివరగా మనీష్, శ్రేయా, దాల్య మిగిలారు. మిగిలిన కంటెస్టెంట్ల ఓటింగ్‌తో శ్రేయా విన్నర్ అయింది. మనీష్‌కు ఒక్కరంటే ఒక్కరు కూడా చేయి ఎత్తలేదు. దాల్య కోసం కళ్యాణ్ పడాల మాత్రమే చేతులు ఎత్తాడు. అంటే మనీష్ పట్ల కంటెస్టెంట్లలో ఎంతటి వ్యతిరేకత, అసంతృప్తి ఉందో అర్థం అవుతోంది. అతని ఓవర్ స్మార్ట్, ఇంత వరకు ఒక్క సారి కూడా గెలవకపోవడం, టీం ఓడిపోతూ వస్తుండటంతో మనీష్‌కు ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు.

ఇక ఈ ఐదు టీంలకు నాలుగు లెవెల్స్‌లో బెలూన్ టాస్కుల్ని పెట్టారు. ప్రతీ లెవెల్‌లో చివరకు వచ్చిన కంటెస్టెంట్ తీసే రాడ్డు వల్ల కలర్స్ బెలూన్ల నుంచి బ్లాక్ బెలూన్ కిందకు పడుతూనే వచ్చింది. అలా ఫస్ట్ లెవెల్లోనే శ్వేత తీసిన రాడ్డు వల్ల బ్లాక్ బెలూన్ పడింది. శ్వేత టీం ఫస్ట్ రౌండ్‌లోనే ఆట నుంచి బయటకు వచ్చింది. అలా రెండో రౌండ్‌లో కల్కి వల్ల రెడ్ టీం అవుట్ అయింది. మూడో లెవెల్లో శ్రీజ వల్ల గ్రీన్ టీం ఓడింది. చివరి లెవెల్లో శ్వేత వల్ల షాకిబ్ ఎల్లో టీం అవుట్ అయింది. దీంతో శ్రేయా టీం గెలిచింది. శ్రేయా గెలవడమే కాకుండా.. ఇద్దరు ఎల్లో కార్డులున్న దాల్య, మనీష్‌లను కూడా గెలిపించినట్టు అయింది. శ్రేయా గెలవడంతో జడ్జ్‌లు సైతం ఎగిరి గంతులు వేశారు. శ్రీముఖి, శ్రేయా కలిసి తీన్మార్ స్టెప్పుల్ని కూడా వేశారు. ఇన్ని రోజులు ఆడటం లేదు.. అని అన్నావ్ కదా.. అమ్మా.. ఇది నీకోసమే అని గెలిచిన తరువాత శ్రేయా ఏడ్చేసింది.

టీం గెలవడం వల్ల వచ్చిన ఓట్ అప్పీల్ ఛాన్స్‌ని దాల్యకి ఇచ్చింది శ్రేయా. అయితే జడ్జ్‌లు మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్‌గా శ్రేయాను ఎంచుకున్నారు. అలా శ్రేయాకి కూడా ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది. ఇక మున్ముందు ఈ ఆటలో ఇంకెలాంటి పరిణామాలు జరుగుతాయో.. ఎవరి జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం.

Also Read: బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 9 రివ్యూ - అంతా వేస్ట్... ఎవ్వరికీ అర్హత లేదంటూ స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయిన జడ్జ్‌లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget