Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 10 రివ్యూ.. అగ్ని పరీక్షలో ఏది రియల్? ఏది ఫేక్?.. మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు!
Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష శనివారం నాటి ఎపిసోడ్‌లో జడ్జ్‌లు అసంతృప్తిని ప్రకటించగా, ఆదివారం ఎపిసోడ్ చాలా ఇంట్రస్ట్‌గా నడిచింది. ఏది రియల్ ఏది ఫేక్ అనే టాస్క్‌లో ఏం జరిగిందంటే..

Bigg Boss Agnipariksha - Episode 10 Review: బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఏది రియల్? ఏది ఫేక్? అనే ఆటను పెట్టారు. శనివారం నాడు జరిగిన టాస్కుని చూసిన తరువాత జడ్జ్‌లు అసంతృప్తితో స్టేజ్ మీద నుంచి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్లో శ్రీముఖి వచ్చి కంటెస్టెంట్ల వద్ద ప్రామిస్ తీసుకుంది. ఇకపై అయినా సరిగ్గా ఆడతామని చెబితేనే జడ్జ్‌లు వస్తారు అని శ్రీముఖి చెప్పింది. మీకు రాను రాను కసి తగ్గిపోతోంది అంటూ శ్రీముఖి కౌంటర్లు వేసింది. ఇక స్టేజ్ మీదకు వచ్చిన తరువాత బిందు మాధవి, అభిజిత్, నవదీప్ కూడా కంటెస్టెంట్ల మీద కౌంటర్లు వేశారు.
మోరల్లీ రైట్ అని, ఆ ఆలోచనలతో గేమ్ స్పాయిల్ చేసుకుంటున్నావ్ అంటూ మనీష్ మీద బిందు ఫైర్ అయింది. వేల మందిలో మీ 15 మంది వచ్చారు.. అది అదృష్టమా? అవకాశమో గానీ.. మీరు వాడుకోవడం లేదనిపిస్తోంది..అంటూ అభిజిత్ సలహాలు ఇచ్చాడు.. వంద శాతం ఇవ్వడానికి ప్రయత్నించండి అంటూ సజెస్ట్ చేశాడు. బిగ్ బాస్ ఇంట్లో ఎలా ఉంటుందో మాకు తెలుసు.. మేం అనుభవించాం కాబట్టే.. మీకు నేర్పిస్తున్నాం.. గెలిపించాలని ప్రయత్నిస్తున్నాం.. మాకు పరీక్షలు మీరు పెట్టకండి అని నవదీప్ కౌంటర్లు వేశాడు.
Also Read: ఫ్యాన్స్... దర్శక నిర్మాతలే నాకు ఇన్‌స్పిరేషన్ - అందరికీ రుణపడి ఉంటానన్న బాలయ్య
సంచాలక్‌లుగా వరెస్ట్ టాస్క్ ఆడిన మనీష్, షాకిబ్, పవన్‌ల మధ్య చర్చలు పెట్టించి.. ఎవరో ఒకరు లీడర్‌గా ఎంచుకోవాలని అన్నారు. దీంతో పవన్ లీడర్‌గా బయటకు వచ్చాడు. ఆ తరువాత శ్రియా, నాగ, శ్వేతలోంచి శ్వేత లీడర్ అయింది. ప్రియా, అనూష, హరీష్ నుంచి అనూష లీడర్‌గా, దివ్య, శ్రీజ, కల్కి నుంచి కల్కి లీడర్‌గా.. ప్రసన్న, దాల్య, పవన్ పడాల నుంచి పవన్ లీడర్‌గా ఫిక్స్ అయ్యారు. బ్లూ టీంకి పవన్, ఎల్లో టీంకి శ్వేత, గ్రీన్ టీంకి అనూష, రెడ్ టీంకి కల్కి, బ్లాక్ అండ్ వైట్ టీంకి కళ్యాణ్ పడాల లీడర్లుగా అయ్యారు.
ఏది రియల్ ఏది ఫేక్ అనే ఈ టాస్కులో కొన్ని వస్తువుల్ని, మనుషుల్ని ప్రవేశ పెట్టారు. ఇందులో ఏది రియల్ వస్తువు? ఎవరు సింగర్? ఎవరు స్కెచ్ ఆర్టిస్ట్ ఇలా అడిగారు. అయితే ఇందులో ఓ సారి ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకొచ్చి.. ఎవరు సింగర్? ఎవరు సింగర్ కాదు? అని చెప్పమంటే.. ఒక్కరంటే ఒక్కరు కూడా సరైన ప్రశ్నలు వేయలేకపోయారు. మరోసారి రెండు షూలను తీసుకు వచ్చి టేబుల్ మీద పెట్టారు. క్వశ్చన్ అడగక ముందే అందరూ ఆన్సర్ పెట్టేశారు. దీంతో నవదీప్, శ్రీముఖి కౌంటర్లు వేశారు. అంతా రియల్? ఫేక్ గేమ్ నడుస్తోంది కాబట్టి.. ఇది కూడా అలాంటిదే అని అనుకున్నారా? అంటూ దాల్య మీద నవదీప్ ఫైర్ అయ్యాడు. అసలు టాస్క్ ఏంటన్నది తరువాత చెప్పారు.
Every flame in Agnipariksha burns away illusions. 🔥
— Starmaa (@StarMaa) August 31, 2025
Fake or real... the fire never lies! Can the Rebels face the truth? 🎭
Agnipariksha streaming now exclusively on JioHotstar! 💫 #BiggbossTelugu9 #Biggboss9Agnipariksha #StreamingNow #JioHotstar #JioHotstarTelugu pic.twitter.com/WJ7sRTeCY1
ఆ రెండు షూల్లో నవదీప్‌కు సరిపోయే షూ ఏది? అనేది టాస్క్. కానీ చాలా మంది క్వశ్చన్ వినకుండానే ఆన్సర్ పెట్టేశారు. అలా చివరకు రెడ్ టీంకి, గ్రీన్ టీంకి రెండు పాయింట్లు రాగా.. చివరగా ఆ రెండు టీంలకు ఓ టాస్క్ పెట్టారు. ఈ చివరి టాస్క్‌ని ఆడేందుకు ప్రియా, శ్రీజ వచ్చారు. పవర్ గ్లాస్ ఏంటి? అనేది టాస్క్. ప్రియా ముందు వెళ్తున్నా కూడా నెట్టేసి మరీ ముందుకు వెళ్లి ఆన్సర్ పెట్టింది శ్రీజ. ఇలాంటి పనులు నేను చేయను అని కాస్త చీప్ లుక్ ఇచ్చింది ప్రియా. దీంతో నవదీప్ షాక్ అయ్యాడు. నేను అలా తోసుకుంటూ వెళ్లలేను అని ప్రియా చెప్పింది.
Also Read: హిజ్ నేమ్ ఈజ్ ప్రసాద్ బెహర - పర్ఫెక్ట్ కామెడీ పంచెస్... హిట్ వెబ్ సిరీస్‌లకు కేరాఫ్ అడ్రస్
ఇక ఈ టాస్కులో ప్రియా చెప్పిన సమాధానమే నిజమైంది. దీంతో గ్రీన్ టీం విన్నర్‌గా నిలిచింది. అలా అనూషకు ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది. కానీ హరీష్‌కు అవకాశం ఇచ్చింది. ఈ రోజు టాస్కులో సరిగ్గా పర్ఫామ్ చేయని షాకిబ్, శ్రియా, దాల్య, ప్రసన్న, పవన్ కళ్యాణ్ పడాలను శ్రీముఖి ప్రశ్నించింది. ఇక టాస్క్ ఏంటి? క్వశ్చన్ ఏంటి? అన్నది కూడా అర్థం చేసుకోకుండా ఆడిన దాల్యని వరెస్ట్ ప్లేయర్‌గా నవదీప్ ప్రకటించాడు. అసలు ఈ రోజు ఎవ్వరూ ఎక్కువ షైన్ అవ్వలేదని, గుడ్డిలో మెల్లగా మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్‌గా ప్రియాని ఎంచుకున్నారు. గుడ్డిలో మెల్ల అనే సరికి ప్రియా హర్ట్ అయింది. ఓట్ అప్పీల్ వద్దని చెప్పింది. కానీ అభిజిత్ నచ్చజెప్పి.. ఓట్ అప్పిల్‌కు పంపించాడు. ఇక మున్ముందు ఇంకెలాంటి టాస్కులు పెడతారు? ఈ 15 మంది లోంచి ఏ 5 గురు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తారో చూడాలి.





















