Prasad Behara: హిజ్ నేమ్ ఈజ్ ప్రసాద్ బెహర - పర్ఫెక్ట్ కామెడీ పంచెస్... హిట్ వెబ్ సిరీస్‌లకు కేరాఫ్ అడ్రస్
Prasad Behara: ప్రసాద్ బెహర... ఈ పేరు వింటేనే పర్ఫెక్ట్ కామెడీ పంచెస్ మనకు గుర్తొస్తాయి. యూట్యూబర్ నుంచి మూవీస్ వరకూ తనదైన డైలాగ్స్, యాక్టింగ్‌తో అదరగొడుతున్నారు. అసలెవరీ ప్రసాద్ బెహర అనేది చూస్తే...

Actor Prasad Behara Career Family Details: తొలుత ఆయన ఓ సాధారణ యూట్యూబర్. తొలుత కామెడీ రీల్స్ చేస్తూనే... యూ ట్యూబ్‌లో సాధారణ వీడియోలు చేసేవారు. వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో వెబ్ సిరీస్‌లు చేశారు. ఆ తర్వాత పలు టీవీ ఛానళ్లలో ప్రోగ్రామ్స్‌కు రైటర్‌గా పని చేశారు. అలా వెబ్ సిరీస్‌లు చేస్తూనే ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. సాధారణ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఫేమస్ యూట్యూబర్, యాక్టర్, రైటర్ ప్రసాద్ బెహర. అసలు ఎవరు ఈ ప్రసాద్, ఆయన ఫ్యామిలీ ఏంటి, యూట్యూబర్ నుంచి నటుడిగా ఆయన ఎలా ఎదిగారు అనే విషయాలు ఓసారి చూస్తే...
మన విశాఖ వాసే...
ప్రసాద్ బెహర అసలు పేరు బెహరా దుర్గా ప్రసాద్ రావు. ఆయన విశాఖలో పుట్టి పెరిగినా ఆయన ఫ్యామిలీది శ్రీకాకుళం. మూడేళ్ల వయసులోనే తండ్రి దూరమయ్యారు. తల్లి కష్టపడి ఆయన్ను, చెల్లెలిని పెంచారు. అప్పట్లో బెహరాస్, పాత్రోస్ వైజాగ్‌లో ఉండేవారు. చాలా ఏళ్ల క్రితం వైజాగ్ - ఒరిస్సా ఉండేది. సింహాచలం వచ్చే వాళ్లంతా కూడా ఒరియా వాళ్లే ఎక్కువ ఉండేవారు. ఎప్పుడైతే ఒరిశా ఆంధ్రా విడిపోయిందో బెహరాస్ పాత్రోస్ ఇక్కడే ఆంధ్రాలోనే ఉండిపోయారు. దీంతో ఆయనకు బెహరా అనే పేరు వచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రసాద్ బెహరగా పేరు మార్చుకున్నారు.
Also Read: ఆఫ్రికాలో ప్రియాంక చోప్రా ఫోటోస్ - నమ్రత రియాక్షన్... ట్రెండింగ్‌లో SSMB29
రూ.1500తో హైదరాబాద్‌కు
ప్రసాద్ బెహర తొలినాళ్లలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. తాను హైదరాబాద్‌కు రూ.1500తో వచ్చానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రసాద్. తొలుత తనను తాను రైటర్‌గా నిరూపించుకున్న తర్వాత యూట్యూబ్‌లో సిరీస్‌లవైపు అడుగులు వేశారు. కెరీర్ తొలిరోజుల్లో ఓ ప్రైవేట్ టీవీ ఛానల్‍లో ఓ కామెడీ సీరియల్‌కు మాటలు రాశారు. ఆ తర్వాత యూట్యూబ్ వైపు అడుగులు వేశారు.
కామెడీ పంచెస్... ట్రెండింగ్ వెబ్ సిరీస్
ప్రసాద్ బెహర వెబ్ సిరీస్ అంటేనే కామెడీ పంచెస్‌కు మారుపేరు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా కామెడీ, ఎమోషన్‌తో పాటు పర్ఫెక్ట్ డైలాగ్స్‌తో ఆయన సిరీస్‌లు రూపొందించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కరోనా రాక ముందే 'కరోనా ప్యార్ హై' అనే వీడియోతో ట్రెండింగ్‌లో నిలిచారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ హిట్ వెబ్ సిరీస్‌లు అందించారు.
ఆయన రూపొందించిన... పెళ్లివారమండి, మావిడాకులు, అందరి బంధువయ, వంటలక్క 2.O, సత్యానంద స్వామి, వివాహ భోజనంబు, క్లాస్‌మేట్స్ సిరీస్‌లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం 'కల్యాణం కమనీయం' వెబ్ సిరీస్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్నారు.
సిరీస్ To మూవీస్
ఓ వైపు యూట్యూబ్ వీడియోస్, వెబ్ సిరీస్‌లు చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ చాన్సెస్ దక్కించుకున్నారు ప్రసాద్. ఇటీవలే మెగా డాటర్ నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక బన్నీవాస్ సమర్పణలో మరో కామెడీ ఎంటర్‌టైనర్ 'మిత్ర మండలి' మూవీతో రాబోతున్నారు. ఈ మూవీ కొత్త దర్శకుడు ఎస్.విజయేంద్ర దర్శకత్వం వహిస్తుండగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
టోటల్ ఫన్... నో బోర్
ప్రస్తుతం యూత్ సహా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసేలా ప్రసాద్ బెహర వెబ్ సిరీస్‌లు ఉంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఫుల్ ఫన్‌తోనే ఆయన ఎంటర్‌టైన్ చేస్తుంటారు. ఆయన చేసిన వీడియోలు ఎక్కువగా నేచరల్, లైవ్లీగా అనిపిస్తుంటాయని చాలామంది కామెంట్స్ చేస్తుంటారు. ఎక్కడా బోర్ అనే పదానికి ఆస్కారం లేకుండా... ప్రసాద్ వెబ్ సిరీస్‌లు ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. పెట్టిన నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి.
పెళ్లి... డివోర్స్
ప్రసాద్ బెహర తనతో కలిసి నటించిన జాను నారాయణ అనే అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆయన... ఆ తర్వాత ఆమెతో డివోర్స్ తీసుకున్నట్లు చెప్పారు. అలాగే కెరీర్ పరంగా కాస్త ఇబ్బందులు సైతం ఎదుర్కొన్నారు ప్రసాద్. చాలా రోజుల క్రితం ఆయనపై తన సహచరి నటి చేసిన ఆరోపణలతో ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప్రస్తుతం ఓ వైపు వెబ్ సిరీస్‌లు మరోవైపు మూవీస్‌తో కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు.






















